ఏపీ. కృష్ణాజిల్లా :కదిలే ట్రైన్ ఎక్కాలని ఇద్దరు మిత్రులు సరదాగా వేసుకున్న పందెం కారణంగా, ఇంటర్మీడియట్ విద్యార్థి కాలు పోగొట్టుకున్నాడు.

కదిలే ట్రైన్ ఎక్కాలని ఇద్దరు మిత్రులు సరదాగా వేసుకున్న పందెం కారణంగా, ఇంటర్మీడియట్ విద్యార్థి కాలు పోగొట్టుకున్నాడు.

కృష్ణాజిల్లా గుడివాడలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు, గుడివాడ రైల్వే స్టేషన్ సమీపంలో క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆ సమయంలో స్టేషన్లోకి వస్తున్న గూడ్స్ రైలు ఎక్కాలని ఇద్దరు విద్యార్థులు సరదాగా పందెం కాసుకున్నారు. రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడడంతో ఇంటర్మీడియట్ విద్యార్థి కాలు పోగొట్టుకున్నాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆకతాయిగా వేసుకున్న పందెం కారణంగా, జీవితం నాశనం కావడంతో యువకుడి తల్లిదండ్రులు రోదిస్తున్నారు.

ఏపీ :2,156 SPO (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) తొలగించిన ఉద్యోగులను విధులలోకి తీసుకోవాలి: -ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు)

2,156 SPO (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) తొలగించిన ఉద్యోగులను విధులలోకి తీసుకోవాలి: -ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు)

.

ఈ రోజు అనంతపురం జిల్లా కలెక్టర్ కి _ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ప్రసాద్, ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి : వీరేందర్ జిల్లా కోశాధికారి బండారు శంకర్ మాట్లాడుతూ*

కరోనా సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 629 చెక్ పోస్ట్ లలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా 2,156 మందిని ప్రభుత్వం విధులలోకి తీసుకోవడం జరిగింది. వారికి ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా ప్రభుత్వం విధుల నుంచి తొలగించడం జరిగింది . ఎస్పీవోలుగా కరోనా సమయంలో రాత్రనకా పగలనకా కుటుంబాల్ని వదిలి మరి విధులను నిర్వహించిన ఫలితం లేకుండా పోయింది దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ గారిని కలవడం కూడా జరిగింది. ఇంతవరకు ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్ట్ లలో ఎస్పీఓ లను తొలగించడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలు అనేక రూపాలలో రాష్ట్రం లోకి రావడం రాష్ట్ర యువకులు దానికి బానిసలు కావడం జరుగుతున్నది కాబట్టి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం తొలగించినటువంటి ఎస్పీఓ లను వెంటనే విధులలోకి తీసుకోవాలి చెక్ పోస్ట్ లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని లేకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలకు శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నా కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా కమిటీ సభ్యులు మహేంద్ర, ఆనంద్, తిప్పే స్వామి, ఇక్బాల్ ,శ్రీనివాసులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

ఏపీ :నిజాయితీ మహిళ

నిజాయితీ మహిళ.

.

నేల మీద రూపాయి కనిపిస్తే అటు ఇటు చూసి జేబులో వేసుకునే ఈ రోజుల్లో లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు దొరికినా నిజాయితీతో స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించిన సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో జరిగింది. దీనికి సంబంధించి ఆలమూరు ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాలు ప్రకారం కోనసీమ జిల్లా అయినవిల్లి గ్రామానికి చెందిన యడ్ల సత్యవేణి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవమైన చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి దర్శనానికి ఆదివారం వచ్చారని, సుమారు లక్షా 30వేలు విలువ చేసే మూడు కాసుల బంగారపు పుస్తెలతాడు పాడేసుకున్నారని, అదే రోజున ఆలమూరు ఆడపడుచు అయిన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెంనకు చెందిన సింగులూరి మల్లేశ్వరి అమ్మవారి దర్శనానికి వచ్చారని, ఆ బంగారపు ఆభరణం ఆమెకు దొరకడంతో ఆలయం వద్ద బందోబస్తులో ఉన్న ఎస్సై శివప్రసాద్ కు అందజేయగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మైకుల ద్వారా ప్రసారం చేసిన ఎవరు రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద వస్తువులను భద్రపరిచారు. కాగా సోమవారం ఆ బంగారపు పుస్తెలతాడు మాదేనంటూ యడ్ల సత్యవేణి ఆధారాలను పోలీసులకు చూపడంతో వస్తువులను ఆమెకు అప్పగించారు. దొరికిన బంగారపు ఆభరణాలను ఎంతో నిజాయితీతో స్థానిక ఎస్సైకి అప్పగించి, పలువురికి ఆదర్శంగా నిలిచిన మల్లేశ్వరుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఘనంగా సత్కరించారు.

