madagoni surendar

Apr 01 2023, 14:12

ఏపీ:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రాంచంద్ర రావు : ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది..

కేవీపీ రామచంద్ర రావు : ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది..

భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. తమ స్వార్ధప్రయోజనాల కోసం కొన్ని ప్రమాదకర పద్ధతులను కేంద్ర ప్రభుత్వం పాటిస్తోంది..

ఉన్మాద మనస్తత్వం కలిగిన ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాం అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు.. విజయవాడలో మీట్‌ ద ప్రెస్‌లో మాట్లాడిన ఆయన.. భారతదేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. భారతదేశానికి లక్షల కోట్ల అప్పు పెరుగుతుంటే.. అదానీకి మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయని మండిపడ్డారు.. మనం కట్టే ప్రతీ కరెంట్ బిల్లులో అదానీకి వాటా వెళ్తుందని.. అదానీ నుంచి ప్రధాని మోడీకి వాటా వెళ్తుందని సంచలన ఆరోపణలు చేశారు కేవీపీ.. ఇక, రాహుల్ గాంధీ ప్రశ్నించడం మొదలు పెట్టడంతో మోడీ ప్రభుత్వం తలక్రిందులైందన్న ఆయన.. అదానీని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద పరిగణిస్తున్నారు. ఒక అవినీతి పరుడిని ప్రశ్నిస్తే దేశద్రోహం కిందకి వస్తుందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఏపీ నుంచి 25 మంది ఎంపీలు.. 11 మంది రాజ్యసభ సభ్యులు,151 మంది ఎమ్మెల్యేలున్నారు.. ఏ ఒక్క ఎంపీ అయినా రాహుల్ గాంధీ అనర్హత వేటు పై ప్రశ్నించారా..? అని నిలదీశారు కేవీపీ.. ఇలాంటి నేతలను మనం ఎన్నుకున్నందుకు సిగ్గుతో తలదించుకోవాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేవీపీ రామచంద్రరావు.

madagoni surendar

Apr 01 2023, 12:59

ఏపీ :రాష్ట్రంలో పలు సర్వే సంస్థలు జరిపిన సర్వేలలో వైసీపీకి, టిడిపికి మధ్య పోటీ నువ్వా నేనా అనే రీతిలో ఉన్నట్లు తెలుస్తుంది.

రాష్ట్రంలో పలు సర్వే సంస్థలు జరిపిన సర్వేలలో వైసీపీకి, టిడిపికి మధ్య పోటీ నువ్వా నేనా అనే రీతిలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఒక సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పక్కాగా 65 అసెంబ్లీ స్థానాలు వస్తాయని అభిప్రాయం. వైసీపీలో ఉన్న 151 మందిలో దాదాపుగా 50 మందికి పైగా ఎమ్మెల్యేలకు గెలుపు గుర్రాలు దూరంగా ఉన్నట్లు అంటున్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ రెడ్డి ఈనెల 3న ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించడమే కాక డిసెంబర్లో ఎన్నికలకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందనేది అభిప్రాయ సేకరణ చేయవచ్చునని తెలిసింది. ఇటీవల అమిత్ షాను కలిసినప్పుడు ఈ విషయమై సీఎం ఆయనతో సుదీర్ఘంగా చర్చించినట్లు అలానే కర్ణాటకలో బిజెపి పరిస్థితి ఆశాజనకంగా లేనందున పరోక్షంగా జగన్ రెడ్డిని కర్ణాటక ఎన్నికలకు సహాయం అడిగినట్లుగా అభిజ్ఞ వర్గాల కథనం. దీనికి జగన్ రెడ్డి కూడా అంగీకరించినట్లుగా అంటున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీలకు పరిస్థితి అనుకూలంగా లేని స్థితి ఉంది. బిజెపి, జనసేన అలయన్స్ అయోమయంలో ఉండగా జనసేనలో ఎక్కువ మంది నాయకులు టిడిపి తో పయనించాలని సూచనలు చేస్తున్నట్లు తెలిసింది. బిజెపి అధిష్టానం పొత్తుల విషయమై ప్రస్తుతం నోరు మెదపడం లేదు. సీఎంకు బిజెపి అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడి రాష్ట్ర బిజెపి నాయకత్వానికి లేదనేది అందరికీ తెలిసిన సత్యం. ఈనెల 3న వైసిపి ఎమ్మెల్యేల సమావేశం తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయంగా రానున్న మూడు నెలల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

వైయస్సార్ ప్రసాద్

సీనియర్ జర్నలిస్ట్.

madagoni surendar

Apr 01 2023, 12:53

హైదరాబాద్ ::బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు వైఎస్ షర్మిల ఫోన్..

బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు వైఎస్ షర్మిల ఫోన్..

హైదరాబాద్:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరిన వైఎస్ షర్మిల..

ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని చెప్పారు. ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపు నిద్ధామని సూచించిన ఇచ్చరు వైఎస్ షర్మిల… కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు..

madagoni surendar

Apr 01 2023, 12:47

కేతేపల్లి మండలం బండ పాలెం గ్రామంలో గల సారంగచల గుట్టపై వెలసిన రాములవారిని అత్యంత మహిమగల దేవుడని భక్తులు నమ్ముతారు.

నేడు శ్రీరాములోరి రథోత్సవం..

.

Streetbuzz news నల్గొండ జిల్లా :

భక్తుల కోరికలు తీర్చే భగవంతునిగా పేరున్న శ్రీ సీతారామచంద్ర స్వామి రథోత్సవం (జాతర) నేడు (శనివారం రాత్రి) అంగరంగ వైభవంగా జరగనుంది. 100 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన కేతేపల్లి మండలం బండ పాలెం గ్రామంలో గల సారంగచల గుట్టపై వెలసిన రాములవారిని అత్యంత మహిమగల దేవుడని భక్తులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి రథోత్సవా న్ని వేలాది మంది భక్తుల మధ్య ఘనంగా నిర్వహిస్తారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం:

ఆలయ చైర్మన్ మారం మీనా రెడ్డి

ఈ రోజు రాత్రి నిర్వహించే స్వామి వారి రథోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాం.

రథోత్సవం తిలకించడానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచే కాక జిల్లా నలుములాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

ఉదయం నుంచే పలు పూజలు రాత్రి 8గంటలకు రథోత్సవం ప్రారంభం కానుంది. రథోత్సవం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ మారం మీనా రెడ్డి పేర్కొన్నారు.

madagoni surendar

Apr 01 2023, 09:25

టెన్త్​తో సెంట్రల్​లో కొలువు.. ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టెన్త్​తో సెంట్రల్​లో కొలువు.. ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టెన్త్​తో సెంట్రల్​లో కొలువు సాధించేందుకు సీఆర్​పీఎఫ్​ నోటిఫికేషన్​ మంచి అవకాశం. ఇటీవలే సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9,212 కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(టెక్నికల్, ట్రేడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పోస్టుల భర్తీకి ప్రకటన రిలీజ్​ చేసింది. చిన్న వయసులోనే కేంద్ర కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు ఇదే మంచి ఛాన్స్​. ఈ నేపథ్యంలో సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలు, అర్హతలు, సెలెక్షన్​ ప్రాసెస్​, ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలుసుకుందాం..

సీఆర్​పీఎఫ్​ ఉద్యోగాలకు పురుషులతో పాటు మహిళలు పోటీ పడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మొత్తం పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 105 ఉద్యోగాలు మహిళలకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 428 పోస్టులు, తెలంగాణలో 307 పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సంఖ్యను ప్రకటించినప్పటికీ..అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రాల్లో నియామకాలు ఖరారు చేస్తారు.

టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగాలు: పురుష అభ్యర్థులకు 15 విభాగాల్లో, మహిళా అభ్యర్థులకు ఏడు విభాగాల్లో అవకాశాలు కల్పించారు. ఇందులో డ్రైవర్, మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెకానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్, కోబ్లర్, టైలర్, బ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాండ్, పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాట­ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారియర్, వాషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్, బార్బర్, సఫాయి కర్మచారి విభాగాలు పురుషులకు కేటాయించారు. బగ్లర్, కుక్, వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారియర్, వాషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమెన్, హెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రెస్సర్, సఫాయి కర్మచారి, బ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు మహిళలకు కేటాయించారు.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అభ్యర్థులు హెవీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండాలి. మెకానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు మెకానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఆగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1, 2023 నాటికి 21- నుంచి 27ఏళ్లు. మిగతా పోస్టులకు 18- నుంచి 23 ఏళ్లు ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు అ­యిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పు­న గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎగ్జామ్​ సక్సెస్ సీక్రెట్​

నాలుగు దశల్లో మొదటి అంచెలో నిర్వహించే రాతపరీక్ష కీలకం. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగానే తదుపరి దశలకు ఎంపిక చేస్తారు.

జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఈ విభాగంలో మంచి స్కోర్​ సాధించాలంటే వెర్బల్, నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-వెర్బల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశాలపై పట్టు సాధించాలి. విజువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెమరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్, కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – డీకోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనాలజీ, ఫిగరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనాలజీ, వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్, స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజువలైజేషన్, సిమిలారిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాల్వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనాలిసిస్, వెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డయాగ్రమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి టాపిక్స్​పై ఫోకస్​ చేయాలి.

జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఈ విభాగంలో రాణించాలంటే ఇండియన్​ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

ఎలిమెంటరీ మ్యాథ్స్​: ప్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు అర్థ గణిత అంశాలపై ఫోకస్ చేస్తే ఇందులో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. డెసిమల్స్, ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాస్, ఆల్జీబ్రా, లీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీపై దృష్టి పెట్టాలి.

ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/హిందీ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచుకోవచ్చు. అధిక శాతం మంది ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంచుకుంటారు. బేసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన పెంచుకోవాలి. యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ప్యాసివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయిస్, డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీచ్, వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంప్రహెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధన చేయాలి.

కామన్​ ప్రిపరేషన్​

సెంట్రల్​తో పాటు స్టేట్​కు సంబంధించి వివిధ పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు రిలీజ్​ అయ్యాయి. ఈ సమయంలో ఉమ్మడి సిలబస్​ చూసుకొని అన్నింటికి కామన్​గా ప్రిపరేషన్​ కొనసాగిస్తే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రిపరేషన్​లో భాగంగా ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేయాలి. అభ్యర్థులు ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఇతర పరీక్షల ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్ష ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుసంధానం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియామక పరీక్షలు, స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసిన ఆర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్షలకు పోటీ పడుతున్న అభ్యర్థులు.. ఆ పరీక్షల ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉపయోగకరంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో ఒకే సమయంలో వివిధ పోటీపరీక్షలకు ప్రిపేర్​ కావచ్చు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​

రాత పరీక్షను నాలుగు విభాగాల్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎలిమెంటరీ మ్యాథ్స్​, ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/హిందీ మీడియంలో పరీక్ష ఉంటుంది. ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం వంద మార్కులకు పరీక్ష జరుగుతుంది.

ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: రాత పరీక్షలో చూపిన ప్రతిభ, నిర్దిష్ట కటాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిబంధనల మేరకు మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాబితాలో నిలిచిన వారికి రెండో దశలో ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తారు. పురుషులు 170 సెం.మీ ఎత్తు, మహిళలు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. పురుషుల ఛాతి విస్తీర్ణం 80 సెం.మీ.ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు అయిదు సెం.మీ పెరగాలి.

ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫిషియన్సీ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: మూడో దశలో ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫిషియన్సీ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తారు. ఆయా ట్రే­డ్స్, విభాగాలకు రన్నింగ్​ నిర్వహిస్తారు. డ్రైవర్, పెయింటర్, కార్పెంటర్, బ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాండ్, పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాండ్, కోబ్లర్, టైలర్, మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెకానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్, గార్డెనర్, బగ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టుల అభ్యర్థులు 5 కిలో మీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో (మహిళా అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 8 నిమిషాల 30 సెకండ్లలో) చేరుకోవాలి. కుక్, వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారియర్, వాషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమెన్, సఫాయి కర్మచా­రి, బార్బర్, హెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రెస్స­ర్,వాషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాన్ పోస్టుల అభ్యర్థులు 1.6కిలో మీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. మహిళా అభ్యర్థులు 12 నిమిషాల్లో చేరుకోవాలి.

ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: నాలుగో దశలో 50మార్కులకు ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తా­రు. ఇందులో అభ్యర్థులు ఎంచుకున్న విభాగంలో ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తమ స్కిల్స్​ చూపించాలి. ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తప్పనిసరిగా 20 మార్కులు సాధించాలి. చివరగా మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్, డా­క్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు.

నోటిఫికేషన్​

సెలక్షన్​ ప్రాసెస్​: సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ట్రేడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పోస్టుల భర్తీకి కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్ష, ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫిషియన్సీ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వయసు పోస్టును బట్టి 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఏప్రిల్​ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్​ టికెట్స్​ జూన్​ 20 నుంచి 25 వరకు జారీ చేస్తారు.

రాతపరీక్ష: జులై 1 నుంచి జులై 13 వరకు నిర్వహిస్తారు.

వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పూర్తి వివరాలకు www.crpf.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.

madagoni surendar

Apr 01 2023, 09:07

ఏపీ ::జర్నలిజంలో డిప్లోమా కోర్సు కు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసిన ఎపి సమాచార పౌర సంబంధాల మంత్రి*

జర్నలిజంలో డిప్లోమా కోర్సు కు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసిన ఎపి సమాచార పౌర సంబంధాల మంత్రి*

సమాజ చైతన్యమే లక్ష్యంగా పనిచేసే జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రెస్ అకాడమీ "జర్నలిజంలో డిప్లోమా కోర్సు" ప్రారంభించడం ముదావహం అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ అన్నారు. ఇందుకు ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు ను మంత్రి అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రంలో జర్నలిజంలో డిప్లోమా కోర్సు కు సంబంధించిన నోటిఫికేషన్ ను మంత్రి విడుదల చేశారు. ప్రభుత్వఆధ్వర్యంలో తొలిసారిగా "జర్నలిజంలో డిప్లోమా కోర్సు" ను ప్రెస్ అకాడమి ప్రారంభించడం జర్నలిస్టులకు, ఆ రంగంలో అభిరుచి వున్న అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశంగా మంత్రి అభివర్ణించారు. జర్నలిస్టుల కలానికున్న బలాన్ని మరింతగా మెరుగులు దిద్దుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు సంబందించిన హెల్త్ కార్డుల విషయమై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా హెల్ప్ లైన్ లో ప్రత్యేకంగా నెంబరు 4 ను పొందుపరుస్తున్నట్లు మంత్రి తెలిపి, ఆ మేరకు వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ సి.ఈ.ఓ. ప్రెస్ అకాడమి చైర్మన్ కు పంపిన లేఖను కార్యక్రమం లో చదివి వినిపించారు. 8 వేల 699 మంది వర్కింగ్ జర్నలిస్టులకు, వారికి చెందిన 26 వేల 800 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉచిత వైద్య సేవలు అందుతున్నట్లు మంత్రి ఆ లేఖ లో పేర్కొన్న విషయాన్ని జర్నలిస్టుల దృష్టికి తెచ్చారు. ఉచిత వైద్యసేవల అందుబాటులో సమస్యల పరిష్కార మార్గాలతో బాటు, జర్నలిస్టులు రచించిన పుస్తకాలు గ్రంథాలయాల ద్వారా కొనుగోలు చేసేందుకు అంగీకరింపచేసిన ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులు ఎంతగానో ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్లకు సంబంధించి ప్రభుత్వ ఉత్తరువులు శుక్రవారం విడుదల కానున్నట్లు మంత్రి ప్రకటించారు.

ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ అన్ని సంస్థలు, ప్రభుత్వాలు ప్రజా సంబంధాల పై దృష్టి పెట్టిన నేపాధ్యంలో జర్నలిజం లో డిప్లొమో అవసరాన్ని తాము గుర్తించి, వర్కింగ్ జర్నలిస్టులకు, అభిరుచి వున్న ఇతర అభ్యర్థులకు ప్రయోజనకరం గా ఉండేలా రూపొందించామని చెప్పారు. ఈ డిప్లొమో కోర్సు నోటిఫికేషన్ విడుదల చేసినందుకు ఆయన మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పత్రికారంగానికి ఆద్యులైన కందుకూరి వీరేశలింగం వంటి ప్రాంతమైన రాజమహేంద్రవరం నుండి "జర్నలిజంలో డిప్లోమా కోర్సు" ను ప్రెస్ అకాడెమీ ప్రారంభించడం సంతోష దాయకమన్నారు. శుక్రవారం (31. 03. 23) నుంచి ప్రెస్ అకాడమి వెబ్ సైట్ pressacademy.ap.gov.in నుండి ఈ కోర్సుకు సంబంధించిన దరఖాస్తులు డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించారు. అడ్మిషన్ ల కోసం చివరి తేది 15. 04. 2023 గా నిర్ణయించారు. కోర్సుకు సంబంధించిన సందేహాలకు 9154104393 మొబైల్ నంబర్ కు కాల్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కోర్సు మెటీరియల్ రూపొందించేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ ఇన్ చార్జ్ (ఎల్ యస్ యస్ బి) ఎల్. వి. కె రెడ్డి, నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగపు అధిపతి డా. జి అనిత, ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీ పి. బాబీ వర్ధన్ ల సారధ్యంలో కోర్సు మెటీరియల్ రూపొందించడం జరిగిందన్నారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ నిబంధనలకనుగుణంగా కోర్సు మెటీరియల్ రూపొందించామని ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సపోర్ట్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీ ఎల్. వి. కె రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ ప్రదానం వంటి అంశాలు నాగార్జున యూనివర్సిటీ ద్వారా జరుగుతాయని ఆయన వివరించారు. జర్నలిస్టులకు కోర్సు ఫీజు రూ. 1500/- గాను, ఇతరులకు రూ. 2000/- గాను నిర్ణయించడం జరిగిందన్నారు. ఓపెన్ యూనివర్సిటీ ఫీజులుకంటే ఇవి తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. సమావేశం లో శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా, ప్రెస్ అకాడమీ సెక్రెటరీ శ్రీ ఎం. బాలగంగాధర తిలక్, రాజమండ్రి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు శ్రీ మండేల శ్రీ రామ మూర్తి, అధ్యక్షులు శ్రీ కుడుపూడి పార్ధ సారధి, ప్రెస్ అకాడమి కంటెంట్ ఎడిటర్ శ్రీ కలమండ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భగా ప్రెస్ అకాడమీ తరపున సీనియర్ పాత్రికేయులు శ్రీ ఏ. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి, చిరుకూరి సాయి బాబా లను ప్రెస్ అకాడెమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు సన్మానించారు.

