madagoni surendar

Apr 01 2023, 16:42

నల్గొండ జిల్లా::బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ భూసేకరణకై 22 కోట్లు మంజూరు.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ భూసేకరణకై 22 కోట్లు మంజూరు.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Streetbuz news. నల్గొండ జిల్లా :

నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ భూసేకరణ నిమిత్తం రూ. 22 కోట్లు మంజూరు చేయించినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు, నకిరేకల్ ప్రాంత ప్రజల కలల ప్రాజెక్ట్ ఉదయ సముద్రం పూర్తికై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఆయన పేర్కొన్నారు, పెండింగ్ పనులకు వేగవంతం చేయించి వీలనయినంత తొందరలో సాగునీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు, నిధులు మంజూరు చేసిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు..

madagoni surendar

Apr 01 2023, 16:19

విజయవాడ. *ఉద్యమస్ఫూర్తి అంటే టెంట్లు వేసుకుని రెచ్చగొట్టడమా?*: మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ.

ఉద్యమస్ఫూర్తి అంటే టెంట్లు వేసుకుని రెచ్చగొట్టడమా?: మంత్రి బొత్స సత్యనారాయణ

చంద్రబాబు అండ్‌ కో తప్ప అక్కడ నిజమైన రైతుల్లేరు

సత్యకుమార్‌పై దాడి మాకేం అవసరం..?

రాజకీయంగా బురదజల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలవి..

దాడులకు పాల్పడే సంస్కృతి వైఎస్‌ఆర్‌సీపీకి లేదు

-: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ

అది ల్యాండ్‌ పూలింగ్‌ కాదు.. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం

రూ.లక్షల కోట్లు పెట్టి ఒకేప్రాంతంలో గోతులు పూడ్చాలా..?

వికేంద్రీకరణకే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

-: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ వెల్లడి

విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మీడియా మీట్ః

ముందస్తు ఎన్నికలనేవి చంద్రబాబుది ప్రచారమే..

ఐదేళ్లూ పరిపాలన చేసే సుస్థిర ప్రభుత్వం మాది

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బాబు తుస్సుమంటాడు

-: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ జోస్యం

వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం

అదే నినాదంతో ఎన్నికలకు వెళ్తాం..

రాజధాని మార్పు రేపట్నుంచే మొదలెడితే తప్పేంటి..?

-: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ అభిప్రాయం

విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మీడియా మీట్‌లో మాట్లాడుతూ...ఇంకా ఏమన్నారంటే..:

రియల్‌ ఎస్టేట్‌ వేదికగా అమరావతిః

-రాజధాని అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే జరిగింది తప్ప.. సహజమైన రైతులెవరూ అక్కడ లేరు.

- అమరావతిలో జరిగిన ల్యాండ్‌ పూలింగ్‌.. దోపిడీ కోసం జరిగిన కార్యక్రమమని నేను మొదట్నుంచి చెబుతూనే ఉన్నాను. ఇవాళ కూడా అదే చెబుతున్నాను. ప్రజలకు చెందిన రూ.లక్షల కోట్లును తీసుకొచ్చి అక్కడ గోతుల్లో పోయమంటారా..? జాతీయ సంపదంతా తెచ్చి అక్కడ పెట్టడం కరెక్ట్‌ కాదు.

సత్యకుమార్‌పై దాడి మాకేం అవసరం...?

- అమరావతిలో ఉద్యమ స్ఫూర్తి అంటే ఏంటి..? టెంట్లు వేసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడమా..? బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి మాకేం అవసరం...? మాపార్టీపై రాజకీయంగా బురదజల్లే ప్రయత్నాలవి. దాడులు చేసే సంస్కృతి మా ప్రభుత్వానికిగానీ, వైఎస్‌ఆర్‌సీపీకి గానీ లేదు. అమరావతి ప్రాంతంలో టెంట్లు వేసుకుని ఉద్యమాలు చేయాల్సిన అవసరమేముంది..? అక్కడ ఒకరిద్దరు రైతులు మినహా ఉన్నవారంతా చంద్రబాబు బినామీలు, ఆర్థిక అవసరాలు చూసుకునే స్వార్థపరులేనని చెప్పాలి.

అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతోనే ఎన్నికలకెళ్తాంః

- పరిపాలన రాజధాని మార్పు విషయంలో, నా వ్యక్తిగత అభిప్రాయమైతే రేపట్నుంచే అక్కడ పరిపాలన జరగాలని కోరుకుంటున్నాను. కొంతమంది దుష్ట ఆలోచనల వల్ల, న్యాయస్థానంలో జరుగుతున్న విచారణల నేపథ్యంలో పరిపాలన రాజధాని విశాఖపట్నానికి తరలింపును కాస్త పొడిగించుకుంటూ వస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే.. పరిపాలన సౌలభ్యం మెరుగుపడాలంటే ఒక ఆలోచనా విధానం కావాలి. మా ప్రభుత్వ ఆలోచన ‘అభివృద్ధి వికేంద్రీకరణ’. ప్రజలిచ్చిన తీర్పుతో మంచి ఆలోచనా విధానంతో మేం ముందుకు సాగుతున్నాం. ఆ విధానంతోనే మేం క్షేత్రస్థాయికి వెళ్లేలా, ఇంటి గుమ్మం ముందుకు పరిపాలన చేరేలా సచివాలయ వ్యవస్థను తెచ్చాం. దేవతలు ఒక మంచి సంకల్పం కోసం యజ్ఞాలు, యాగాలు చేస్తున్నప్పుడు రాక్షసులొచ్చి ఏ విధంగా వాటిని భగ్నం చేస్తారో.. ఇప్పుడు తెలుగుదేశంతో పాటు మరికొన్ని పార్టీలు చంద్రబాబు ఆధ్వర్యంలో అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. మూడు రాజధానుల నినాదంతోనే రేపటి ఎన్నికలకు వెళ్తున్నాం.

అవినీతిని సమర్ధించడం సరైంది కాదుః

-సచివాలయానికి 120 అడుగుల పునాది వేశారంట.. మనలో ఎవరైనా పుట్టిన తర్వాత 120 అడుగుల పునాది ఎక్కడైనా వేశారా..? కనీసం చెవులారా ఆ మాటైనా విన్నారా..? బిల్డింగ్‌ చదరపు అడుగుకు రూ.12000 వెచ్చించి కట్టారంట. ఇది ఎక్కడైనా విన్నామా...? హైదరాబాద్‌ నడిబొడ్డున ఫైవ్‌స్టార్‌ సదుపాయాలతో కట్టి మన చేతికిస్తున్న బిల్డింగులకే ఆ రేటు పెడుతున్నారు. ఇటువంటి అడ్డగోలు అవినీతి పనులను చంద్రబాబు, ఆయన్ను భుజానికెత్తుకున్న పార్టీలు, ఎల్లోమీడియా ఏవిధంగా సమర్ధించుకుంటారు..? ఇది మంచి పద్ధతి కాదు.

పేదలకు ఇళ్లు ఇవ్వడం తప్పా..?

- అమరావతి ప్రాంతంలో ఆర్‌5 జోన్‌ పెడితే తప్పేంటి..? అక్కడ పేదలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఉండకూడదా..? విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాల్లో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి స్థలం లేనప్పుడు ఉన్నచోట ప్రభుత్వం స్థలాల్ని గుర్తించి పంపిణీ చేయాలనుకుంటే.. అదేదో ఘోరం, నేరమని ఆందోళనలెందుకు..?

