నిజంనిప్పులాంటిది

Mar 30 2023, 10:35

World Bank Chief : ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా..

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖరారైంది. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించకపోవడంతో

బుధవారం నామినేషన్లు ముగిశాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్సాస్ కొనసాగుతున్నారు.

అయితే, ఆయన పదవీకాలం ఒక సంవత్సరం ఉంది. ముందస్తుగా మాల్సాస్ పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాక్ అధ్యక్ష పదవికి ప్రతిపాదించారు. సాధారణంగా అమెరికా ప్రతిపాదించిన వ్యక్తికే ప్రపంచ బ్యాంక్ నాయకత్వ బాధ్యతలు దక్కుతూ వస్తున్నాయి.

నిజంనిప్పులాంటిది

Mar 30 2023, 10:34

Covid cases: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 3 వేలు దాటిన కేసులు

భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.

తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, నిన్నటితో పోలిస్తే 40% పెరిగింది..

దాదాపు ఆరు నెలల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.యాక్టివ్ కేసులు 13,509కి పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతంగా నమోదైంది. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది..

నిజంనిప్పులాంటిది

Mar 30 2023, 10:33

TSRTC: రాజధాని బస్సులో మంటలు.. NH65పై ట్రాఫిక్‌ జామ్‌

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. టీఎస్‌ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

ఈ క్రమంలో ప్రయాణికులు బస్సులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని మొద్దులచెరువులోని ఇందిరా నగర్‌ వద్ద రాజధాని ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే, బస్సు.. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కాగా, బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. నడిరోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో ఎన్‌హెచ్‌-65పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక, బస్సును మియాపూర్‌ డిపోకు చెందినదిగా గుర్తించారు.

ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, మృతుడు రాజును మునగాల మండలం ఇందిరానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు..

నిజంనిప్పులాంటిది

Mar 30 2023, 10:31

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో చర్చించిన కీలకాంశాలివే

ఢిల్లీ/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన..

► విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాలనుంచి కాపాడేందుకు, రక్షణగా విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా కూడా ఈ హామీలు ఇచ్చింది. విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరుతున్నాను..

ఈ సందర్భంగా.. హోం మంత్రి అమిత్‌ షాకి సీఎం జగన్‌ నివేదించిన కీలక అంశాలు

► పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను.

► అనూహ్య వరదల కారణంగా డయాఫ్రంవాల్‌ దెబ్బతింది. డయాఫ్రంవాల్‌ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.202౦ కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనావేసింది. ఈ డబ్బును వెంటనే విడుదలచేయాలని విజ్ఞప్తిచేస్తున్నాను.

► రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2,600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను..

నిజంనిప్పులాంటిది

Mar 29 2023, 08:02

Toll Charges: ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ బాదుడు

అమరావతి: జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ టోల్‌ రుసుములను సమీక్షిస్తారు..

అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 శాతం మేర పెరగనున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు తెలిపారు.

దీంతో రాష్ట్రంలో ఉన్న 58 టోల్‌ ప్లాజాల్లో ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన ఫీజులు అమల్లోకి రానున్నాయి. బీవోటీ కింద గుత్తేదారుల నిర్వహణలో ఉన్న మరో అయిదు టోల్‌ప్లాజాల రుసుమును జులై లేదా ఆగస్టులో సవరిస్తారు..

నిజంనిప్పులాంటిది

Mar 29 2023, 08:00

Hyderabad: నేడు టీడీపీ ఆవిర్భావ సభ.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం

తెలుగుదేశం పార్టీ 41 వసంతాలు పూర్తి చేసుకుంది.

తెలంగాణలో పార్టీని బలపరిచే లక్ష్యంతో పార్టీ 41వ ఆవిర్భావ సభను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.

ఇవాళ హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది..

రెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సహా దాదాపు 15 వేల మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

సభ నిర్వహణకు 12 కమిటీలను ఏర్పాటు చేశారు..

కష్టపడి పనిచేసే వారికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పార్టీ నేతలకు సమాచారం అందింది..

నిజంనిప్పులాంటిది

Mar 29 2023, 07:58

CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ!

ఏపీలో రాజకీయ పరిణామాలు వేడిగా ఉన్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురు దెబ్బలు తగిలాయి.

రాజధాని అమరావతి అంశంపై సుప్రీం కోర్టులో నిన్న విచారణ జరిగింది.

విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టాలని సీఎం జగన్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

ఇక, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి ఏదో ఒకటి తేలేలా ఉంది.

ఈ అంశాలపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో సీఎం జగన్ చర్చిస్తారని అంచనా ఉంది.

పోలవరం ఎత్తు గురించి కేంద్రం కీలక ప్రకటన కూడా చేసింది.

ఈ క్రమంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 18:57

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల.. మాస్క్‌ తప్పనిసరి ..

 కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

14 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు 10శాతం దాటింది. అదే సమయంలో 59 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5-10 మధ్య ఉన్నది.

గత వారంలో అనేక జిల్లాల్లో 40శాతానికిపైగా నమూనాలు పాజిటివ్‌గా తేలాయి. ఈ క్రమంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ మహమ్మారిని నివారించేందుకు రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేయాలని సూచించింది.

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 18:52

ఏప్రిల్ 1 నుంచి.. వీటి ధరలు మారుతాయ్..!

దిల్లీ: ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్‌(Union Budget 2023-24)లో చేసిన ప్రకటనల ఆధారంగా ఏప్రిల్ నుంచి కొన్ని వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. బడ్జెట్‌లో సుంకాలు, పన్ను స్లాబు ల్లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. దేశీయ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం కొన్నివస్తువులు ధరలు పెరగనున్నాయి. మరికొన్ని తగ్గనున్నాయి.

ధరలు పెరిగేవి..

ప్రైవేటు జెట్స్‌

హెలికాప్టర్లు

దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు

ప్లాస్టిక్ వస్తువులు

బంగారు ఆభరణాలు, వెండివస్తువులు, ప్లాటినం

ఇమిటేషన్ ఆభరణాలు

ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు

సిగరెట్లు

ధరలు తగ్గేవి..

దుస్తులు

వజ్రాలు, రంగు రాళ్లు

బొమ్మలు

సైకిళ్లు

టీవీలు

ఇంగువ, కాఫీ గింజలు

శీతలీకరించిన నత్తగుల్లలు

మొబైల్‌ ఫోన్లు

మొబైల్ ఫోన్ ఛార్జర్లు

కెమెరా లెన్స్‌లు

భారత్‌లో తయారైన ఎలక్ట్రానిక్ వాహనాలు

పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు

లిథియం అయాన్ బ్యాటరీలు

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 18:49

భూత‌గాదాలు.. పెద‌నాన్న‌ను వేట కొడ‌వ‌లితో న‌రికి చంపిన యువ‌కుడు

సంగారెడ్డి: ఝరాసంఘం మండ‌ల ప‌రిధిలోని బ‌ర్దిపూర్‌లో దారుణం జ‌రిగింది. సొంత పెద‌నాన్న‌ను ఓ యువ‌కుడు వేట కొడ‌వ‌లితో న‌రికి చంపాడు.

మొండెం నుంచి త‌ల‌ను వేరు చేశాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతుడిని చంద్ర‌న్న‌(70)గా పోలీసులు గుర్తించారు. అయితే భూత‌గాదాల‌తోనే చంద్ర‌న్న‌ను రాకేశ్ అనే యువ‌కుడు న‌రికి చంపిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. నిందితుడు రాకేశ్ జ‌హీరాబాద్ పోలీసు స్టేష‌న్‌లో లొంగిపోయాడు. మృతుడి నివాసంలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి.