నిజంనిప్పులాంటిది

Mar 29 2023, 07:58

CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ!

ఏపీలో రాజకీయ పరిణామాలు వేడిగా ఉన్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురు దెబ్బలు తగిలాయి.

రాజధాని అమరావతి అంశంపై సుప్రీం కోర్టులో నిన్న విచారణ జరిగింది.

విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టాలని సీఎం జగన్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

ఇక, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి ఏదో ఒకటి తేలేలా ఉంది.

ఈ అంశాలపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో సీఎం జగన్ చర్చిస్తారని అంచనా ఉంది.

పోలవరం ఎత్తు గురించి కేంద్రం కీలక ప్రకటన కూడా చేసింది.

ఈ క్రమంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 18:57

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల.. మాస్క్‌ తప్పనిసరి ..

 కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

14 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు 10శాతం దాటింది. అదే సమయంలో 59 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5-10 మధ్య ఉన్నది.

గత వారంలో అనేక జిల్లాల్లో 40శాతానికిపైగా నమూనాలు పాజిటివ్‌గా తేలాయి. ఈ క్రమంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ మహమ్మారిని నివారించేందుకు రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేయాలని సూచించింది.

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 18:52

ఏప్రిల్ 1 నుంచి.. వీటి ధరలు మారుతాయ్..!

దిల్లీ: ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్‌(Union Budget 2023-24)లో చేసిన ప్రకటనల ఆధారంగా ఏప్రిల్ నుంచి కొన్ని వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. బడ్జెట్‌లో సుంకాలు, పన్ను స్లాబు ల్లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. దేశీయ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం కొన్నివస్తువులు ధరలు పెరగనున్నాయి. మరికొన్ని తగ్గనున్నాయి.

ధరలు పెరిగేవి..

ప్రైవేటు జెట్స్‌

హెలికాప్టర్లు

దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు

ప్లాస్టిక్ వస్తువులు

బంగారు ఆభరణాలు, వెండివస్తువులు, ప్లాటినం

ఇమిటేషన్ ఆభరణాలు

ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు

సిగరెట్లు

ధరలు తగ్గేవి..

దుస్తులు

వజ్రాలు, రంగు రాళ్లు

బొమ్మలు

సైకిళ్లు

టీవీలు

ఇంగువ, కాఫీ గింజలు

శీతలీకరించిన నత్తగుల్లలు

మొబైల్‌ ఫోన్లు

మొబైల్ ఫోన్ ఛార్జర్లు

కెమెరా లెన్స్‌లు

భారత్‌లో తయారైన ఎలక్ట్రానిక్ వాహనాలు

పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు

లిథియం అయాన్ బ్యాటరీలు

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 18:49

భూత‌గాదాలు.. పెద‌నాన్న‌ను వేట కొడ‌వ‌లితో న‌రికి చంపిన యువ‌కుడు

సంగారెడ్డి: ఝరాసంఘం మండ‌ల ప‌రిధిలోని బ‌ర్దిపూర్‌లో దారుణం జ‌రిగింది. సొంత పెద‌నాన్న‌ను ఓ యువ‌కుడు వేట కొడ‌వ‌లితో న‌రికి చంపాడు.

మొండెం నుంచి త‌ల‌ను వేరు చేశాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతుడిని చంద్ర‌న్న‌(70)గా పోలీసులు గుర్తించారు. అయితే భూత‌గాదాల‌తోనే చంద్ర‌న్న‌ను రాకేశ్ అనే యువ‌కుడు న‌రికి చంపిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. నిందితుడు రాకేశ్ జ‌హీరాబాద్ పోలీసు స్టేష‌న్‌లో లొంగిపోయాడు. మృతుడి నివాసంలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి.

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 18:45

‘కేటీఆర్ నిన్ను ఏమనాలి బ్రోకర్, మూర్ఖుడు అనాలా... నాకు సంస్కారం అడ్డొస్తుంది’

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని.. చదువుకున్న వాడిగా కేటీఆర్‌ కు తగదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... మోదీని, బీజేపీని డిఫెండింగ్ చేయడమే పనిగా కేటీఆర్ పెట్టుకున్నారన్నారు. ప్రధాని మోదీ బ్రోకరిజం చేశారని కేటీఆర్ నిరూపించాలన్నారు.

‘‘కేటీఆర్ రాజు అయ్యేది లేదు.. యువరాజు అయ్యేది కూడా లేదు మోదీ వయసు ఎంత ... నీ వయసు ఎంత?. హఫీజ్‌పేట్‌లో భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఎందుకు అప్పీలు వేయలేదు?. సర్వే నెంబర్ 77లో భూమిని హైకోర్టు ఉత్తర్వులు కాదని ఓ వ్యక్తికి లాభం చేకూరేలా చేయలేదా. నిన్నేమనాలి బ్రోకర్, మూర్ఖుడు అనాలా... నాకు సంస్కారం అడ్డొస్తుంది.

