నల్గొండ జిల్లా :నకిరేకల్.మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న. నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు.

మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు.

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ మండలపరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై అధికారులతో చర్చి. అనంతరం ఎంపీపీ శ్రీదేవి మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు: ఐకేపి అధికారులు మరియు సిబ్బంది రైతులు ధాన్యం పోయడాకి త్వరితగతిన స్థాలాలు ఏర్పాటు చేయాలని, ఐకేపి సెంటర్ల నిర్వహనపై తన రోజువారి పర్యవేక్షణ వుంటుందని,ధాన్యం కొనుగోలు విషయంలో ఏఒక్క అధికారి నిర్లక్ష్యం వహించిన సహించేది లేదని సంబందిత అధికారులకు ఏంపీపి సూచించారు.

త్రాగునీరు:

వేసవి కాలం కనుక గ్రామాల్లో నీటి ఎద్దడితలెత్తకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది అలర్టుగా వుండాలి, నీటిసమస్య తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావలని సంబందిత అధికారులను అదేషించిన ఏంపీపి శ్రీదేవిగంగాధర్ రావు.

(ఈకార్యక్రమంలో)

ఏండివో అండాలు, జడ్పి కోఆప్షన్ సబ్యుడు జాన్ శాస్తి, మండలంలోని అన్నిశాఖల అధికారులు, మండలంలోని గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచ్ లు, మండలపరిషత్ అధికారులు&సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఏపీ :తాడేపల్లి::మంత్రులు, ఎమ్మెల్యేలతో ముగిసిన సీఎం జగన్ సమావేశం*

తాడేపల్లి:

మంత్రులు, ఎమ్మెల్యేలతో ముగిసిన సీఎం జగన్ సమావేశం

ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టంగా తెలిపిన సీఎం

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సీఎం కామెంట్స్:

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు.

21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే.. 17 స్థానాల్లో మనం గెలిచాం.

మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం.

ఉన్నది లేనట్టుగా,లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు

ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి

ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు

అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది.

ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి

అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు

వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు

ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికైతే మంచి చేశామో… వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువ

కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు.

ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ అవుతుంది

అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు

ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి జరిగింది

ఒక వాపును చూపించి, అది బలం అని చూపిస్తున్నారు

కైకిలపోయి మిర్చి కోసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా.

కైకిలపోయి మిర్చి కోసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

ఆదివారం సెలవు రోజున మిరుప తోటలో కూలీలతో కలిసి మిర్చి కోసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్

రైతు కూలీగా గడపడం గొప్ప వరం

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్

ములుగు : వారమంతా విధి నిర్వహణలో బిజీగా గడిపే సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఆదివారం సెలవు రోజున కైకిలపోయి మిరుప తోటలో కూలీలతో కలిసి మిర్చి కోశారు,

ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ పంచాయితీ పరిధి చిన్నగుంటూరుపల్లి గ్రామానికి చెందిన దేవిరెడ్డి జయలక్ష్మి - వెంకటస్వామిరెడ్డి దంపతుల మిరుప తోటలో కూలీలతో మమేకమై ఉదయం 6గ,ల నుండి మధ్యాహ్నం 1 గ,ల వరకు మిర్చి కోశారు,మహిళలతో కలిసి అన్నం తిన్నారు,

పని చేసినందుకు గాను 200/ రూ,కూలీగా తీసుకున్నారు, ఆ డబ్బులను ఓ పేద మహిళ కూలీకి తస్లీమా అందించారు,

వ్యవసాయ పనులు చేయడం తనకు ఇష్టమని, రైతుల గడపడం గొప్పవరమని తస్లీమా అన్నారు,

యువకులు ఖాళీ సమయాలలో కాలాన్ని వృధా (కాలక్షేపం) చేయకుండా వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు సహకరించాలని తస్లీమా కోరారు.

ఆ రూమర్లను కొట్టిపారేసిన. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.

ఆ రూమర్లను కొట్టిపారేసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిణామాలపై గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుల్‌స్టాప్‌ పెట్టారు.

ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్‌మీడియాతో పాటు యెల్లో బ్యాచ్‌ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారాయన.

సోమవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు పాల్గొన్న సమావేశంలో సీఎం జగన్‌.. తాజా రాజకీయ ప్రచారాలపై మాట్లాడారు.

షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన సీఎం జగన్‌.. మంత్రుల మార్పుల సహా, ఇతరత్రా రూమర్లపైనా ఎమ్మెల్మేలతో చర్చించారు. రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు మరిన్ని వస్తాయన్న ఆయన.. వాటిని అంతే బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.

నాక్సల్స్ ఎన్కౌంటర్ : ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత..?

నాక్సల్స్ ఎన్కౌంటర్ : ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత..?

రాంచీ: ఝార్ఖండ్‌ (Jharkhand)లోని నక్సల్స్‌ (Naxals) కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది. ఛత్రా (Chatra) అడవుల్లో మావోయిస్టులపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు..

వీరిలో రూ.25లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు (Maoist) అగ్రనేత కూడా హతమైనట్లు తెలుస్తోంది.(Naxals Encounter)

ఛత్రా-పాలము సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్‌ (CRPF కోబ్రా యూనిట్ ) ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపైకి మావోయిస్టులు కాల్పులు జరపగా.. జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో రెండు ఏకే-47 తుపాకులు సహా పెద్దమొత్తంలో ఆయుధాలు లభించినట్లు ఝార్ఖండ్‌ పోలీసులు వెల్లడించారు. చనిపోయిన ఇద్దరు మావోయిస్టులపై రూ.25లక్షల రివార్డు, మరో ఇద్దరు నక్సల్స్‌పై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు..

నక్సల్స్‌ ముఠాకు చెందిన స్పెషల్‌ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్‌ పాసవాన్‌ ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అతడి తలపై రూ.25లక్షల రివార్డు ఉంది. అయితే గౌతమ్‌ మృతిపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది కూంబింగ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది..

నల్గొండ జిల్లా :కేతపల్లి :ప్రజలకు దాహార్తి తీర్చడానికే చలివేంద్రాలు, ప్రాణదాతలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మెరుగుమల్ల. రాజ్*

ప్రజలకు దాహార్తి తీర్చడానికే చలివేంద్రాలు, ప్రాణదాతలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మెరుగుమల్ల. రాజ్

.

Streetbuzz news. నల్గొండ జిల్లా ::

ప్రజలకు వేసవిలో దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రాణదాతలు పౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు చేశామన్నారు . వ్యవస్థాపకులు రాజు.. అనంతరం రాజు మాట్లాడుతూ.కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా మాజీ ఎంపిటిసి కీర్తి లక్ష్మి వెంకన్న గౌడ్ పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ ఉన్నవారికి నీళ్లు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కీర్తి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు చేసిన ప్రాణదాతలు ఫౌండేషన్ చైర్మన్ గ్రూపు సభ్యులని అభినందించారు. ప్రతి ఒక్కరూ సమాజసేవకు పాటుపడాలని ఆకాంక్షించారు. మన గ్రామ వాస్తవాడైన మెరుగు మల్ల రాజ్ మానవసేవే మాధవసేవే అంటూ ప్రతి నిమిషం ప్రజల శ్రేయస్ కోసమే పాటుపడుతూ రక్తదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భం గా రక్తదానం చేసే విధంగా తోడ్పడుతూ బాధితుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతూ ముందుకు సాగుతూ మరెన్నో కార్యక్రమాలు ముందు ముందు సేవలు చేయాలని ఆ భగవంతున్ని మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో.కీర్తి వెంకన్న మేరుగుమల్ల బిక్షం పాండు నాగయ్య రాములు ఉపేందర్ సతిరెడ్డి కృష్ణ రెడ్డి ప్రభాకర్ అనిల్ నాగయ్య సైదులు అశోక్ రమేష్ గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా.... నెల్లూరు నగరంలోని గుర్రాల మడుగు సంఘంలో ఏడాదిన్నర పాప కిడ్నాప్.

*నెల్లూరు జిల్లా....

నెల్లూరు నగరంలోని గుర్రాల మడుగు సంఘంలో ఏడాదిన్నర పాప కిడ్నాప్.

