హారీశ్‌ శంకర్‌ గంటన్నర బతిమలాడారు!

పవన్‌కల్యాణ్‌ సినిమాలో తనను విలన్‌గా నటించమని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కోరారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆ పాత్ర కోసం తనని గంటన్నరసేపు బతిమలాడినా అంగీకరించలేదని ఆయన అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘మేమ్‌ ఫేమస్‌’ టీజర్‌ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘మద్యపానం, ధూమపానం, పబ్‌లకు తిరగడం, డ్రగ్స్‌ తీసుకోవడం, షికార్లు చేయడం, అమ్మాయి వెంట పడడం లాంటివి చేస్తే ఎవరూ ఫేమస్‌ కారు. ఎదగాలంటే కష్టపడాలి. నేను ఎదగాడానికి ఎన్నో చేశా. పాలు అమ్మిన, పూలమ్మిన.. కాలేజీలు పెట్టా, వాటి ద్వారి టాప్‌ డాక్టర్లను, సైంటిస్టులను, ఇంజనీర్‌లను తయారు చేశాను.. అదీ ఫేమస్‌ కావడం అంటే. యువత కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు.

ఒకప్పటితో పోల్చితే నేటితరం యువతకు అవకాశాలు ఎక్కువ ప్లానింగ్‌ పర్ఫెక్ట్‌గా ఉండాలంటే. ఎవరికీ సక్సెస్‌కు షార్ట్‌ కట్‌ లేదు. ఈ సినిమా టీజర్‌ బావుంది. సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా ఈ హీరోతో నేనొక సినిమా చేస్తా. ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణ యాసలో ఏడాదికి నాలుగు చిత్రాలు నిర్మిస్తా. అంతా తెలంగాణా మోడల్‌లోనే! ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో సినిమా తీస్తున్న దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మా ఇంటికి వచ్చాడు. ఆ సినిమాలో విలన్‌గా చేయమని గంటన్నర బతిమిలాడాడు. నేను చేయనని చెప్పాను’’ అని అన్నారు..

ప్రజా పోరాట యోధుల త్యాగం వెలకట్టలేనిది.. ధర్మ బిక్షం,సాంబశివుని పోరాట స్పూర్తి ని కొనసాగిస్తాం..

•పందుల సైదులు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు

కామ్రేడ్ కొనపురి సాంబశివుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మ బిక్షం గార్ల జీవిత పోరాటం ఆదర్శనీయమైనదని,వారు గొప్ప ప్రజా పోరాట యోధులని వారి త్యాగం వెలకట్టలేనిదని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు.

కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం,సాంబశివుని వర్థంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక, బిసి విద్యార్థి సంఘం బీసీ యువజన సంఘం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పందుల సైదులు, ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఇరువురు కూడా భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, పోరాడిన వారే అన్నారు.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న గొప్ప యోధుడు ధర్మభిక్షం అన్నారు.'దున్నేవాడికే భూమి'తోపాటు'గీసే వానికే చెట్టు' నినాదమిచ్చి గీత కార్మికుల సంక్షేమానికి కృషిచేసిన వారిలో మొదటివారు ధర్మబిక్షమన్నారు.కొనపురి సాంబశివుడు అజ్ఞాతంలో ఉన్నా ప్రజాక్షేత్రంలో ఉన్నా నిరంతరం పేద ప్రజల జీవితాల మార్పుల కోసమే పరితపించాడని వారన్నారు.గొప్ప పోరాట పటిమ కలిగిన సాంబశివుని ప్రభుత్వం కాపాడుకోలేకపోయిందన్నారు. నేటికి సాంబశివుని హత్య చేసిన హంతకులు ఎవరో తేల్చలేక పోయిందన్నారు.సమాజంలో బడుగు బలహీన వర్గాల నాయకుల పట్ల వివక్షత కొనసాగుతుందన్నారు.సాంబశివుని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని డిమాండ్ చేశారు.

మూడుసార్లు శాసనసభ్యుడిగా రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు వారు అందించిన సేవలు వెలకట్టలేనంతవి అన్నారు.బొమ్మగాని ధర్మం బిక్షం గారి పేరు సూర్యాపేట జిల్లాకు పెట్టాలని,వారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పొందుపరచాలని, ట్యాంక్ బండి పై వారి విగ్రహాన్ని ప్రతిష్టించాలని, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నీరా ప్రాజెక్టుకు ధర్మభిక్షం గారి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా నాయకులు నర్సింగ్ మురళీధర్ గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగం నరేష్ గౌడ్, చెనగోని నగేష్ గౌడ్, విజయ్, రాము గౌడ్ ,మహేష్ గౌడ్, హరికృష్ణ గౌడ్,అశోక్ గౌడ్, వెంకన్న గౌడ్ ,నరసింహ, లక్ష్మీనారాయణ ,విజయ్ ,తదితరులు పాల్గొన్నారు.