22 మంది గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన కృష్ణాజిల్లా పోలీసులు.

కరుడుగట్టిన గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు.

22 మంది గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన కృష్ణాజిల్లా పోలీసులు.

గంజాయి స్మగ్లర్ల పై ఉక్కు పాదం మోపే ప్రత్యేక కార్యచరణ రూపొందించి ఫలితాలు రాబట్టిన కృష్ణా జిల్లా పోలీసులు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 పోలీస్ స్టేషన్లో,22 మంది ముద్దాయిల అరెస్ట్,40 కిలోల గంజాయి,3 గ్రాములు MDMA, ఆటో, బైక్,16 సెల్ఫోన్ స్వాధీనం.

గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు, రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ.

గంజాయి కేసులో చిక్కుకున్న ప్రతి ఒక్కరి వయసు 30 ఏళ్లలోపే. క్షణికానందం కోసం గంజాయి, మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఉన్నత అభివృద్ధిని సాధించాల్సిన వయసులో కేసులపాలై జీవితాలను ఆగాధం చేసుకుంటున్నారు. అలా NDPS act కు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టి మాదిక విభయాలు గంజాయి వంటి వాటిని వినియోగం విక్రయాలు నిర్వహిస్తూ వున్న వారందరినీ అదుపులోనికి తీసుకొని ఇకపై వారు గంజాయి విక్రయాలకు, రవాణాకు మరలకుండా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా 5 పోలీస్ స్టేషన్లో మొత్తం 22 మంది ముద్దాయిలను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి 40 కిలోల గంజాయిని సీజ్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయావరణంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారి యొక్క కేసు పూర్వాపరాలను జిల్లా ఎస్పీ గారు వివరించారు.

జిల్లా వ్యాప్తంగా గంజాయి, ఇతర మత్తుపదార్ధాలు, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు, రవాణాకు పాల్పడుతున్న 22 మందిని అదుపులోనికి తీసుకోవడం జరిగింది. వారి యొక్క వివరాలు.

రాబర్సన్ పేట పోలీస్ స్టేషన్

1. దారపురెడ్డి సాయి కుమార్ తండ్రి పేరు మురళీకృష్ణ 25 సంవత్సరాలు.

2. తుంగల చందు తండ్రి పేరు నరసింహారావు 21 సంవత్సరాలు మచిలీపట్నం

3. దాసరి ప్రజ్వల్ కుమార్ తండ్రి పేరు సురేష్ 21 సంవత్సరాలు పోతేపల్లి

4. కొండరపు లోవరాజు తండ్రి పేరు నూకరాజు 25 సంవత్సరాలు విశాఖపట్నం.ఇతను గంజాయి సరఫరాలో ప్రధాన నిందితుడు. ఇతను జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో 6 కేసులు కలవు.

5. డొక్కు కాటంరాజు శ్రీనివాసరావు 21 సంవత్సరాలు యాదవ మచిలీపట్నం

6. పాలిశెట్టి పవన్ కుమార్ తండ్రి పేరు పాండురంగారావు 20 సంవత్సరాలు మచిలీపట్నం.