 తెల్లవారు జామున ఊయలలో ఉన్న పాపను ఎత్తుకెళ్లిన దుండగులు...

ఊయలలో బొమ్మను ఉంచి పాపను ఎత్తుకెళ్లిన వైనం...

-పోలీసులకు ఫిర్యాదు చేసిన పాప తల్లిదండ్రులు అనూష, మణికంఠ...

తెల్లవారుజామున పాపను ఎత్తుకెళ్లినట్లుగా భావిస్తున్న తల్లిదండ్రులు...

ఏపీ :మడికి గ్రామపంచాయతీ @75 వసంతాలు. పంచాయతీ ఆవిర్భావం 3 ఏప్రిల్ 1949.ఇప్పటి వరకూ 11 మంది సర్పంచులు

మడికి గ్రామపంచాయతీ వసంతాలు

పంచాయతీ ఆవిర్భావం 3 ఏప్రిల్ 1949

ఇప్పటి వరకూ 11 మంది సర్పంచులు

నాలుగు లైన్ల జాతీయ రహదారి చెంతన అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్‌తో కళకళలాడుతూ ఉండే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామపంచాయతీ 75వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ పంచాయతీ 1949 ఏప్రిల్‌ 3 న ఆవిర్భవించింది. అప్పటినుంచి అంచలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ గ్రామానికి చిలకలపాడు, మల్లావానితోట శివారు గ్రామాలుగా ఉన్నాయి. ఈ గ్రామానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇటు కోనసీమకు అటు తూర్పుగోదావరి జిల్లాకి సరిహద్దు గ్రామం ఇది. ఇక్కడి కూరగాయల మార్కెట్ కు రాష్ట్ర నలుమూలన నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు అక్కడకు దిగుమతి చేసుకుంటారు.ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. అనతి కాలంలోనే ఈ మార్కెట్ విశేష గుర్తింపు పొందింది.

గ్రామ చరిత్ర ఇది ...

పావన గౌతమీ గోదావరికి కూత వేటు దూరంలో ఉన్న మడికి గ్రామానికి పురాణ ప్రాశస్త్యం ఉంది. దేవతాకాలంలో మణికర్ణిక అనే మహిళ ఇక్కడ ఘోర తపస్సు ఒనరించినట్లు చరిత్ర ఆధారాలను బట్టి తెలుస్తుంది. నారద మహాముని ప్రేరణతో ఆమె ఏకాదశ రుద్రుల్లో ఒకరైన సోమేశ్వర స్వామిని ప్రతిష్టించగా, నారదుడు నవ జనార్ధనుని ప్రతిష్టలో భాగంగా రెండవ ఆలయం ఎక్కడ నిర్మించినట్లు నేటికీ సజీవ సాక్షాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఒకే ప్రాంగణంలో శివ-విష్ణువాలయాలు ఉండడం ఈ గ్రామ విశేషం. మణికర్ణికచే ఆలయ నిర్మాణం జరగడంతో ఆ గ్రామానికి మణిక అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కాలంలో మడికి గా రూపాంతరం చెందింది.

75 ఏళ్లలో 11 మంది సర్పంచులు

75 ఏళ్ల చరిత్ర గల ఈ గ్రామపంచాయతీకి ఇప్పుడు వరకు మంది సర్పంచులు గా పనిచేశారు. తొలి సర్పంచ్‌గా జయవరపు సత్తయ్య(మడికి) పనిచేశారు. ఆ తర్వాత రావిపాటి పట్టాభిరామయ్య(చిలకలపాడు),గండి నాగేశ్వరరావు(చిలకపాడు), రాయపాటి రామారావు(చిలకలపాడు) లు సర్పంచ్ పదవులు చేపట్టారు.వీరి హయాంలో పాఠశాలలు, విద్యుత్ సౌకర్యాలు వచ్చాయి. అయితే 8 జూన్ 1966 నుంచి 7జూన్ 1970 వరకు ఉప సర్పంచ్‌గా ఉన్న కురమళ్ల వీర్రాజు(చిలకలపాడు) సర్పంచిగా ఇంచార్జ్ బాధితులు చేపట్టారు. ఆ తర్వాత 8జూన్1970 నుంచి 31 మార్చి 79 వరకు మామిడిశెట్టి వీరంశెట్టి(మడికి) సర్పంచ్ గా కొనసాగారు.ఈయన కాలంలో సబ్‌ హెల్త్ సెంటర్, పశువుల ఆసుపత్రి వంటి సౌకర్యాలు వచ్చాయి. అలాగే 2 జూలై 1979 నుంచి 26 మే 1981 వరకు ఉప సర్పంచ్ గా ఉన్న కొప్పిశెట్టి వెంకటరాజు(మల్లావానితోట) ఇంచార్జ్ సర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం 27 మే 1981 నుంచి 20 అక్టోబర్ 1995 వరకు సుమారు 14 ఏళ్ల పాటు కురమళ్ల వీర్రాజు సర్పంచ్ గా ఏకచత్రాధిపత్యం వహించారు.ఆ సమయంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న సంగిత వెంకట రెడ్డి మార్కెట్ శాఖ నుంచి(1993లో) రూ.5 లక్షలతో కాలిబాట వంతెన నిర్మించారు. అప్పటి వరకూ దోనె పైనే రైతులు, గ్రామస్థులు కాలవుపై రాకపోకలు సాగించేవారు.అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం కూడా ఆయన హయాంలో నిర్మించారు.

అయితే 1995 నుంచి స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి.విచిత్రం ఏంటంటే అప్పటినుంచి ఇప్పటివరకు ఆ గ్రామ సర్పంచ్ పదవి జనరల్‌కు ఒక్కసారి కూడా కేటాయించబడలేదు. ఎస్సీ, బీసీల కేటగిరిలకే రిజర్వు అవుతూ వచ్చింది. 21 అక్టోబర్ 1995 నుంచి 23 ఆగస్టు 2001 వరకు బిసి జనరల్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి యనమదల నాగేశ్వరావు(మడికి) సర్పంచ్ పదవి చేపట్టారు. ఆయన హయాంలోనే తొలిసారిగా సిమెంట్ రోడ్లకు శ్రీకారం చుట్టారు. అలాగే కాలుపై రేవులను నిర్మించారు.ఆ తర్వాత బిసి జనరల్ స్థానంకు టిడిపి పార్టీ నుంచి పంపన సూర్యారావు (మల్లావానితోట) సర్పంచ్ గా గెలిచి 23 ఆగష్టు2001 నుంచి 22 ఆగష్టు2006 వరకూ పనిచేశారు. అనంతరం తొలిసారిగా ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయిన ఈ స్థానంలో కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులను పోటీలో నిలపగా స్వతంత్ర అభ్యర్థిగా రెల్లి సామాజిక వర్గానికి చెందిన బంగారి ఆదినారాయణ విజయం సాధించారు. ఆయన 23 ఆగష్టు 2006 నుంచి 22 ఆగష్టు2011 వరకూ సర్పంచ్‌గా పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నాయకులు యనమదల నాగేశ్వరరావు తదితరుల కృషి తో నాగులపేట ఇళ్ల స్థలాలు, ఇళ్లు,గ్రామంలో వాటర్ ట్యాంకుల నిర్మాణాలు జరిగాయి. ఆ తర్వాత ఎన్నికలలో బిసి మహిళకు రిజర్వ్ కావడంతో గుత్తుల సీతామహాలక్ష్మి(మడికి)గెలుపొందారు. 2ఆగస్టు 2013 నుండి 1 ఆగష్టు2018వరకు సర్పంచుగా పనిచేశారు. ఆ సమయంలో సిమెంట్ రోడ్లు,డ్రెయినేజీలు నిర్మించారు. ఆ తరువాత ఎస్సీ మహిళలకు సర్పంచ్ పదవి రిజర్వ్ కావడంతో రెండేళ్ల క్రితం ఉండ్రాజపు లక్ష్మి మౌనిక చిన్న గెలుపొందారు.