Covid-19: దేశంలో కరోనా విజృంభణ.. 5 నెలల గరిష్టానికి రోజువారీ కేసులు..

Covid-19: దేశంలో కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేసుల సంఖ్య కేవలం వందల్లోనే ఉండేది..

కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తాజాగా 5 నెలల గరిష్టానికి రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,890 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళలో ముగ్గురు మరణించారు..

చివరిసారిగా గతేడాది ఒకే రోజు 2,208 కేసులు నమోదు కాగా.. దాదాపుగా 149 రోజుల తర్వాత 1,890 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,433గా ఉంది. డైలీ పాజిటివిటీ రేట్ 1.56 శాతంగా నమోదు అయింది. వీక్లీ పాజిటివిటీ రేట్ 1.29 శాతంగా ఉంది. దేశంలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.47 కోట్లు(4,47,04,147)గా కేసులు నమోదు అయ్యాయి. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య ,41,63,883కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ ద్వారా 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించింది..

MLA Undavalli Sridevi Pressmeet Live: ఉండవల్లి శ్రీదేవి సంచలన ప్రెస్ మీట్..

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన కామెంట్లు చేశారు. గత మూడు రోజులు గా వైసీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారు..నేను అజ్ఞాతం లో ఉన్నానని అంటున్నారు..

మొన్న డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ లాగా నన్ను చంపుతారు అని అజ్ఞాతం లోకి వెళ్ళాను. వాళ్ళ దందాలకు నేను అడ్డు వస్తున్నాను అని ఇలా చేస్తున్నారు అన్నారు ఉండవల్లి శ్రీదేవి.

నేను ఓటు వేసే టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా? లేదా సీసీ కెమెరా పెట్టారా?నేను ఓటు వేసే ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు. మిగతా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు అనుమానం పడట్లేదు. నన్ను ఎందుకు వేధిస్తున్నారు? నన్ను పిచ్చి కుక్క లాగా నిందవేసి బయటకు పంపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు..

సిట్ విచారణకు బండి సంజయ్ లీగల్ టీం

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో సిట్ నోటీసులకు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా సిట్ ముందు హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. తనకు సిట్ పై నమ్మకం లేదని బండి సంజయ్.. పేపర్ లీక్ కేసును తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

తనకు వచ్చిన సమాచారాన్ని బహిర్గతం చేయనని చెప్పారు. అసలు విషయంపై విచారణ జరపకుండా సిట్ అధికారులు తమకు నోటీసులిచ్చారని అన్నారు. మార్చి 26న సిట్ విచారణకు బండి సంజయ్ లీగల్ టీం హాజరుకానుంది.

మరో వైపు పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితులను రెండోసారి కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచింది. ఏ -1 ప్రవీణ్, ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్ ను కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. సిట్ అధికారులు మూడు రోజుల పాటు నలుగురు నిందితులను విచారించనున్నారు.

పాలు లేకుండా చాయ్..

•ఈ చాయ్‌‌ని పాలు పోయకుండా తయారు

•కానీ అక్షరాలా రూ.1000కి ఒక కప్పు చాయ్ గురించి విన్నారా?

హైదరాబాద్​ సిటీ.. చాయ్​కి ఎంతో ఫేమస్. గల్లీగల్లీకో టీ స్టాల్ ఉంటుంది. ఇరానీ చాయ్ తో పాటు ఎన్నో రకాల టీలను సిటీలో రుచి చూడొచ్చు. మాములుగా అయితే రూ.10 నుంచి రూ. 20కి సింగిల్ టీ దొరుకుతుంది. కానీ అక్షరాలా రూ.1000కి ఒక కప్పు చాయ్ గురించి విన్నారా?

