రాజకీయ చదరంగంలో పదవ తరగతి విద్యార్థులను పావులుగా చేయకండి
•"ఆబాద్" పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్
10 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి చదివి తొలిసారిగా పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పదవ తరగతి విద్యార్థులను రాజకీయ చదరంగంలో పావులుగా ఉపయోగించుకోరాదని ఇది ఎంత మాత్రం సమంజసం కాదని దీనిని ఎవరు కూడా సమర్థించరని "ఆబాద్" పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి అని జరుగుతున్న తతంగం అంతా ఇంతా కాదు ఈ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం విద్యార్థులను, వారి కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తుంది. రాజకీయ ఆధిపత్యం కోసం కాకుండా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలకు సంబంధించి ఏదైనా సమాచారం బయటకు వచ్చింది అంటే వెంటనే ఆ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు గాని లేదా పోలీసు అధికారులకు గాని సమాచారం అందించి అనర్థం జరుగకుండా ఆపాలని అంతే కాని సోషల్ మీడియాలో అవసరానికంటే ఎక్కువ ప్రచారం చేయడం వల్ల అటు తాత్కాలికంగా ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొన్నా అంతిమంగా దాని ప్రభావం విద్యార్థులకు మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది ఇది మనం అందరం గుర్తించి పరీక్షల సక్రమ నిర్వహణకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేద్దాం.
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల పైనే ఉంటుంది. పరీక్షా కేంద్రాలలో పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లుగా వ్యవహరించే ఉపాధ్యాయులు నిబద్ధతతో వ్యవహరించాలని" ఆబాద్ పార్టీ" రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ పిలుపునిచ్చారు, ఒకరో ఇద్దరో తెలిసో, తెలియకో అమాయకంగా అనుకోకుండా అనైతిక పద్ధతులకు పాల్పడితే మొత్తం ఉపాధ్యాయులు ఆ నిందను మోయాల్సి వస్తుంది. కనుక ఎస్ ఎస్ సి పరీక్షల్లో ఏ విధమైన అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. తద్వారా మాత్రమే భావిభారత పౌరులుగా పదవ తరగతి విద్యార్థులను సైతం అందించినవారం అవుతామని "ఆబాద్" పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ కోరారు
Apr 06 2023, 15:00