ప్రజా పోరాట యోధుల త్యాగం వెలకట్టలేనిది.. ధర్మ బిక్షం,సాంబశివుని పోరాట స్పూర్తి ని కొనసాగిస్తాం..
•పందుల సైదులు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు
కామ్రేడ్ కొనపురి సాంబశివుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మ బిక్షం గార్ల జీవిత పోరాటం ఆదర్శనీయమైనదని,వారు గొప్ప ప్రజా పోరాట యోధులని వారి త్యాగం వెలకట్టలేనిదని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు.
కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం,సాంబశివుని వర్థంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక, బిసి విద్యార్థి సంఘం బీసీ యువజన సంఘం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పందుల సైదులు, ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఇరువురు కూడా భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, పోరాడిన వారే అన్నారు.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న గొప్ప యోధుడు ధర్మభిక్షం అన్నారు.'దున్నేవాడికే భూమి'తోపాటు'గీసే వానికే చెట్టు' నినాదమిచ్చి గీత కార్మికుల సంక్షేమానికి కృషిచేసిన వారిలో మొదటివారు ధర్మబిక్షమన్నారు.కొనపురి సాంబశివుడు అజ్ఞాతంలో ఉన్నా ప్రజాక్షేత్రంలో ఉన్నా నిరంతరం పేద ప్రజల జీవితాల మార్పుల కోసమే పరితపించాడని వారన్నారు.గొప్ప పోరాట పటిమ కలిగిన సాంబశివుని ప్రభుత్వం కాపాడుకోలేకపోయిందన్నారు. నేటికి సాంబశివుని హత్య చేసిన హంతకులు ఎవరో తేల్చలేక పోయిందన్నారు.సమాజంలో బడుగు బలహీన వర్గాల నాయకుల పట్ల వివక్షత కొనసాగుతుందన్నారు.సాంబశివుని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని డిమాండ్ చేశారు.
మూడుసార్లు శాసనసభ్యుడిగా రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు వారు అందించిన సేవలు వెలకట్టలేనంతవి అన్నారు.బొమ్మగాని ధర్మం బిక్షం గారి పేరు సూర్యాపేట జిల్లాకు పెట్టాలని,వారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పొందుపరచాలని, ట్యాంక్ బండి పై వారి విగ్రహాన్ని ప్రతిష్టించాలని, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నీరా ప్రాజెక్టుకు ధర్మభిక్షం గారి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా నాయకులు నర్సింగ్ మురళీధర్ గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగం నరేష్ గౌడ్, చెనగోని నగేష్ గౌడ్, విజయ్, రాము గౌడ్ ,మహేష్ గౌడ్, హరికృష్ణ గౌడ్,అశోక్ గౌడ్, వెంకన్న గౌడ్ ,నరసింహ, లక్ష్మీనారాయణ ,విజయ్ ,తదితరులు పాల్గొన్నారు.
Mar 26 2023, 20:04