ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో చర్చించిన కీలకాంశాలివే
ఢిల్లీ/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన..
► విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాలనుంచి కాపాడేందుకు, రక్షణగా విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా కూడా ఈ హామీలు ఇచ్చింది. విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరుతున్నాను..
ఈ సందర్భంగా.. హోం మంత్రి అమిత్ షాకి సీఎం జగన్ నివేదించిన కీలక అంశాలు
► పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను.
► అనూహ్య వరదల కారణంగా డయాఫ్రంవాల్ దెబ్బతింది. డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.202౦ కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనావేసింది. ఈ డబ్బును వెంటనే విడుదలచేయాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
► రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2,600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను..
Mar 30 2023, 10:31