madagoni surendar

Apr 01 2023, 19:26

గుంటూరుజిల్లా::మద్యంసేవించి వాహనాలు నడిపే సమయంలో పోలీసులకు, రవాణాశాఖ అధికారులకు పట్టుబడితే జైలుకు వెళ్తారని గుంటూరు జిల్లా ఉపరవాణా

గుంటూరుజిల్లా::

మద్యంసేవించి వాహనాలు నడిపే సమయంలో పోలీసులకు, రవాణాశాఖ అధికారులకు పట్టుబడితే జైలుకు వెళ్తారని గుంటూరు జిల్లా ఉపరవాణా కమిషనర్ కరీం అన్నారు.

శనివారం గుంటూరు సిటీలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయం లో లారీ డ్రైవర్లు స్కూల్ బస్సులు డ్రైవర్లు,ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతా పట్ల న్యాయం విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

కార్యక్రమoలో డిటిసి కరీం, జిల్లా వ్యాప్తం గా జరిగిన రహదారి ప్రమాదాలను వివరించి వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.

madagoni surendar

Apr 01 2023, 19:18

ఖమ్మం జిల్లా:ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు చక్రం కింద పడి వృద్ధుడి చేతికి తీవ్రగాయం...

ఖమ్మం జిల్లా:

ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు చక్రం కింద పడి వృద్ధుడి చేతికి తీవ్రగాయం....

టికెట్ తెచ్చుకునేందుకు ఆగివున్న గూడ్స్ రైలు కింద దూరిన వృద్ధుడు...

ట్రైన్ కదలటంతో ట్రైన్ కింద ఉండిపోయిన వృద్ధుడు...

జనం కేకలు వేయడంతో ట్రైన్ నిలిపివేసిన లోకో పైలెట్....వృద్ధుడుకి తప్పిన ప్రాణాపాయం....

గాయపడ్డ వృద్ధుడుది ఎన్టీఆర్ జిల్లా పరిటాలకు చెందిన ఆకుల పెద్దబాబుగా గుర్తింపు....

madagoni surendar

Apr 01 2023, 18:59

ఏపీ :చేనేత కార్మికుల సర్వతోముఖాభివృద్దే ధ్యేయంగా ఆప్కో ముందడుగు*

చేనేత కార్మికుల సర్వతోముఖాభివృద్దే ధ్యేయంగా ఆప్కో ముందడుగు

ఆప్కో 38వ సర్వసభ్య సమావేశంలో సంస్ధ ఛైర్మన్ గంజి చిరంజీవి

పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పలు సంస్ధాగత మార్పులు : ఎంఎం నాయక్

నూలు, నేత వస్త్రాలపై జిఎస్ టి రద్దుకు నేతన్న డిమాండ్

నేతన్న నేస్తం, పింఛను కానుక పధకాలపై సిఎంను అభినందిస్తూ తీర్మానం

రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో చేనేత కార్మికుల సర్వతోముఖాభివృద్దే ద్యేయంగా ఆప్కో తన పయనం సాగిస్తుందని సంస్ధ ఛైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహాకార సంఘం (ఆప్కో) 38వ సర్వసభ్య సమావేశం మంగళగిరిలోని రాయల్ కన్వెన్షన్ లో శనివారం జరిగింది. రాష్టం నలుమూలల నుండి అయా చేనేత సహాకార సంఘల ప్రతినిధులు వందల సంఖ్యలో హాజరుకాగా, విభిన్న అంశాలపై లోతుగా చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మానస పుత్రికగా అందిస్తున్న నేతన్న నేస్తం పధకం వేలాది మంది చేనేత కార్మికుల జీవితాలలో వెలుగును ప్రసాదించిందన్నారు. కార్మికుల డిమాండ్ మేరకు రాయితీ నూలును సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుండి సంఘాలకు బకాయిలు లేకుండా చూసేందుకు నూతన విధానానికి అంకురార్పణ చేయనున్నామన్నారు. పవర్ లూమ్స్ పోటీని తట్టుకునేలా ఆధునికతకు అద్దం పడుతూ నూతన డిజైన్లను వినియోగదారులకు అందించవలసి ఉందన్నారు. ఆప్కో ఆస్తులు వేటినీ విక్రయించబోమని, లీజుకు ఇచ్చిన వాటిని సైతం చట్టపరిధికి లోబడి వెనక్కు తీసుకుంటామని స్పఫ్టం చేసారు.