ఎన్నికలొస్తే ‘బాబు’మరింత దిగజారతాడుః

- చంద్రబాబు మనసులో ముందస్తు ఎన్నికలు రావాలని ఉంది. బాగా ఆరాటంతో తన కోరిక ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏదో అయిపోతానని ఆయన కలలు కంటున్నాడు. ఇప్పుడింకా కొంచెం ఆశతోనైనా బతుకుతున్నాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే చంద్రబాబు ఏమౌతాడు..?.. ఎన్నికల ఫలితాల్లో ఇంతకంటే ఇంకా దిగజారిపోతాడు. చంద్రబాబుకు తుస్సున గాలిపోతుంది.

మా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం బలపడింది..:

- మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సుస్థిరమైంది. ఐదేళ్లూ పరిపాలన చేయమని ప్రజలు మాకు అవకాశమిచ్చినప్పుడు చివరిదాకా ప్రజల మేలు కోసం పనిచేస్తుంది. నవరత్నాల పేరిట ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నందున ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎన్నికల అజెండా అంశాలే కాకుండా అందులో లేని వాటిపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టి మా జగన్‌మోహన్‌రెడ్డి గారు ఇచ్చినమాట నిలబెట్టుకునేందుకు క్రమంతప్పకుండా అన్నీ అమలు చేస్తున్నారు. ఈ దేశచరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఒక సంక్షేమ క్యాలెండర్‌ను పెట్టుకుని, అమలు చేస్తోన్న మాలాంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. అందుకే, ప్రజలకు మా ప్రభుత్వంపై ఒక నమ్మకం, భరోసా వచ్చింది. పేద, మధ్యతరగతివర్గాల ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది. కుటుంబ స్థితిగతులు మారుతున్నాయి. అన్నిరంగాల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ మేటిగా నిలబడింది. ఇలాంటప్పుడు ప్రతిపక్షాలు రోజుకో తీరుగా మా ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేసినా, వాళ్ల ప్రయత్నాలేమీ ఫలించవు.

ఎమ్మెల్సీ ఫలితాలపై సమీక్షిస్తున్నాం.:

-ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరిగిన పరిణామాలపై వైఎస్‌ఆర్‌సీపీ సమీక్షిస్తుంది. లోపాలపై పరిశీలన జరుగుతుంది. పార్టీలో ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్‌ వస్తే దాన్ని గుర్తించి తప్పులు సరిదిద్దుకుంటాం. అలాంటి వైఫల్యాల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం.

madagoni surendar

Apr 01 2023, 16:12

ఏపీ :ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు..మంత్రి బొత్స

ఏపీ :ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు..మంత్రి బొత్స

ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు(ఉ. 9:30 - మ. 12:45) పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు..

పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయన్నారు..

ప్రత్యేక కారణం ఉంటే తప్ప పదో తరగతి పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు..

హాల్‌టికెట్‌ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని చెప్పారు..

గతంలో లీకేజీ ఆరోపణలు వచ్చిన టీచర్లపై సర్క్యులర్‌ వెనక్కి తీసుకున్నామని..

ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని బొత్స అన్నారు.

madagoni surendar

Apr 01 2023, 16:00

ఏపీ :నారా లోకేష్ : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్‌

నారా లోకేష్ : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్‌

రాప్తాడు : పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కారుపై వైకాపా కార్యకర్తల దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఖండించారు.

దాడి ఘటన అనంతరం పుట్టపర్తి నేతలతో రాప్తాడు నుంచి లోకేశ్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ధ్వజమెత్తారు. సమాధానం చెప్పలేక దాడులకు దిగడం పిరికిపంద చర్య అని విమర్శించారు.

పుట్టపర్తిలో తెదేపా కార్యకర్తలపై దాడి చేశారని.. జగన్‌ అండతో వైకాపా రౌడీ మూకలు పేట్రేగిపోతున్నాయని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పల్లె రఘునాథరెడ్డి కారు ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. పుట్టపర్తిని వైకాపా ఎమ్మెల్యే అరాచకాలకు నిలయంగా మార్చారని ధ్వజమెత్తారు. వైకాపా రౌడీ మూకలు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి చేసిన వారిని వదిలేసి తెదేపా కార్యకర్తలపై లాఠీచార్జి చేస్తారా? అని నిలదీశారు..

madagoni surendar

Apr 01 2023, 15:56

ఆంధ్రప్రదేశ్ : రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్ : రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స

అమరావతి: మూడు రాజధానులే వైకాపా ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి పునరుద్ఘాటించారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?