madagoni surendar

Apr 01 2023, 09:00

సూర్యాపేట జిల్లా:: వర్షంలో రైతులకు సాయమందించిన పోలీసులపై ప్రశంసల వర్షం

సూర్యాపేట జిల్లా వర్షంలో రైతులకు సాయమందించిన పోలీసులపై ప్రశంసల వర్షం

సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం( Heavy Rain ) కురిసింది. మఠంపల్లి మండలం( Mattampally Mandal )లో కల్లాల్లో ఉంచిన మిర్చి పంట పూర్తిగా తడిసి ముద్దైంది..

అటుగా వెళ్తున్నపోలీసులు( Police ) పెద్ద మనసు చాటుకున్నారు. ఈదురుగాలుతో కూడిన వర్షానికి తడుస్తున్న మిర్చి పంటను పట్టాలతో కప్పేందుకు ఇబ్బంది పడుతున్న రైతులకు( Farmers ) పోలీసులు సహాయం అందించారు.

అయితే శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెంలో బండ లాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో అక్కడ బందోబస్తుకు వెళ్లిన ఎస్ఐ రవికుమార్. తిరిగి వెళ్తుండగా రైతుల కష్టాలను గమనించారు. క్షణం కూడా ఆలోచించకుండా.. ఎస్ఐ రవికుమార్ తన వాహనాన్ని రోడ్డుపై ఆపి సిబ్బందితో కల్లాల్లోకి వెళ్లి పట్టాలు కప్పి, రైతులకు అండగా నిలిచారు.

madagoni surendar

Mar 31 2023, 19:28

ఏపీ ::వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో వివాహితుడు (32),ఇంటి పక్కన నివాసం ఉండే బాలిక(14) పై అగయిత్యానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వివాహితుడు ఫోక్సో కేసు నమోదు

వత్సవాయి :

వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో వివాహితుడు (32),ఇంటి పక్కన నివాసం ఉండే బాలిక(14) పై అగయిత్యానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.

బలవంతంగా మైనర్ బాలికను అనుభవించి గర్భం దాల్చడానికి కారకుడైన యువకుని పై వత్సవాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.వత్సవాయి మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన మైనర్ బాలిక పై అదే గ్రామానికి చెందిన షేక్ సుభాని ఆరు నెలల క్రితం ఆమెను బలవంతంగా అనుభవించాడని,ఈ విషయం ఎవరికైనా చెప్పినట్లయితే చంపుతానని బాలికను బెదిరించనట్లుగా,ఆ బాలిక భయపడి ఎవరికి ఏమి చెప్పకుండా ఉన్నదని,కాలక్రమేనా ఆ బాలికలో వస్తున్న మార్పులను గమనించిన తల్లి ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఐదు నెలల గర్భవతి అయిందని,మైనర్ బాలిక తల్లి తన కుమార్తెను అడుగగా గ్రామానికి చెందిన షేక్ సుభాని బలవంతంగా తన పై అఘాయిత్యం చేశాడని తల్లికి వెల్లడించడంతో బాధితురాలి తల్లి ఏ వెంకటరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకునిపై కేసు నమోదు చేసి,బాలికను వైద్య పరీక్ష నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తరలించినట్లుగా స్థానిక ఎస్ఐ అభిమన్యు తెలిపారు.

madagoni surendar

Mar 31 2023, 17:31

నెల్లూరు జిల్లా, తేది: *అధిక శబ్దం చేసే సైలెన్సర్లు అమర్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు- జిల్లా యస్.పి. విజయ రావు,ఐ పి ఎస్.