ఈ భూమిలో అపార్ట్‌మెంట్ కట్టేందుకు అనుమతి ఎలా ఇచ్చారు. రూ.500 కోట్ల లబ్ది పొందిన ఆ వ్యక్తి నీకేమీ చేయలేదా. కోర్టు సస్పెండ్ చేసిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ భూమిపై విచారణ కొనసాగుతోంది. ఇక్కడ 8ఎకరాల భూమిని ఓ వ్యక్తి రిజిస్టర్ చేసుకున్నాడు. ఇప్పటి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ అపార్ట్‌మెంట్‌కు అనుమతి ఇచ్చారు. దీన్ని ఏమనాలి.. ఎవరు బ్రోకరిజం చేసారు. మీరు ఎక్కడ నీతిగా , నిజాయితీగా లేరు. హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇక్కడ జరిగిన అవకతవకలపై ఏం మాట్లాడుతారు. గతంలో ప్రధాన మంత్రిని తిడితే బొక్కలో వేయమని డీజీపీకి చెప్పాడు. మరి కేసీఆర్ సూచనల మేరకు మోదీని తిట్టినందుకు డీజీపీ చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. కేసీఆర్‌పై గతంలో ఆరోపణలు వచ్చాయి.. అవి మాట్లాడుతున్నారు’’ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు..

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 16:04

Andhra news: పులివెందులలో కాల్పుల కలకలం..

పులివెందుల: వైఎస్సార్‌ జిల్లా, సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. భరత్‌ కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తి తన తుపాకీ తీసుకొని ఇద్దరు వ్యక్తులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులకు తెగబడ్డాడు..

ఈ ఘటనలో తీవ్ర గాయాలైన దిలీప్‌, మహబూబ్‌ బాషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భరత్‌ కుమార్‌ యాదవ్‌, పులివెందుల పట్టణంలోని గొర్రెల వ్యాపారి దిలీప్‌ మధ్య ఆర్థికలావాదేవీలు ఉన్నాయి. గత వారం రోజులుగా ఇద్దరూ డబ్బుల విషయంలో గొడవపడుతున్నట్టు సమాచారం. దిలీప్‌.. భరత్‌కుమార్‌ యాదవ్‌కు అప్పు ఉండటంతో ఆ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పులివెందులలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఈరోజు మధ్యాహ్నం ఇద్దరూ తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగడంతో.. హుటాహుటిన ఇంట్లోకి దూసుకెళ్లిన భరత్‌కుమార్‌ యాదవ్‌ తనవద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దిలీప్‌ ఛాతి, నుదిటిపై కాల్పులు జరిపినట్టు సమాచారం.

ఆ సమయంలోనే అతడి పక్కనే ఉన్న దిలీప్‌ స్నేహితుడు మహబూబ్‌ బాషా అడ్డుకొనే ప్రయత్నం చేయగా.. అతడిపైనా కాల్పులు జరిపినట్టు బాధితులు చెబుతున్నారు. గాయాలతో వీరిద్దరూ ఆలయం మెట్ల వద్ద కింద పడిపోవడంతో భరత్‌కుమార్‌ యాదవ్‌ అక్కడి నుంచి తుపాకీతో పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో బాధితులను చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దిలీప్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కొద్ది సేపటి క్రితమే అతడిని ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. గతంలో వైఎస్‌ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని, సీబీఐ విచారణకు హాజరైన భరత్‌కుమార్‌ యాదవ్‌కు అసలు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భరత్‌ కుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 15:59

AP High court: కాపు రిజర్వేషన్లపై కౌంటర్‌ దాఖలు చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి: కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది..

ఇదే అంశంపై దాఖలైన అన్నీ పిటిషన్లను కలిపి తదుపరి విచారణలో విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 10% కోటాలో.. కాపులకు 5% రిజర్వేషన్‌ను అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. 10శాతం రిజర్వేషన్లపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగిసినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది రాధాకృష్ణ కోర్టుకు తెలిపారు..

కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని రిజర్వేషన్లు ఇవ్వలేమన్న ప్రభుత్వం.. ఇపుడు కేసు విచారణ ముగిసినా ఇవ్వడంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది సందిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే నెల 26కి హైకోర్టు వాయిదా వేసింది..

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 15:56

రమాదేవి హత్యలో పోలీసులు నిర్లక్ష్య వైఖరి సరికాదు

•PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు : మల్లెల ప్రసాద్

అనంతపురం జిల్లా లో సోమవారం నార్పల మండల పరిధిలోని బొందలవాడ గ్రామంలో దారుణ హత్యకు గురైన కడపల రమాదేవి మరియు మరీ ఎందరో గత వైసీపీ పాలన లో S.C S.T లు పై దౌర్జన్యం. దాడులు,హత్యలు మాన భంగాలు జరిగావి మాకు రక్షణ కల్పించలేరాని..?రమాదేవి ఫ్యామిలీ నిలదీశారు.రమాదేవి హత్యలో పోలీసులు నిర్లక్ష్య వైఖరి స్పష్టమని పిర్యాదు చేయడానికి పోయిన తల్లి, దండ్రులను పోలీసులు బెదిరించడం సరికాదన్నారు.