అని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో ఆర్థికంగా లబ్ధిపొందినవారే తప్ప నిజమైన రైతులెవరూ ఉద్యమంలో లేరని ఆరోపించారు. రైతులు టెంటు వేసుకుని కూర్చోవడం ఉద్యమ స్ఫూర్తా? అని బొత్స ప్రశ్నించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..

మూడు రాజధానుల విధానంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని బొత్స స్పష్టం చేశారు. విశాఖ నుంచి పాలన ప్రారంభించాలనేది తన అభిప్రాయమన్నారు. న్యాయ చిక్కులు, సాంకేతిక సమస్యలు లేకుంటే రేపటి నుంచే విశాఖలో పాలన ప్రారంభించాలనేదే తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ''ఊరంటే శ్మశానం కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అమరావతిని గతంలో శ్మశానం అన్నా. నివాసయోగ్యమైనందున అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నాం'' అని బొత్స తెలిపారు. విశాఖ రాజధాని సెంటిమెంట్‌ను ప్రజలు నమ్మలేదనే వాదనతో ఏకీభవించనన్నారు. ముందుస్తు ఎన్నికలపై బొత్స స్పందిస్తూ.. ఐదేళ్లు ప్రజలు పాలించాలని అవకాశమిచ్చారని.. ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుని ముందస్తుకు వెళ్తాం? అని బొత్స ప్రశ్నించారు..

ఆ ఓటమిని నా వైఫల్యంగా భావిస్తున్నా..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా ఓటమిపైనా బొత్స స్పందించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటామన్నారు. ఉత్తరాంధ్రలో వైకాపా అభ్యర్థి ఓడిపోవడం తన వైఫల్యంగానే భావిస్తున్నానని చెప్పారు..

madagoni surendar

Apr 01 2023, 14:12

ఏపీ:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రాంచంద్ర రావు : ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది..

కేవీపీ రామచంద్ర రావు : ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది..

భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. తమ స్వార్ధప్రయోజనాల కోసం కొన్ని ప్రమాదకర పద్ధతులను కేంద్ర ప్రభుత్వం పాటిస్తోంది..

ఉన్మాద మనస్తత్వం కలిగిన ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాం అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు.. విజయవాడలో మీట్‌ ద ప్రెస్‌లో మాట్లాడిన ఆయన.. భారతదేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. భారతదేశానికి లక్షల కోట్ల అప్పు పెరుగుతుంటే.. అదానీకి మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయని మండిపడ్డారు.. మనం కట్టే ప్రతీ కరెంట్ బిల్లులో అదానీకి వాటా వెళ్తుందని.. అదానీ నుంచి ప్రధాని మోడీకి వాటా వెళ్తుందని సంచలన ఆరోపణలు చేశారు కేవీపీ.. ఇక, రాహుల్ గాంధీ ప్రశ్నించడం మొదలు పెట్టడంతో మోడీ ప్రభుత్వం తలక్రిందులైందన్న ఆయన.. అదానీని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద పరిగణిస్తున్నారు. ఒక అవినీతి పరుడిని ప్రశ్నిస్తే దేశద్రోహం కిందకి వస్తుందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఏపీ నుంచి 25 మంది ఎంపీలు.. 11 మంది రాజ్యసభ సభ్యులు,151 మంది ఎమ్మెల్యేలున్నారు.. ఏ ఒక్క ఎంపీ అయినా రాహుల్ గాంధీ అనర్హత వేటు పై ప్రశ్నించారా..? అని నిలదీశారు కేవీపీ.. ఇలాంటి నేతలను మనం ఎన్నుకున్నందుకు సిగ్గుతో తలదించుకోవాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేవీపీ రామచంద్రరావు.

madagoni surendar

Apr 01 2023, 12:59

ఏపీ :రాష్ట్రంలో పలు సర్వే సంస్థలు జరిపిన సర్వేలలో వైసీపీకి, టిడిపికి మధ్య పోటీ నువ్వా నేనా అనే రీతిలో ఉన్నట్లు తెలుస్తుంది.

రాష్ట్రంలో పలు సర్వే సంస్థలు జరిపిన సర్వేలలో వైసీపీకి, టిడిపికి మధ్య పోటీ నువ్వా నేనా అనే రీతిలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఒక సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పక్కాగా 65 అసెంబ్లీ స్థానాలు వస్తాయని అభిప్రాయం. వైసీపీలో ఉన్న 151 మందిలో దాదాపుగా 50 మందికి పైగా ఎమ్మెల్యేలకు గెలుపు గుర్రాలు దూరంగా ఉన్నట్లు అంటున్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ రెడ్డి ఈనెల 3న ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించడమే కాక డిసెంబర్లో ఎన్నికలకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందనేది అభిప్రాయ సేకరణ చేయవచ్చునని తెలిసింది. ఇటీవల అమిత్ షాను కలిసినప్పుడు ఈ విషయమై సీఎం ఆయనతో సుదీర్ఘంగా చర్చించినట్లు అలానే కర్ణాటకలో బిజెపి పరిస్థితి ఆశాజనకంగా లేనందున పరోక్షంగా జగన్ రెడ్డిని కర్ణాటక ఎన్నికలకు సహాయం అడిగినట్లుగా అభిజ్ఞ వర్గాల కథనం. దీనికి జగన్ రెడ్డి కూడా అంగీకరించినట్లుగా అంటున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీలకు పరిస్థితి అనుకూలంగా లేని స్థితి ఉంది. బిజెపి, జనసేన అలయన్స్ అయోమయంలో ఉండగా జనసేనలో ఎక్కువ మంది నాయకులు టిడిపి తో పయనించాలని సూచనలు చేస్తున్నట్లు తెలిసింది. బిజెపి అధిష్టానం పొత్తుల విషయమై ప్రస్తుతం నోరు మెదపడం లేదు. సీఎంకు బిజెపి అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడి రాష్ట్ర బిజెపి నాయకత్వానికి లేదనేది అందరికీ తెలిసిన సత్యం. ఈనెల 3న వైసిపి ఎమ్మెల్యేల సమావేశం తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయంగా రానున్న మూడు నెలల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

వైయస్సార్ ప్రసాద్

సీనియర్ జర్నలిస్ట్.

madagoni surendar

Apr 01 2023, 12:53

హైదరాబాద్ ::బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు వైఎస్ షర్మిల ఫోన్..

బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు వైఎస్ షర్మిల ఫోన్..

హైదరాబాద్:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరిన వైఎస్ షర్మిల..

ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని చెప్పారు. ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపు నిద్ధామని సూచించిన ఇచ్చరు వైఎస్ షర్మిల… కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు..

madagoni surendar

Apr 01 2023, 12:47

కేతేపల్లి మండలం బండ పాలెం గ్రామంలో గల సారంగచల గుట్టపై వెలసిన రాములవారిని అత్యంత మహిమగల దేవుడని భక్తులు నమ్ముతారు.

నేడు శ్రీరాములోరి రథోత్సవం..

.