ఇద్దరు ఎంపీపీలు.. ఇద్దరు జడ్పిటిసిలు

ఈ గ్రామానికి రాజకీయంగాను మంచి గుర్తింపు ఉంది. ఏకంగా ఇద్దరు మండల పరిషత్ అధ్యక్షులుగాను,మరో ఇద్దరు జడ్పిటిసిలుగాను పనిచేశారు. అంతేకాదు మరో ఇద్దరు మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పని చేశారు. గత ప్రభుత్వంలో కొత్తపల్లి ధనలక్ష్మి, కొత్తపల్లి వెంకటలక్ష్మి లు టిడిపి పార్టీ నుంచి చెరో రెండున్నర సంవత్సరాలు ఎంపిపిగా పనిచేశారు. అలాగే మండలంలో తొలి జడ్పిటిసిగా ఈ గ్రామానికి చెందిన మామిడిశెట్టి జానికరత్నం(బిసి మహిళ) కాంగ్రెస్ పార్టీ నుంచి 1995లో గెలుపొందారు. ఇదే గ్రామానికి చెందిన మల్లిపూడి ఉదయ భాస్కరరావు(జనరల్) 2001లో టిడిపి పార్టీ నుంచి విజయ సాధించారు. మండల పరిషత్తులు ఆవిర్భవించిన 1985లో మడికి సర్పంచ్ గా గెలుపొందిన కురమళ్ల వీర్రాజు మండల పరిషత్తు ఉపాధ్యక్షులుగా పనిచేశారు.అలాగే మలియాల బాబి మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా చేపట్టారు.అంతేకాక కరుమళ్ల వీర్రాజు, కొత్తపల్లి కృష్ణ లు మండల టిడిపి పార్టీ అధ్యక్షులు గాను,యనమదల నాగేశ్వరరావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగాను పనిచేసి మడికి గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చారు.

రెండేళ్లలో ఎంతో అభివృద్ధి

రెండేళ్ళ తన పదవి కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని మరింత అభివృద్ధి జరుగుతుందని సర్పంచ్ ఉండ్రాజపు లక్ష్మీ మౌనికి తెలిపారు.కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, గ్రామస్థులు,పాలకవర్గం సహకారంతో అభివృద్ధి సాదిస్తున్నామన్నారు. నాలుగు సచివాలయాల పరిధిలో భవన నిర్మాణాలు చేపట్టామ్మారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా, విలేజ్ క్లినిక్ భవనాలు కొన్ని పూర్తవుగా మరికొన్ని వివిధ దశలో ఉన్నట్లు వివరించారు. అలాగే రూ. కోటి 20 లక్షలతో త్రాగునీరు అందించేందుకు జల జీవన మిషన్ పధకం ద్వారా మంజూరయ్యాయని ఇప్పటికే రూ.50 లక్షల విలువైన పనులు జరిగాయన్నారు. మరో రూ.70 లక్షలతో పనులు చేపట్టనున్నామన్నారు. నాగుల పేటలో రూ.40 లక్షలతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజి పనులు జరుగుతున్నాయన్నారు.రూ. 15 లక్షలతో చిలకలపాడు డ్రైనేజీ నిర్మాణం చేపట్టినట్లు సర్పంచ్ వివరించారు. గ్రామంలో 54 వాలంటీర్లు ద్వారా సంక్షేమ పధకాలు అందరికీ సక్రమంగా అందిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి మోక్షాంజలి తెలిపారు.

కొండ్రెడ్డి శ్రీనివాస్

ఏపీ :ఏప్రిల్ 3 వ తేదీ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ...*

ఏప్రిల్ 3 వ తేదీ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ...

గడప గడపకు ఎమ్మెల్సీ ఎన్నికలపై రివ్యూ..

గత రివ్యూ సమావేశంలో ఏప్రిల్ లో జరిగే సమావేశంలో టికెట్లపై స్పష్టత ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి..

20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలకు నిర్మొహమాటంగా టికెట్ ఇవ్వడం లేదని ప్రకటించే అవకాశం...

నాతో ఉండాలో వెళ్ళిపోతారో తేల్చుకోవాలని చెప్పే అవకాశం..

తన మీద నమ్మకం గెలుపుపై సందేహాలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చని హెచ్చరించే అవకాశం...

ఏంజరుగుతుందో అని ఎమ్మెల్యేలలో ఉత్కంఠత...

రాబోయే ఎన్నికలకు సంబంధించి పల్లెనిద్ర కార్యక్రమాలపై స్పష్టత...

తిరుమల లో నేటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల లో నేటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 5 వరకూ స్వామివారికి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.