ఈ టీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందంటున్నారు తయారీదారులు. సిటీలో రెండు చోట్ల మాత్రమే ఈ అరుదైన కాస్ట్​లీ చాయ్​ అందుబాటులో ఉంది. కేఫ్ నిలోఫర్ బ్రాంచుల్లో మాత్రమే.. సిటీలోని బంజారాహిల్స్, హిమాయత్​నగర్‌‌‌‌ లోని కేఫ్ నిలోఫర్ ప్రీమియం లాంజ్‌‌లలో ఈ కాస్ట్​లీ చాయ్​ను టేస్ట్ చేయొచ్చు. ఈ ప్రత్యేకమైన చాయ్​ని రూ.వెయ్యికి ఒక కప్పు చొప్పున అమ్ముతున్నారు.

అంత రేటున్నా జనాలు కొని తాగుతున్నారంటే టేస్ట్‌‌ ఏ లెవెల్‌‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2021 నుంచి సిటీలోని ఈ రెండు బ్రాంచుల్లో ఈ చాయ్​ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో వాడే టీ పౌడర్‌‌‌‌లోనే ఉంది అసలు కథంతా. ఈ టీ పొడి ధరే కిలోకి లక్షన్నర. అది కూడా అంత ఈజీగా దొరకదు. వేలంలో పాల్గొని దక్కించుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఏడాది ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

మాస్కులు, ముందు జాగ్రత్తలతో రక్ష

•వారం రోజుల్లో 18 మందికి కొవిడ్‌

•చాపకింద నీరులా మళ్లీ కరోనా విస్తరిస్తోంది

వారం రోజుల వ్యవధిలో ర్యాండమ్‌ పరీక్షల్లోనే 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కలగడం కలవరం కలిగిస్తున్నది. కొత్తరకం వైరస్‌తో కరోనా వేగంగా విస్తరిస్తోందని, దేశవ్యాప్తంగా కూడా ఆక్టివ్‌ కేసులు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో కూడా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మార్చి నెలలో గడిచిన వారం రోజుల్లో 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. జిల్లా ఆసుపత్రికి వచ్చినవారికి ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో తొమ్మిది యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. రెండు యాక్టివ్‌ కేసులు కట్టరాంపూర్‌లో, మరో రెండు సప్తగిరికాలనీలో, తిమ్మాపూర్‌లో రెండు, మానకొండూర్‌లో రెండు, చామనపల్లిలో ఒక కరోనా కేసు నమోదైంది. కరోనా సోకినవారు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. వీరందరికి వారం రోజుల క్వారంటైన్‌ను అధికారులు సూచించారు.

జిల్లాలో 11,19,947 మంది 18 ఏళ్లు నిండిన వారు ఉండగా, ఎనిమిది లక్షల మందికిపైగా రెండు డోసుల వ్యాక్సినేషన్లు తీసుకున్నారు. పలువురు పిల్లలకు కూడా వ్యాక్సినేషన్‌ చేశారు. బూస్టర్‌ డోసు కూడా కొందరు తీసుకోగా కరోనా ప్రభావం తగ్గిపోవడం, మూడో వేవ్‌లో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అందుకే బూస్టర్‌ డోస్‌కు చాలామంది ముందుకు రాలేదు. ప్రస్తుతం మళ్లీ కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుండడంతో ఒక్కసారిగా ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు ఫ్లూ విస్తరిస్తుండడంతో మాస్కులు ధరించడమే మంచిదనే అభిప్రాయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ ప్రచారం చేస్తున్నది. మాస్కులు ధరించి, చేతులు శుభ్రం చేసుకోవడం, కనీస జాగ్రత్తలను పాటించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే కొందరు మాస్కులు ధరిస్తున్నారు.

విజృంభిస్తున్న ఫ్లూ..

జిల్లాలో రోజురోజుకు ఫ్లూ విస్తరిస్తోంది. వందలాది మంది జ్వరపీడితులుగా మారుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలపై ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్నది. పిల్లలు, పెద్దలు అందరికి 102, 103 డిగ్రీల జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భరించలేని బాధతో రోజురోజుకు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. జిల్లా కేంద్ర ఆసుపత్రికి ప్రతిరోజు 700 నుంచి సుమారు వెయ్యి మంది వరకు ఔట్‌ పేషెంట్లు వస్తున్నారు. అందులో ఫ్లూ బాధితులే 50 శాతానికి మించి ఉంటున్నారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో రోజుకు 100 నుంచి 150 మంది ఫ్లూ బాధితులు ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వెయ్యి నుంచి రెండు వేల మంది ఔట్‌ పేషెంట్లుగా, సుమారు వెయ్యి మంది ఇన్‌ పేషెంట్లుగా చేరుతున్నారని తెలుస్తున్నది. ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకొని మాస్కులు ధరించాలని, జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాలో తిరగక పోవడం, భౌతిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే తగు జాగ్రత్తలతో ఆహారం తీసుకుంటే ఫ్లూ, కరోనా రాకుండా ఉంటుందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. శానిటైజర్లను వినియోగించాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తలు పాటించాలి...