7. నూలు సాయి తండ్రి బ్రహ్మం 22 సంవత్సరాలు మచిలీపట్నం.

వీరందరిపై 02.04.2023 తేదీన అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది వీరంతా ఆర్థికపరంగా వెనుకబడిన కుటుంబాలైనప్పటికీ చిన్న చిన్నలకు వ్యసనాలకు బానిసలై, క్షణికానందాన్ని ఇచ్చే గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలకు పాల్పడుతూ, వీరే కాక మరి కొంతమందిని యువతను పక్కదోవ పట్టిస్తూ, నేర ప్రవృత్తి కలిగి ఉన్నారు అంతేకాక వేరే ప్రాంతాలకు కూడా గంజాయిని ఎగుమతి చేస్తూ విక్రయిస్తున్నట్లుగా విచారణలో వెళ్లడయింది. వీరి వద్దనుండి 13 కేజీ ల గంజాయి స్వాధీనం చేసుకొని ఆటో, బైక్ను సీజ్ చేయడం జరిగింది.

గూడూరు పోలీస్ స్టేషన్

1.బలుపూరి కిషోర్ తండ్రి పేరు శ్రీను 19 సంవత్సరాలు మలవోలు

2. పితా రవితేజ తండ్రి పేరు శ్రీనివాసరావు 20 సంవత్సరాలు రేపల్లె.

3. అమృతలూరి దయాకర్ తండ్రి పేరు భాస్కరరావు 17 సంవత్సరాలు బేతపూడి.

పై ముగ్గురు నేరస్తులు IT చదువును పూర్తి చేసుకొని ఒకవైపు ప్రవేటు ఉద్యోగాలు చేస్తూనే సులభ సంపాదన కోసం గంజాయి అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వారి వద్ద నుండి 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో ఇదివరకే వీరిపై రెండు కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవ్వడమే కాక వీరంతా కూడా 30 ఏళ్లలోపు వారే అవ్వటం బాధాకరం.

గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్

1.బండి తంబి తండ్రి పేరు కోటేశ్వరరావు 25 సంవత్సరాలు అంగులూరు

2. కొండ రాకేష్ తండ్రి పేరు జోసెఫ్ 23 సంవత్సరాలు గుడ్లవల్లేరు

3. కాటూరి సుబ్రహ్మణ్యం తండ్రి తండ్రి పేరు కృష్ణ 28 సంవత్సరాలు ఉయ్యూరు.

4. మహమ్మద్ అక్బర్ బాషా తండ్రి నాగూర్ భాష 22 సంవత్సరాలు గుడ్లవల్లేరు.

5. పెనుమూడి చందు తండ్రి పేరు నాగపూత రాజు 23 సంవత్సరాలు ముదినేపల్లి

6. మర్రి మెక్ మిలన్ తండ్రి పేరు 25 సంవత్సరాలు మండవల్లి

పై ముద్దాయి లందరూ గంజాయిని విక్రయాలకు పాల్పడుతూ విద్యాలయాలలో గ్రామ మారుమూల శివారు ప్రాంతాలలో అమ్మకాలు జరుపుతూ సులభ మార్గంలో డబ్బు సంపాదించడమే కాక మత్తుకు బానిసలై అనేక అల్లరి కార్యక్రమాలకు కూడా తెగబడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి వీరిని అదుపులోనికి తీసుకొని వీరి వద్దనుండి 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఆత్కూరు పోలీస్ స్టేషన్

1. నాగిరెడ్డి తరుణ్ తండ్రి పేరు మహేశ్వరరావు 22 సంవత్సరాలు విజయవాడ

2. రేసభు చంద్రశేఖర్ రెడ్డి పేరు చలపతి రెడ్డి 27 సంవత్సరాలు గాజువాక

3. లండ ప్రేమ్ కిరణ్ తండ్రి సత్యనారాయణ 24 సంవత్సరాలు విజయవాడ.

4. ఏపూరి బాబురావు తండ్రి వెంకటేశ్వరరావు 20 సంవత్సరాలు విజయవాడ

ఇతను బీటెక్ విద్యను అభ్యసిస్తున్న సమయంలో చెడు వ్యసనాలకు బానిసై అదే సమయంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు అంతేకాక తన తోటి సహచర విద్యార్థులకు కూడా గంజాయిని విక్రయిస్తూ చెడు నడత కలిగి ఉన్నాడు.

పై రెండు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులలో ఇద్దరు ముద్దాయిలని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి 3 కేజీల గంజాయిని మరియు 3 గ్రాముల HD డ్రగ్, 3 సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది.

పెనమలూరు పోలీస్ స్టేషన్

1. ఘట్టమనేని సాయి ప్రసాద్ తండ్రి పేరు లక్ష్మీ ప్రసన్న 19 సంవత్సరాలు గంగూరు

2. గోరంట్ల కిరణ్ తండ్రి పేరు శ్రీను 22 సంవత్సరాలు గోసాల

విరి వద్ద నుండి 4 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ నేటి యువతపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ప్రత్యక్షంగా లేకపోవడం, వారు ఎవరి స్నేహంలో ఉన్నారో గమనించుకోకపోవడం, చెడు స్నేహాల బారిన పడి బంగారు భవిష్యత్తును యువత కాలరాసుకుంటున్నారు. ఇందులో ఆరుగురు బీటెక్, ఉన్నత విద్య అభ్యసించిన వారు, నలుగురు ఐటిఐ , ఇద్దరు డిగ్రీ పూర్తి చేసిన వారు ఉండడం చాలా బాధాకరమైన విషయం. వీరంతా వీరి ఫోన్లో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరితో ఒకరు పరిచయాలు ఏర్పాటు చేసుకుని అక్రమ రవాణా వినియోగం వికారాలు నిర్వహిస్తున్నారు. బీర్లు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న లోవరాజును ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో చాకచక్యంగా పట్టుకున్నారు. అంతేకాక ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తనపై గమనించుకుంటూ ఉంటూ, వారి స్నేహాల పైన పూర్తి పర్యవేక్షణ ఉండాలి. ఎవరైనా మాదక ద్రవ్యాల వినియోగం విక్రయాలు రవాణా వంటి వాటికి పాల్పడితే వారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైక్యోటోపిక్ సబ్ స్టెన్స్ ఆక్ట్-1985 (NDPS act) ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందని, నిషేధించబడిన మత్తు పదార్థాలను ఎవరైనా కలిగి ఉన్న వారికి 10 సంవత్సరాలు నుండి 20 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష మరియు లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చు జరిమానా మొత్తం ఇంకా అధికంగానే ఉండవచ్చు.

 గంజాయి మొక్కల సంబంధించిన నిబంధనలు ఉల్లంగిస్తే వారిపై 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు లక్ష రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది.

ఇలా చిన్నచిన్న క్షణికానందాలకు పోయి కేసుల పాలు కావద్దని, ఎన్నిసార్లు కేసులు నమోదైనప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకుంటే, వారిపై PD act ను అమలుపరిచేలా కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి వస్తుందని కనుక సన్మార్గంలో నడవవలసిన యువత పెడత్రోవ పడితే పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయని ఎస్పీ గారు హెచ్చరించారు. అంతేకాక ఈ కేసులో ఉన్న వారందరిని విచారణ జరిపి దీని మూలాలు ఎక్కడ వున్న వాటిని తేల్చితం గంజాయి కి సంబంధించిన ఏ చిన్న సమాచారం ఉన్న నేరుగా తెలియజేయవచ్చు తెలిపిన వారి యొక్క వివరాలు గోపియంగా ఉంచబడతాయి అలాగే వీరందర్ని అదుపులోనికి తీసుకోవడానికి ప్రత్యేకంగా కృషిచేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.

నల్గొండ జిల్లా :నకిరేకల్.మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న. నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు.

మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు.

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ మండలపరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై అధికారులతో చర్చి. అనంతరం ఎంపీపీ శ్రీదేవి మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు: ఐకేపి అధికారులు మరియు సిబ్బంది రైతులు ధాన్యం పోయడాకి త్వరితగతిన స్థాలాలు ఏర్పాటు చేయాలని, ఐకేపి సెంటర్ల నిర్వహనపై తన రోజువారి పర్యవేక్షణ వుంటుందని,ధాన్యం కొనుగోలు విషయంలో ఏఒక్క అధికారి నిర్లక్ష్యం వహించిన సహించేది లేదని సంబందిత అధికారులకు ఏంపీపి సూచించారు.

త్రాగునీరు:

వేసవి కాలం కనుక గ్రామాల్లో నీటి ఎద్దడితలెత్తకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది అలర్టుగా వుండాలి, నీటిసమస్య తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావలని సంబందిత అధికారులను అదేషించిన ఏంపీపి శ్రీదేవిగంగాధర్ రావు.

(ఈకార్యక్రమంలో)

ఏండివో అండాలు, జడ్పి కోఆప్షన్ సబ్యుడు జాన్ శాస్తి, మండలంలోని అన్నిశాఖల అధికారులు, మండలంలోని గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచ్ లు, మండలపరిషత్ అధికారులు&సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఏపీ :తాడేపల్లి::మంత్రులు, ఎమ్మెల్యేలతో ముగిసిన సీఎం జగన్ సమావేశం*

తాడేపల్లి:

మంత్రులు, ఎమ్మెల్యేలతో ముగిసిన సీఎం జగన్ సమావేశం

ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టంగా తెలిపిన సీఎం

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సీఎం కామెంట్స్:

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు.

21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే.. 17 స్థానాల్లో మనం గెలిచాం.

మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం.

ఉన్నది లేనట్టుగా,లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు

ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి

ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు

అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది.

ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి

అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు

వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు

ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికైతే మంచి చేశామో… వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువ

కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు.

ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ అవుతుంది

అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు

ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి జరిగింది

ఒక వాపును చూపించి, అది బలం అని చూపిస్తున్నారు

కైకిలపోయి మిర్చి కోసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా.

కైకిలపోయి మిర్చి కోసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

ఆదివారం సెలవు రోజున మిరుప తోటలో కూలీలతో కలిసి మిర్చి కోసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్

రైతు కూలీగా గడపడం గొప్ప వరం

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్

ములుగు : వారమంతా విధి నిర్వహణలో బిజీగా గడిపే సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఆదివారం సెలవు రోజున కైకిలపోయి మిరుప తోటలో కూలీలతో కలిసి మిర్చి కోశారు,

ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ పంచాయితీ పరిధి చిన్నగుంటూరుపల్లి గ్రామానికి చెందిన దేవిరెడ్డి జయలక్ష్మి - వెంకటస్వామిరెడ్డి దంపతుల మిరుప తోటలో కూలీలతో మమేకమై ఉదయం 6గ,ల నుండి మధ్యాహ్నం 1 గ,ల వరకు మిర్చి కోశారు,మహిళలతో కలిసి అన్నం తిన్నారు,

పని చేసినందుకు గాను 200/ రూ,కూలీగా తీసుకున్నారు, ఆ డబ్బులను ఓ పేద మహిళ కూలీకి తస్లీమా అందించారు,

వ్యవసాయ పనులు చేయడం తనకు ఇష్టమని, రైతుల గడపడం గొప్పవరమని తస్లీమా అన్నారు,

యువకులు ఖాళీ సమయాలలో కాలాన్ని వృధా (కాలక్షేపం) చేయకుండా వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు సహకరించాలని తస్లీమా కోరారు.

ఆ రూమర్లను కొట్టిపారేసిన. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.

ఆ రూమర్లను కొట్టిపారేసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిణామాలపై గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుల్‌స్టాప్‌ పెట్టారు.

ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్‌మీడియాతో పాటు యెల్లో బ్యాచ్‌ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారాయన.

సోమవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు పాల్గొన్న సమావేశంలో సీఎం జగన్‌.. తాజా రాజకీయ ప్రచారాలపై మాట్లాడారు.

షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన సీఎం జగన్‌.. మంత్రుల మార్పుల సహా, ఇతరత్రా రూమర్లపైనా ఎమ్మెల్మేలతో చర్చించారు. రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు మరిన్ని వస్తాయన్న ఆయన.. వాటిని అంతే బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.

నాక్సల్స్ ఎన్కౌంటర్ : ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత..?

నాక్సల్స్ ఎన్కౌంటర్ : ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత..?

రాంచీ: ఝార్ఖండ్‌ (Jharkhand)లోని నక్సల్స్‌ (Naxals) కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది. ఛత్రా (Chatra) అడవుల్లో మావోయిస్టులపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు..

వీరిలో రూ.25లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు (Maoist) అగ్రనేత కూడా హతమైనట్లు తెలుస్తోంది.(Naxals Encounter)

ఛత్రా-పాలము సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్‌ (CRPF కోబ్రా యూనిట్ ) ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపైకి మావోయిస్టులు కాల్పులు జరపగా.. జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో రెండు ఏకే-47 తుపాకులు సహా పెద్దమొత్తంలో ఆయుధాలు లభించినట్లు ఝార్ఖండ్‌ పోలీసులు వెల్లడించారు. చనిపోయిన ఇద్దరు మావోయిస్టులపై రూ.25లక్షల రివార్డు, మరో ఇద్దరు నక్సల్స్‌పై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు..

నక్సల్స్‌ ముఠాకు చెందిన స్పెషల్‌ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్‌ పాసవాన్‌ ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అతడి తలపై రూ.25లక్షల రివార్డు ఉంది. అయితే గౌతమ్‌ మృతిపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది కూంబింగ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది..

నల్గొండ జిల్లా :కేతపల్లి :ప్రజలకు దాహార్తి తీర్చడానికే చలివేంద్రాలు, ప్రాణదాతలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మెరుగుమల్ల. రాజ్*

ప్రజలకు దాహార్తి తీర్చడానికే చలివేంద్రాలు, ప్రాణదాతలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మెరుగుమల్ల. రాజ్

.

Streetbuzz news. నల్గొండ జిల్లా ::

ప్రజలకు వేసవిలో దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రాణదాతలు పౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు చేశామన్నారు . వ్యవస్థాపకులు రాజు.. అనంతరం రాజు మాట్లాడుతూ.కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా మాజీ ఎంపిటిసి కీర్తి లక్ష్మి వెంకన్న గౌడ్ పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ ఉన్నవారికి నీళ్లు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కీర్తి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు చేసిన ప్రాణదాతలు ఫౌండేషన్ చైర్మన్ గ్రూపు సభ్యులని అభినందించారు. ప్రతి ఒక్కరూ సమాజసేవకు పాటుపడాలని ఆకాంక్షించారు. మన గ్రామ వాస్తవాడైన మెరుగు మల్ల రాజ్ మానవసేవే మాధవసేవే అంటూ ప్రతి నిమిషం ప్రజల శ్రేయస్ కోసమే పాటుపడుతూ రక్తదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భం గా రక్తదానం చేసే విధంగా తోడ్పడుతూ బాధితుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతూ ముందుకు సాగుతూ మరెన్నో కార్యక్రమాలు ముందు ముందు సేవలు చేయాలని ఆ భగవంతున్ని మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో.కీర్తి వెంకన్న మేరుగుమల్ల బిక్షం పాండు నాగయ్య రాములు ఉపేందర్ సతిరెడ్డి కృష్ణ రెడ్డి ప్రభాకర్ అనిల్ నాగయ్య సైదులు అశోక్ రమేష్ గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.