హంతుకుడు జాఫర్ వలికే వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. ఎస్సీ,ఎస్టీల ప్రాణాలంటే ఎందుకు అంత చులకన్నారు. ఎస్సీ,ఎస్టీల పై దాడులను అరికట్టాలి,స్నేహ లత,నల్లపు రమ్య,టేకు లక్ష్మి,ప్రీతి నాయక్ ఇలా సబ్బండ కులాల అడ బిడ్డలను ఎంత మందిని పోగొట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందారు.మా గోడు,ఉసురు తగలక పోదాని శపించారు.

రమాదేవి కిరాతకంగా హత్య చేసిన జాఫర్ వలిని పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వార విచారణ జరిపి ఉరి తీయాలని,కేసు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని,ఈ వైసీపీ ప్రభుత్వం మృతురాలు కుటుంబానికి 50లక్షల ఎక్షగ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో పోరాడి సాధించు కుంటామన్నారు. రమాదేవి నీ కిరాతకంగా హత్య చేసిన జాపర్ వలిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శిక్ష వేయాలని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 15:47

ఎన్టీఆర్ జిల్లా తెదేపా నేతపైన వైసీపీ నాయకులు దాడి..
గంపలగూడెం మం కనుమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పైన వైసీపీ నాయకుల దాడి.. అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్న నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి రేగళ్ళ బాలకోటిరెడ్డి మరియు ముక్కాల శశి కుమార్ రెడ్డి పై వైసీపీ నాయకులు దాడి.. బాలకోటి రెడ్డి మరియు ముక్కాల శశి కుమార్ రెడ్డి పైన అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఇనప రాడ్ తో దాడి చేసినట్టుగా సమాచారం.. మొన్న ఆదివారం సోషల్ మీడియా వేదికగా కనుమూరు గ్రామంలో జరుగుతున్న ఇసుక మాఫియా గురించి పోస్ట్ పెట్టాడు.. ఈ రోజు ఉదయం సోషల్ మీడియాలో పోస్టు ఎందుకు పెట్టావు అని అడగగా దీనితో గ్రామంలో వైసీపీ తెదేపా వర్గాల మధ్య ఒక్కసారిగా గొడవ వాతావరణం ఏర్పడింది.. సోషల్ మీడియాలో ఇసుక గురించి పోస్ట్ పెట్టినందుకు నా పైన దాడి చేశారు.. ఈ దాడిలో 30 మంది వైసీపీ నాయకులు ముకుమూడి దాడి చేశారు.. గాయపడిన బాలకోటిరెడ్డిని తిరువూ ఏరియా హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలింపు.. హాస్పటల్ లో చికిత్స పొందుతున్న బాలకోటిరెడ్డిని పరామర్శించిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మరియు గంపలగూడెం మండలం తెదేపా నేతలు..

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 15:06

CPI Narayana: టీడీపీ, జనసేనతో కలిసే పోటీచేస్తాం..

CPI Narayana: రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలతో కలిసి సీపీఐ ఎన్నికల బరిలో నిలవబోతుందని ప్రకటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన..

రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కలవడం అంటూ జరిగితే మా ఓట్లు ఇవ్వడం మాత్రమే కాదు.. మాకు సీట్లు కూడా కావాలని స్పష్టం చేశారు.. ఇక, వీరుడు, సూరుడు అనుకున్న జగన్.. కేంద్రం దగ్గర మొకరిల్లుతున్నాడని విమర్శలు గుప్పించారు.. పోలవరం విషయంలో వాళ్ల నాన్న వైఎస్ లో ఉన్న పోరాట స్ఫూర్తి జగన్ లో కనిపించడం లేదన్న ఆయన.. వాళ్ల నాన్న సిద్ధాంతాలకు కూడా పంగ నామాలు పెట్టిన వ్యక్తి గా జగన్ మిగిలిపోయేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు..

రాష్ట్ర ప్రయోజనాల కోసం సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం సీఎం వైఎస్‌ జగన్ కు లేదని విమర్శించారు నారాయణ.. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి.. పోలవరం ఎత్తు పెంచడంతో పాటు నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం విషయంలో విభజన హామీల హక్కులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిపోయిందన్నారు.. మీకు, పోరాడటానికి భయంగా ఉంటే అఖిల పక్షానికి ఢిల్లీ తీసుకువెళ్ళండి, విభజన హామీలు మేం సాధించుకు వస్తాం అంటూఏ ప్రకటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..