Streetbuzz news నల్గొండ జిల్లా :

భక్తుల కోరికలు తీర్చే భగవంతునిగా పేరున్న శ్రీ సీతారామచంద్ర స్వామి రథోత్సవం (జాతర) నేడు (శనివారం రాత్రి) అంగరంగ వైభవంగా జరగనుంది. 100 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన కేతేపల్లి మండలం బండ పాలెం గ్రామంలో గల సారంగచల గుట్టపై వెలసిన రాములవారిని అత్యంత మహిమగల దేవుడని భక్తులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి రథోత్సవా న్ని వేలాది మంది భక్తుల మధ్య ఘనంగా నిర్వహిస్తారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం:

ఆలయ చైర్మన్ మారం మీనా రెడ్డి

ఈ రోజు రాత్రి నిర్వహించే స్వామి వారి రథోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాం.

రథోత్సవం తిలకించడానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచే కాక జిల్లా నలుములాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

ఉదయం నుంచే పలు పూజలు రాత్రి 8గంటలకు రథోత్సవం ప్రారంభం కానుంది. రథోత్సవం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ మారం మీనా రెడ్డి పేర్కొన్నారు.

madagoni surendar

Apr 01 2023, 09:25

టెన్త్​తో సెంట్రల్​లో కొలువు.. ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టెన్త్​తో సెంట్రల్​లో కొలువు.. ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టెన్త్​తో సెంట్రల్​లో కొలువు సాధించేందుకు సీఆర్​పీఎఫ్​ నోటిఫికేషన్​ మంచి అవకాశం. ఇటీవలే సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9,212 కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(టెక్నికల్, ట్రేడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పోస్టుల భర్తీకి ప్రకటన రిలీజ్​ చేసింది. చిన్న వయసులోనే కేంద్ర కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు ఇదే మంచి ఛాన్స్​. ఈ నేపథ్యంలో సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలు, అర్హతలు, సెలెక్షన్​ ప్రాసెస్​, ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలుసుకుందాం..

సీఆర్​పీఎఫ్​ ఉద్యోగాలకు పురుషులతో పాటు మహిళలు పోటీ పడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మొత్తం పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 105 ఉద్యోగాలు మహిళలకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 428 పోస్టులు, తెలంగాణలో 307 పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సంఖ్యను ప్రకటించినప్పటికీ..అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రాల్లో నియామకాలు ఖరారు చేస్తారు.

టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగాలు: పురుష అభ్యర్థులకు 15 విభాగాల్లో, మహిళా అభ్యర్థులకు ఏడు విభాగాల్లో అవకాశాలు కల్పించారు. ఇందులో డ్రైవర్, మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెకానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్, కోబ్లర్, టైలర్, బ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాండ్, పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాట­ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారియర్, వాషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్, బార్బర్, సఫాయి కర్మచారి విభాగాలు పురుషులకు కేటాయించారు. బగ్లర్, కుక్, వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారియర్, వాషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమెన్, హెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రెస్సర్, సఫాయి కర్మచారి, బ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు మహిళలకు కేటాయించారు.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అభ్యర్థులు హెవీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండాలి. మెకానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు మెకానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఆగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1, 2023 నాటికి 21- నుంచి 27ఏళ్లు. మిగతా పోస్టులకు 18- నుంచి 23 ఏళ్లు ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు అ­యిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పు­న గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎగ్జామ్​ సక్సెస్ సీక్రెట్​

నాలుగు దశల్లో మొదటి అంచెలో నిర్వహించే రాతపరీక్ష కీలకం. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగానే తదుపరి దశలకు ఎంపిక చేస్తారు.

జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఈ విభాగంలో మంచి స్కోర్​ సాధించాలంటే వెర్బల్, నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-వెర్బల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశాలపై పట్టు సాధించాలి. విజువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెమరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్, కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – డీకోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనాలజీ, ఫిగరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనాలజీ, వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్, స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజువలైజేషన్, సిమిలారిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాల్వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనాలిసిస్, వెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డయాగ్రమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి టాపిక్స్​పై ఫోకస్​ చేయాలి.

జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఈ విభాగంలో రాణించాలంటే ఇండియన్​ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

ఎలిమెంటరీ మ్యాథ్స్​: ప్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు అర్థ గణిత అంశాలపై ఫోకస్ చేస్తే ఇందులో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. డెసిమల్స్, ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాస్, ఆల్జీబ్రా, లీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీపై దృష్టి పెట్టాలి.

ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/హిందీ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచుకోవచ్చు. అధిక శాతం మంది ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంచుకుంటారు. బేసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన పెంచుకోవాలి. యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ప్యాసివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయిస్, డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీచ్, వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంప్రహెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధన చేయాలి.

కామన్​ ప్రిపరేషన్​

సెంట్రల్​తో పాటు స్టేట్​కు సంబంధించి వివిధ పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు రిలీజ్​ అయ్యాయి. ఈ సమయంలో ఉమ్మడి సిలబస్​ చూసుకొని అన్నింటికి కామన్​గా ప్రిపరేషన్​ కొనసాగిస్తే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రిపరేషన్​లో భాగంగా ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేయాలి. అభ్యర్థులు ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఇతర పరీక్షల ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్ష ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుసంధానం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియామక పరీక్షలు, స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసిన ఆర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్షలకు పోటీ పడుతున్న అభ్యర్థులు.. ఆ పరీక్షల ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉపయోగకరంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో ఒకే సమయంలో వివిధ పోటీపరీక్షలకు ప్రిపేర్​ కావచ్చు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​

రాత పరీక్షను నాలుగు విభాగాల్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎలిమెంటరీ మ్యాథ్స్​, ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/హిందీ మీడియంలో పరీక్ష ఉంటుంది. ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం వంద మార్కులకు పరీక్ష జరుగుతుంది.

ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: రాత పరీక్షలో చూపిన ప్రతిభ, నిర్దిష్ట కటాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిబంధనల మేరకు మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాబితాలో నిలిచిన వారికి రెండో దశలో ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తారు. పురుషులు 170 సెం.మీ ఎత్తు, మహిళలు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. పురుషుల ఛాతి విస్తీర్ణం 80 సెం.మీ.ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు అయిదు సెం.మీ పెరగాలి.

ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫిషియన్సీ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: మూడో దశలో ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫిషియన్సీ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తారు. ఆయా ట్రే­డ్స్, విభాగాలకు రన్నింగ్​ నిర్వహిస్తారు. డ్రైవర్, పెయింటర్, కార్పెంటర్, బ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాండ్, పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాండ్, కోబ్లర్, టైలర్, మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెకానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్, గార్డెనర్, బగ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టుల అభ్యర్థులు 5 కిలో మీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో (మహిళా అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 8 నిమిషాల 30 సెకండ్లలో) చేరుకోవాలి. కుక్, వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారియర్, వాషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమెన్, సఫాయి కర్మచా­రి, బార్బర్, హెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రెస్స­ర్,వాషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాన్ పోస్టుల అభ్యర్థులు 1.6కిలో మీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. మహిళా అభ్యర్థులు 12 నిమిషాల్లో చేరుకోవాలి.

ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: నాలుగో దశలో 50మార్కులకు ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తా­రు. ఇందులో అభ్యర్థులు ఎంచుకున్న విభాగంలో ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తమ స్కిల్స్​ చూపించాలి. ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తప్పనిసరిగా 20 మార్కులు సాధించాలి. చివరగా మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్, డా­క్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు.

నోటిఫికేషన్​

సెలక్షన్​ ప్రాసెస్​: సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ట్రేడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పోస్టుల భర్తీకి కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్ష, ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫిషియన్సీ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వయసు పోస్టును బట్టి 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఏప్రిల్​ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్​ టికెట్స్​ జూన్​ 20 నుంచి 25 వరకు జారీ చేస్తారు.

రాతపరీక్ష: జులై 1 నుంచి జులై 13 వరకు నిర్వహిస్తారు.

వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పూర్తి వివరాలకు www.crpf.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.