నెల్లూరు జిల్లా, తేది: *అధిక శబ్దం చేసే సైలెన్సర్లు అమర్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు- జిల్లా యస్.పి. విజయ రావు,ఐ పి ఎస్.
నెల్లూరు జిల్లా, తేది:
అధిక శబ్దం చేసే సైలెన్సర్లు అమర్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు- జిల్లా యస్.పి. విజయ రావు,ఐ పి ఎస్.
విపరీతమైన ధ్వని పుట్టించే సైలెన్సర్ల బైకర్లపై ఉక్కుపాదం మోపుతున్న నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు
అధిక శబ్దం చేసే సైలన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించేది లేదు జిల్లా యస్.పి.
ద్విద్రవాహనాల సైలెన్సర్ లతో అధిక శబ్దాలు చేస్తే వాహనాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తాం.
యస్.పి. ఆదేశాల మేరకు అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) అధ్వర్యంలో
ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో 420 వాహనాల సైలెన్సర్ లను ద్వంసం.
డ్రంక్ & డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ ధరించాలని, పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచనలు.
ఈ రోజు ఉదయం మాగుంట లేవుట్ లోని అవుట్ పోస్టు సమీపంలో జిల్లా యస్.పి.విజయ రావు, IPS., ఆదేశాల మేరకు అడిషనల్ యస్.పి. (క్రైమ్స్) శ్రీ ప్రసాద్ అధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో తీసివేసిన 420 సైలెన్సర్ లను తొక్కించడం జరిగింది. SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., ఆదేశాల మేరకు
నెల్లూరు టౌన్ లో ట్రాఫిక్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి గత రెండు నెలలలో అధిక శబ్దం చేసే సైలెన్సర్లు గల వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 420 సైలెన్సర్ లను తీసివేయడంజరిగింది.
ప్రజలకు, తోటి వాహనదారులకు అసౌకర్యం కలిగిస్తూ ధ్వని కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు ఉన్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
రణగొణ ధ్వనులు చేసే సైలన్సర్లను ఆయా వాహనదారులచే ఊడదీయించి తిరిగి బండికి వచ్చిన ఒరిజినల్ సైలెన్సర్లనే బిగించేలా చేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో అధిక శబ్దం చేసే సైలన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించమన్నారు.
వాహనదారులు ఈ విషయంలో ఒరిజినల్ సైలన్సర్లనే ఉపయోగించాలన్నారు.
సైలెన్సర్ తీసేసి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు పెడతామని, వాహనాలకు ఇటువంటి సైలెన్సర్లను విక్రయించే షాపుల యజమానులు, వాటిని బిగించే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై కూడా ఈ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.
పోలీసులు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్ లో మొత్తం 420 వాహనాల సైలెన్సర్ లను తీసి వేసి, వాటిని ద్వంసం చేసారు.
ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు.
తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
జిల్లా పోలీసు కార్యాలయం. SPS నెల్లూరు జిల్లా.
Mar 31 2023, 19:28