నెల్లూరు జిల్లా, తేది:

అధిక శబ్దం చేసే సైలెన్సర్లు అమర్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు- జిల్లా యస్.పి. విజయ రావు,ఐ పి ఎస్.

విపరీతమైన ధ్వని పుట్టించే సైలెన్సర్ల బైకర్లపై ఉక్కుపాదం మోపుతున్న నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు

అధిక శబ్దం చేసే సైలన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించేది లేదు జిల్లా యస్.పి.

ద్విద్రవాహనాల సైలెన్సర్ లతో అధిక శబ్దాలు చేస్తే వాహనాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తాం.

యస్.పి. ఆదేశాల మేరకు అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) అధ్వర్యంలో

ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో 420 వాహనాల సైలెన్సర్ లను ద్వంసం.

డ్రంక్ & డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ ధరించాలని, పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచనలు.

ఈ రోజు ఉదయం మాగుంట లేవుట్ లోని అవుట్ పోస్టు సమీపంలో జిల్లా యస్.పి.విజయ రావు, IPS., ఆదేశాల మేరకు అడిషనల్ యస్.పి. (క్రైమ్స్) శ్రీ ప్రసాద్ అధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో తీసివేసిన 420 సైలెన్సర్ లను తొక్కించడం జరిగింది. SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., ఆదేశాల మేరకు

నెల్లూరు టౌన్ లో ట్రాఫిక్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి గత రెండు నెలలలో అధిక శబ్దం చేసే సైలెన్సర్లు గల వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 420 సైలెన్సర్ లను తీసివేయడంజరిగింది.

ప్రజలకు, తోటి వాహనదారులకు అసౌకర్యం కలిగిస్తూ ధ్వని కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు ఉన్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

రణగొణ ధ్వనులు చేసే సైలన్సర్లను ఆయా వాహనదారులచే ఊడదీయించి తిరిగి బండికి వచ్చిన ఒరిజినల్ సైలెన్సర్లనే బిగించేలా చేశారు.

ఈ సందర్భంగా అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో అధిక శబ్దం చేసే సైలన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించమన్నారు.

వాహనదారులు ఈ విషయంలో ఒరిజినల్ సైలన్సర్లనే ఉపయోగించాలన్నారు.

సైలెన్సర్ తీసేసి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు పెడతామని, వాహనాలకు ఇటువంటి సైలెన్సర్లను విక్రయించే షాపుల యజమానులు, వాటిని బిగించే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై కూడా ఈ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.

పోలీసులు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్ లో మొత్తం 420 వాహనాల సైలెన్సర్ లను తీసి వేసి, వాటిని ద్వంసం చేసారు.

ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు.

తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.

జిల్లా పోలీసు కార్యాలయం. SPS నెల్లూరు జిల్లా.

madagoni surendar

Mar 31 2023, 15:47

నల్లగొండ మీదుగా వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న పీఎం మోడీ.

నల్లగొండ మీదుగా వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న పీఎం మోడీ

ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు శుభవార్త అందింది. అనుకోని అతిథి వచ్చినట్టు జిల్లా మీదుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

నల్లగొండ మీదుగా వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న పీఎం మోడీ

ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు శుభవార్త అందింది. అనుకోని అతిథి వచ్చినట్టు జిల్లా మీదుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైలు జిల్లా మీదుగా పరుగులు తీయనుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ఈ రైలును ఏప్రిల్ 8న ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు నిర్ణయించారు. దీనిని మొదట కాజీపేట మార్గంలో నడపాలని రూట్ మ్యాప్ రూపొందించినా.. ఎక్కువ దూర భారం అవుతుందని భావించి ప్రయాణ సమయం తగ్గించటానికి బీబీనగర్ నుంచి నడికుడ మార్గం సరైందని గుర్తించారు. ఈ మార్గంలో 130 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. ఈ వందే భారత్ రైలుని మోడీ చేతుల మీదుగా ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నిత్యం వెళ్లే నారాయణాద్రి 12:30 గంటల సమయం పడుతుండగా.. వందే భారత్ రైలు 9 గంటల కన్నా తక్కువ సమయంలో వెళ్లనుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, వందే భారత్ రైలును ఆరు స్టేషన్లలోనే ఆపనున్నారు. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్.. నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో నిలపనున్నారు.