చేనేత, జౌళి శాఖ కమీషనర్, ఆప్కో ఎండి ఎంఎం నాయక్ మాట్లాడుతూ ఆప్కోలో పారదర్శకత కోసం నూతన సాఫ్ట్ వేర్ లతో కంప్యూటరీకరణను వేగవంతం చేస్తున్నామన్నారు. విపణిలో ఎదురవుతున్న పోటీని తట్టుకుని వినియోగదారులకు ఏలా చేరువ కాగలమన్నదే మనకు సవాల్ గా మారిందన్నారు. స్వల్ప మార్పులతో మరింత వైవిధ్యభరితమైన డిజైన్లను రూపొందించటం ద్వారా మంచి మార్కెట్ ను పొందగలుగుతామన్నారు. ప్రభుత్వ ఉధ్యోగులకు అప్పుపై వస్త్రాలు అందించే పధకాన్ని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నామని, మరోవైపు నెలవారీ పొదుపు పధకం ద్వారా వస్త్రాలు కొనుగోలు చేసేలా మరో కార్యక్రమాన్ని కూడా తీసుకురావలని సమాలోచిస్తున్నామని నాయక్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందించే క్లస్టర్ అభివృద్ది కార్యక్రమం మరో పది యూనిట్లకు మంజూరు అయ్యిందని, దీని ద్వారా ప్రతి చేనేత కార్మికులు గరిష్టంగా రూ.30వేలు లబ్ది పొందగలుగుతాయని వివరించారు.

సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా నూలు, చేనేత వస్త్రాలపై జిఎస్టి రద్దు చేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేసారు. వైఎస్ ఆర్ నేతన్న నేస్తం, పింఛను కానుక పధకాలను అమలు చేస్తున్నందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. సొసైటీలు ఉత్పత్తి చేసిన అన్ని రకాలను కొనుగోలు చేయాలని, అయితే మార్కెట్ డిమాండ్ల మేరకు రూపొందించిన ఉత్పత్తి ప్రణాళికను గౌరవించి తదనుగుణంగా వ్యవహరించాలని మరో తీర్మానాన్ని అంగీకరించారు. ఆప్కో స్ధిరాస్తుల విలువను మదింపు చేయటం ద్వారా సంస్ధ పరపతి స్దాయిని పెంపొందించుకోవాలని సమావేశం తీర్మానించారు. చేనేత కార్మికులకు ఇస్తున్న ఎక్స్ గ్రేషియా సకాలంలో అందేలా చర్యులు తీసుకోవాలన్న తీర్మానంపై సంస్ధ ఛైర్మన్ గంజి చిరంజీవి ప్రతిస్పందిస్తూ ప్రస్తుతం ఉన్న రూ.12,500 మొత్తాన్ని రూ.25వేలకు పెంపుచేసేలా ప్రయత్నిస్తామన్నారు. చేనేత పితామహులుగా పేరుగాంచిన దివంగత ప్రగఢ కోటయ్య, మాచాని సోమప్ప, మిడతు అప్పయ్య జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఆప్కో సర్వసభ్య సమావేశం తీర్మానాలను ఆమోదించింది.

కార్యక్రమంలో భాగంగా మృతి చెందిన చేనేత కార్మికులు కుటుంబ సభ్యులకు సంస్ధ ఛైర్మన్ గంజి చిరంజీవి, ఎండి ఎంఎం నాయక్ లు రూ.12,500 వంతున చెక్కులు పంపిణీ చేసారు. జ్యోతీ ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం కాగా, సమావేశంలో ఆప్కో డైరెక్టర్ అవ్వారి ఎల్లా సుబ్బారాయిడు, చేనేత జౌళిశాఖ సంయిక్త సంచాలకులు మైసూరు నాగేశ్వరరావు, కన్నబాబు, ఆప్కో జనరల్ మేనేజర్ తనూజారాణి తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 01 2023, 18:01

తిరుపతి(రైల్వే): సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది.

తిరుపతి(రైల్వే): సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది.

సికింద్రాబాద్‌ నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలకు బయలుదేరిన రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతికి సాయంత్రం 3.15 గంటలకు చేరుకుంది. ఇక్కడ పరిశీలన అనంతరం తిరిగి సికింద్రాబాద్‌కు అదే మార్గంలో బయలుదేరింది. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో రైలును ఈ నెల 8న ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఆ రోజు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతూ తిరుపతికి చేరుకోనుంది. 9వ తేదీన రైలు షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి కేవలం నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, నల్గొండ మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 10వ తేదీన ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు వస్తుంది. ప్రయాణ సమయం 8.30 గంటలుగా నిర్ధారించారు. రైలు నంబర్లు, టికెట్‌ ధర రెండ్రోజుల్లో ద.మ.రైల్వే ప్రకటించే అవకాశం ఉంది.

madagoni surendar

Apr 01 2023, 17:03

ఏపీ:సెంట్రల్ జోన్ కబడ్డీ టోర్నమెంట్ లో అమ్రిత సాయి విద్యార్థుల ప్రతిభ

ఏపీ:సెంట్రల్ జోన్ కబడ్డీ టోర్నమెంట్ లో అమ్రిత సాయి విద్యార్థుల ప్రతిభ

కంచికచర్ల మండలం పరిటాల సమీపం లోని అమ్రిత సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జె.యన్.టి.యు కాకినాడ నిర్వహించిన సెంట్రల్ జోన్ కబడ్డీ పోటీలలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నారని కళాశాల ప్రిన్సిపాల్ డా || యమ్.శశిధర్ తెలియ చేసారు.

గుడ్లవల్లేరు వేదిక గా, జె.యన్.టి.యు కాకినాడ నిర్వహించిన సెంట్రల్ జోన్ కబడ్డీ పోటీలలో మొత్తం 5 జిల్లాల నుండి 60 టీమ్స్ పోటీ పడగా, అమ్రిత సాయి కబడ్డీ జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ స్థాయి లో సత్తా చాటటం గర్వ కారణం అని

కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ కె. రామ్మోహన రావు తెలియ చేసారు. ఈ పోటీలలో మొదటి స్థానం కైవసం చేసుకున్న అమ్రిత సాయి కళాశాల కబడ్డీ టీం మెంబెర్స్ కు, టోర్నమెంట్ నిర్వాహకులు ప్రశంస పత్రాల తో పాటు విన్నింగ్ కప్ అందజేశారు.

ప్రిన్సిపాల్ డా || యమ్.శశిధర్ మాట్లాడుతూ తమ కళాశాల లో విద్యార్థులకు అకాడమిక్స్ తో పాటు క్రీడల లో కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని , దీని ఫలితంగా అద్భుత విజయాలు సాధించటం తో పాటు యూనివర్సిటీ స్థాయి లో రాణిస్తున్నామని తెలిపారు.

గెలుపొందిన కబడ్డీ టీం విద్యార్థులను సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ కె. రామ్మోహన రావు , ప్రిన్సిపాల్ డా || యమ్.శశిధర్, అకాడమిక్ డైరెక్టర్ డా || పి. చిరంజీవి, ఫీజికల్ డైరెక్టర్స్ పి.శ్రీనివాస రావు, పి. శివ రామ కృష్ణ, అన్ని విభాగాల అధిపతులు అభినందించారు.

madagoni surendar

Apr 01 2023, 16:42

నల్గొండ జిల్లా::బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ భూసేకరణకై 22 కోట్లు మంజూరు.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ భూసేకరణకై 22 కోట్లు మంజూరు.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Streetbuz news. నల్గొండ జిల్లా :

నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ భూసేకరణ నిమిత్తం రూ. 22 కోట్లు మంజూరు చేయించినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు, నకిరేకల్ ప్రాంత ప్రజల కలల ప్రాజెక్ట్ ఉదయ సముద్రం పూర్తికై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఆయన పేర్కొన్నారు, పెండింగ్ పనులకు వేగవంతం చేయించి వీలనయినంత తొందరలో సాగునీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు, నిధులు మంజూరు చేసిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు..

madagoni surendar

Apr 01 2023, 16:19

విజయవాడ. *ఉద్యమస్ఫూర్తి అంటే టెంట్లు వేసుకుని రెచ్చగొట్టడమా?*: మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ.

ఉద్యమస్ఫూర్తి అంటే టెంట్లు వేసుకుని రెచ్చగొట్టడమా?: మంత్రి బొత్స సత్యనారాయణ

చంద్రబాబు అండ్‌ కో తప్ప అక్కడ నిజమైన రైతుల్లేరు

సత్యకుమార్‌పై దాడి మాకేం అవసరం..?

రాజకీయంగా బురదజల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలవి..

దాడులకు పాల్పడే సంస్కృతి వైఎస్‌ఆర్‌సీపీకి లేదు

-: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ

అది ల్యాండ్‌ పూలింగ్‌ కాదు.. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం

రూ.లక్షల కోట్లు పెట్టి ఒకేప్రాంతంలో గోతులు పూడ్చాలా..?

వికేంద్రీకరణకే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

-: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ వెల్లడి

విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మీడియా మీట్ః

ముందస్తు ఎన్నికలనేవి చంద్రబాబుది ప్రచారమే..

ఐదేళ్లూ పరిపాలన చేసే సుస్థిర ప్రభుత్వం మాది

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బాబు తుస్సుమంటాడు

-: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ జోస్యం

వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం

అదే నినాదంతో ఎన్నికలకు వెళ్తాం..

రాజధాని మార్పు రేపట్నుంచే మొదలెడితే తప్పేంటి..?

-: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ అభిప్రాయం

విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మీడియా మీట్‌లో మాట్లాడుతూ...ఇంకా ఏమన్నారంటే..:

రియల్‌ ఎస్టేట్‌ వేదికగా అమరావతిః

-రాజధాని అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే జరిగింది తప్ప.. సహజమైన రైతులెవరూ అక్కడ లేరు.

- అమరావతిలో జరిగిన ల్యాండ్‌ పూలింగ్‌.. దోపిడీ కోసం జరిగిన కార్యక్రమమని నేను మొదట్నుంచి చెబుతూనే ఉన్నాను. ఇవాళ కూడా అదే చెబుతున్నాను. ప్రజలకు చెందిన రూ.లక్షల కోట్లును తీసుకొచ్చి అక్కడ గోతుల్లో పోయమంటారా..? జాతీయ సంపదంతా తెచ్చి అక్కడ పెట్టడం కరెక్ట్‌ కాదు.

సత్యకుమార్‌పై దాడి మాకేం అవసరం...?

- అమరావతిలో ఉద్యమ స్ఫూర్తి అంటే ఏంటి..? టెంట్లు వేసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడమా..? బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి మాకేం అవసరం...? మాపార్టీపై రాజకీయంగా బురదజల్లే ప్రయత్నాలవి. దాడులు చేసే సంస్కృతి మా ప్రభుత్వానికిగానీ, వైఎస్‌ఆర్‌సీపీకి గానీ లేదు. అమరావతి ప్రాంతంలో టెంట్లు వేసుకుని ఉద్యమాలు చేయాల్సిన అవసరమేముంది..? అక్కడ ఒకరిద్దరు రైతులు మినహా ఉన్నవారంతా చంద్రబాబు బినామీలు, ఆర్థిక అవసరాలు చూసుకునే స్వార్థపరులేనని చెప్పాలి.

అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతోనే ఎన్నికలకెళ్తాంః

- పరిపాలన రాజధాని మార్పు విషయంలో, నా వ్యక్తిగత అభిప్రాయమైతే రేపట్నుంచే అక్కడ పరిపాలన జరగాలని కోరుకుంటున్నాను. కొంతమంది దుష్ట ఆలోచనల వల్ల, న్యాయస్థానంలో జరుగుతున్న విచారణల నేపథ్యంలో పరిపాలన రాజధాని విశాఖపట్నానికి తరలింపును కాస్త పొడిగించుకుంటూ వస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే.. పరిపాలన సౌలభ్యం మెరుగుపడాలంటే ఒక ఆలోచనా విధానం కావాలి. మా ప్రభుత్వ ఆలోచన ‘అభివృద్ధి వికేంద్రీకరణ’. ప్రజలిచ్చిన తీర్పుతో మంచి ఆలోచనా విధానంతో మేం ముందుకు సాగుతున్నాం. ఆ విధానంతోనే మేం క్షేత్రస్థాయికి వెళ్లేలా, ఇంటి గుమ్మం ముందుకు పరిపాలన చేరేలా సచివాలయ వ్యవస్థను తెచ్చాం. దేవతలు ఒక మంచి సంకల్పం కోసం యజ్ఞాలు, యాగాలు చేస్తున్నప్పుడు రాక్షసులొచ్చి ఏ విధంగా వాటిని భగ్నం చేస్తారో.. ఇప్పుడు తెలుగుదేశంతో పాటు మరికొన్ని పార్టీలు చంద్రబాబు ఆధ్వర్యంలో అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. మూడు రాజధానుల నినాదంతోనే రేపటి ఎన్నికలకు వెళ్తున్నాం.

అవినీతిని సమర్ధించడం సరైంది కాదుః

-సచివాలయానికి 120 అడుగుల పునాది వేశారంట.. మనలో ఎవరైనా పుట్టిన తర్వాత 120 అడుగుల పునాది ఎక్కడైనా వేశారా..? కనీసం చెవులారా ఆ మాటైనా విన్నారా..? బిల్డింగ్‌ చదరపు అడుగుకు రూ.12000 వెచ్చించి కట్టారంట. ఇది ఎక్కడైనా విన్నామా...? హైదరాబాద్‌ నడిబొడ్డున ఫైవ్‌స్టార్‌ సదుపాయాలతో కట్టి మన చేతికిస్తున్న బిల్డింగులకే ఆ రేటు పెడుతున్నారు. ఇటువంటి అడ్డగోలు అవినీతి పనులను చంద్రబాబు, ఆయన్ను భుజానికెత్తుకున్న పార్టీలు, ఎల్లోమీడియా ఏవిధంగా సమర్ధించుకుంటారు..? ఇది మంచి పద్ధతి కాదు.

పేదలకు ఇళ్లు ఇవ్వడం తప్పా..?

- అమరావతి ప్రాంతంలో ఆర్‌5 జోన్‌ పెడితే తప్పేంటి..? అక్కడ పేదలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఉండకూడదా..? విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాల్లో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి స్థలం లేనప్పుడు ఉన్నచోట ప్రభుత్వం స్థలాల్ని గుర్తించి పంపిణీ చేయాలనుకుంటే.. అదేదో ఘోరం, నేరమని ఆందోళనలెందుకు..?

ఎన్నికలొస్తే ‘బాబు’మరింత దిగజారతాడుః

- చంద్రబాబు మనసులో ముందస్తు ఎన్నికలు రావాలని ఉంది. బాగా ఆరాటంతో తన కోరిక ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏదో అయిపోతానని ఆయన కలలు కంటున్నాడు. ఇప్పుడింకా కొంచెం ఆశతోనైనా బతుకుతున్నాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే చంద్రబాబు ఏమౌతాడు..?.. ఎన్నికల ఫలితాల్లో ఇంతకంటే ఇంకా దిగజారిపోతాడు. చంద్రబాబుకు తుస్సున గాలిపోతుంది.

మా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం బలపడింది..:

- మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సుస్థిరమైంది. ఐదేళ్లూ పరిపాలన చేయమని ప్రజలు మాకు అవకాశమిచ్చినప్పుడు చివరిదాకా ప్రజల మేలు కోసం పనిచేస్తుంది. నవరత్నాల పేరిట ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నందున ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎన్నికల అజెండా అంశాలే కాకుండా అందులో లేని వాటిపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టి మా జగన్‌మోహన్‌రెడ్డి గారు ఇచ్చినమాట నిలబెట్టుకునేందుకు క్రమంతప్పకుండా అన్నీ అమలు చేస్తున్నారు. ఈ దేశచరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఒక సంక్షేమ క్యాలెండర్‌ను పెట్టుకుని, అమలు చేస్తోన్న మాలాంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. అందుకే, ప్రజలకు మా ప్రభుత్వంపై ఒక నమ్మకం, భరోసా వచ్చింది. పేద, మధ్యతరగతివర్గాల ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది. కుటుంబ స్థితిగతులు మారుతున్నాయి. అన్నిరంగాల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ మేటిగా నిలబడింది. ఇలాంటప్పుడు ప్రతిపక్షాలు రోజుకో తీరుగా మా ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేసినా, వాళ్ల ప్రయత్నాలేమీ ఫలించవు.

ఎమ్మెల్సీ ఫలితాలపై సమీక్షిస్తున్నాం.:

-ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరిగిన పరిణామాలపై వైఎస్‌ఆర్‌సీపీ సమీక్షిస్తుంది. లోపాలపై పరిశీలన జరుగుతుంది. పార్టీలో ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్‌ వస్తే దాన్ని గుర్తించి తప్పులు సరిదిద్దుకుంటాం. అలాంటి వైఫల్యాల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం.

madagoni surendar

Apr 01 2023, 16:12

ఏపీ :ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు..మంత్రి బొత్స

ఏపీ :ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు..మంత్రి బొత్స

ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు(ఉ. 9:30 - మ. 12:45) పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు..

పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయన్నారు..

ప్రత్యేక కారణం ఉంటే తప్ప పదో తరగతి పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు..

హాల్‌టికెట్‌ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని చెప్పారు..

గతంలో లీకేజీ ఆరోపణలు వచ్చిన టీచర్లపై సర్క్యులర్‌ వెనక్కి తీసుకున్నామని..

ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని బొత్స అన్నారు.

madagoni surendar

Apr 01 2023, 16:00

ఏపీ :నారా లోకేష్ : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్‌

నారా లోకేష్ : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్‌

రాప్తాడు : పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కారుపై వైకాపా కార్యకర్తల దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఖండించారు.

దాడి ఘటన అనంతరం పుట్టపర్తి నేతలతో రాప్తాడు నుంచి లోకేశ్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ధ్వజమెత్తారు. సమాధానం చెప్పలేక దాడులకు దిగడం పిరికిపంద చర్య అని విమర్శించారు.

పుట్టపర్తిలో తెదేపా కార్యకర్తలపై దాడి చేశారని.. జగన్‌ అండతో వైకాపా రౌడీ మూకలు పేట్రేగిపోతున్నాయని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పల్లె రఘునాథరెడ్డి కారు ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. పుట్టపర్తిని వైకాపా ఎమ్మెల్యే అరాచకాలకు నిలయంగా మార్చారని ధ్వజమెత్తారు. వైకాపా రౌడీ మూకలు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి చేసిన వారిని వదిలేసి తెదేపా కార్యకర్తలపై లాఠీచార్జి చేస్తారా? అని నిలదీశారు..

madagoni surendar

Apr 01 2023, 15:56

ఆంధ్రప్రదేశ్ : రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్ : రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స

అమరావతి: మూడు రాజధానులే వైకాపా ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి పునరుద్ఘాటించారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?

అని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో ఆర్థికంగా లబ్ధిపొందినవారే తప్ప నిజమైన రైతులెవరూ ఉద్యమంలో లేరని ఆరోపించారు. రైతులు టెంటు వేసుకుని కూర్చోవడం ఉద్యమ స్ఫూర్తా? అని బొత్స ప్రశ్నించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..

మూడు రాజధానుల విధానంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని బొత్స స్పష్టం చేశారు. విశాఖ నుంచి పాలన ప్రారంభించాలనేది తన అభిప్రాయమన్నారు. న్యాయ చిక్కులు, సాంకేతిక సమస్యలు లేకుంటే రేపటి నుంచే విశాఖలో పాలన ప్రారంభించాలనేదే తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ''ఊరంటే శ్మశానం కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అమరావతిని గతంలో శ్మశానం అన్నా. నివాసయోగ్యమైనందున అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నాం'' అని బొత్స తెలిపారు. విశాఖ రాజధాని సెంటిమెంట్‌ను ప్రజలు నమ్మలేదనే వాదనతో ఏకీభవించనన్నారు. ముందుస్తు ఎన్నికలపై బొత్స స్పందిస్తూ.. ఐదేళ్లు ప్రజలు పాలించాలని అవకాశమిచ్చారని.. ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుని ముందస్తుకు వెళ్తాం? అని బొత్స ప్రశ్నించారు..

ఆ ఓటమిని నా వైఫల్యంగా భావిస్తున్నా..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా ఓటమిపైనా బొత్స స్పందించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటామన్నారు. ఉత్తరాంధ్రలో వైకాపా అభ్యర్థి ఓడిపోవడం తన వైఫల్యంగానే భావిస్తున్నానని చెప్పారు..