చిట్యాల ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా
•భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మండల కమిటీ అధ్యక్షులు పొలిమేర రామ్ కుమార్ ఆధ్వర్యంలో
•తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నకిరేకల్ నియోజకవర్గo చిట్యాల మండలంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మండల కమిటీ అధ్యక్షులు పొలిమేర రామ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని చిట్యాల ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు బిజెపి మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు చికిలo మెట్ల అశోక్ గార్లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత 5,6 నెలలుగా పెండింగ్ లో ఉన్న పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని, జీవో నెంబర్ 60 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రూ 16,500/- అదేవిధంగా కారోబార్, బిల్ కలెక్టర్ లకు రూ 19,500/- కంప్యూటర్ ఆపరేటర్లకు రూ 22,750/- వేతనాలు చెల్లించాలని, యాక్ట్ 2/94 ను వెంటనే రద్దుచేసి పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్ లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని వారిని వెంటనే అసిస్టెంట్ కార్యదర్శులుగా నియమించి ప్రభుత్వ గ్రాండ్ ద్వారా వేతనాలు చెల్లించాలని, జీవో నెంబర్ 51నీ సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని,
మల్టీపర్పస్ విధానం ద్వారా నియమించబడిన కార్మికులు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే వారి కుటుంబంలో వారసులకు ఉద్యోగాలు కల్పించాలని, అదనంగా నియమించిన గ్రామపంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రస్తుతం చెల్లిస్తున్న 8500 రూపాయల వేతనం అమలు చేయాలని, పి.ఎఫ్, ఈఎస్ఐ ప్రమాద భీమా సౌకర్యాలు అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో ప్రకటించిన ఎస్క్ డే పేరిట రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, పంచాయతీ కార్మికులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు, స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణాన్ని ఐదు లక్షల 50 వేలు ఆర్థిక సహాయం చేయాలని, దళిత బంధు పథకాన్ని పంచాయతీ సిబ్బందికి ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల ఎస్సీ మోర్చా కమిటీ డిమాండ్ చేస్తా ఉందన్నారు. పంచాయతీ కార్మికుల పక్షాన ఎల్లవేళలా బిజెపి అండగా ఉంటుందని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, బిజెపి మండల ఉపాధ్యక్షులు పీకే వెంకన్న, సీనియర్ నాయకులు పాపాని వాసుదేవ్, బూత్ కమిటీ అధ్యక్షులు సిద్ధ గాని అశోక్, పామనగుండ్ల వెంకన్న, ఎస్ శ్రవణ్ కుమార్ చారి, జి నరేంద్ర చారి, ఉయ్యాల లింగస్వామి, వరికుప్పల రాములు, పి వెంకన్న, ఈదుల పవన్, రాము, మల్లేష్, అనిల్, మహేష్, నరసింహ, శ్రిను తదితరులు పాల్గొన్నారు.
Mar 28 2023, 18:52