- డాక్టర్‌ రఘురామన్‌, సీనియర్‌ ఫిజిషియన్‌

ఫ్లూతో బాధపడేవారు కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలి. శానిటైజర్‌తో చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. గుంపులుగా ఉన్న చోటకు వెళ్లకూడదు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. వారిలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారు లేదా, ఫ్లూతో బాధపడుతున్నవారు ఉంటే క్వారంటైన్‌లో ఉంచాలి. మందులు వాడాలి. సొంత వైద్యం చేసుకోవద్దు. డాక్టర్‌ను సంప్రదించాలి. వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు జాగ్రత్తగా ఉండడం మంచిది.

ISRO LVM3-M3 Operation Success: ఇస్రో LVM3-M3 రెండో ప్రయోగం కూడా సక్సెస్, 36 ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్‌ వెబ్‌ తో గతంలో ఒప్పందం చేసుకుంది. 2022 అక్టోబరు 23న 36 ఉపగ్రహాలు, ఈరోజు మరో 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో మరోసారి సత్తా చాటింది. LVM3-M3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 36 ఉపగ్రహాల్లో 16 ఇప్పటికే వాటి వాటి కక్ష్యల్లో కుదురుకున్నాయి. మిగతా 20 ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయి భూమిపై ఉన్న ఎర్త్ స్టేషన్లకు సిగ్నల్స్ పంపిస్తాయని తెలిపారు అధికారులు. విజిబిల్ ఏరియాలో ఆ శాటిలైట్స్ సెపరేషన్ జరగదని చెప్పారు. రాకెట్ ప్రయోగం విజయవంతమైందని, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్.  ఈ ప్రయోగం ద్వారా UKకు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేట్‌ Ltd, భారత్‌కు చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్తంగా వన్‌వెబ్‌ ఇండియా–2 పేరుతో రూపొందించిన 5,805కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450Kms ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 87.4° వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
నేడు తెలంగాణ సరిహద్దు గ్రామానికి అమిత్ షా

హైదరాబాద్‌: తెలంగాణ సరిహద్దుల్లోని కర్ణాటకలోని ఓ గ్రామంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదివారం పర్యటించనున్నారు. హైదరాబాద్‌ స్టేట్‌లో భాగంగా ఉన్న ఈ ప్రాంతంలోని గోర్ట గ్రామంలో జరిగిన విముక్త పోరాటంలో 200 మంది గ్రామస్తులు మరణించారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న 75వ హైదరాబాద్‌ స్టేట్‌ విలీన ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొంటారు. ఈ సందర్భంగా గోర్ట గ్రామంలో అమరవీరుల స్మారక చిహ్నం, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాలను అమిత్‌ షా ఆవిష్కరిస్తారు.

తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్ కు శనివారం రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో సంజయ్‌ స్వాగతం పలికారు.

Minister Suresh Safe: మంత్రి సురేష్ కి తప్పిన ప్రమాదం..

విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమవ్వగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది..

ఈ ఘటనతో మంత్రి సురేష్ తో పాటు అక్కడే వున్న ఇతర మంత్రులు షాక్ అయ్యారు. G20 సదస్సుల్లో భాగంగా విశాఖలో మారథాన్, సాహసక్రీడలు జరుగుతున్నాయి.ఆదివారం కావడంతో ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా G20 మారథాన్ ప్రారంభం అయింది. మారథాన్ ప్రారంభించారు మంత్రులు ఆదిమూలపు సురేష్,విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్..

ఉదయం మారథాన్ ప్రారంభించిన సురేష్….నిర్వాహకులు ఆహ్వానం మేరకు పారా మోటారింగ్ రైడ్ కు బయలు దేరారు. ఈ ఈవెంట్స్ ను మంత్రి విడదల రజనీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే, పారా మోటరింగ్ ఫస్ట్ రైడ్ కు వెళ్ళేందుకు ఉత్సాహం చూపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అయితే, విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో కుదుపులకు గురైంది. మంత్రి క్షేమంగా ఉండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది..