సీడబ్ల్యూసీ గైడ్‌లైన్స్ మేరకే నిర్మాణం: పోలవరం ఎత్తుపై ఏపీ అసెంబ్లీలో జగన్

అమరావతి: సీడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు డ్యామ్ ఎత్తు ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై వస్తున్న అపోహలను ఎవరూ నమ్మొద్దని సీఎం జగన్ కోరారు..

ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు.

45.7 మీటర్లు ఎత్తు వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ సిఫారసు మేరకు తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు కడతామని సీఎం జగన్ చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయమై తాను ఇటీవల ప్రధానిని కలిసినట్టుగా ఆయన వివరించారు.

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు..

హైదరాబాద్‌: తెలంగాణ(Telangana) లో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Meteorological Centre) వెల్లడించింది..

ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 25, 26, 27 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

మరోవైపు పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదై.. సాయంత్రం సమయంలో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాధారణం కంటే 1 డిగ్రీ మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించారు..

Polavaram: 'పోలవరం' ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని తేల్చి చెప్పింది..

పార్లమెంటులో వైకాపా ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని స్పష్టం చేశారు. తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికే పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు.

అయితే, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైందని వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్లు తెలిపారు. సహాయ, పునరావాసం మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉన్నా... అందులో కూడా జాప్యం జరిగిందని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా వివరించారు..

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష

దిల్లీ: ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని సూరత్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది..

ఆ వెంటనే ఆయనకు బెయిల్‌ కూడా మంజూరు చేసింది. అలాగే ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.

ఈ మేరకు శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది. తీర్పు వెలువరించిన సమయంలో రాహుల్‌ న్యాయస్థానంలోనే ఉన్నారు..

'మోదీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు' అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ (Rahul Gandhi) వ్యాఖ్యానించారని గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు రాహుల్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసింది.

అలా అనలేదని న్యాయస్థానానికి రాహుల్‌ తన వాదనను వినిపించారు. కానీ, కోర్టు మాత్రం ఐపీసీ సెక్షన్‌ 499, 500 ప్రకారం ఆయనను దోషిగా తేల్చింది. వెంటనే రాహుల్‌ అభ్యర్థన మేరకు బెయిల్‌ కూడా మంజూరు చేసింది..

కోర్టు తీర్పు అనంతరం రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. మహాత్మా గాంధీ చేసిన ఓ వ్యాఖ్యను కోర్టు తీర్పు తర్వాత ట్వీట్‌ చేశారు. ''సత్యం, అహింసపైనే నా ధర్మం ఆధారపడి ఉంది. సత్యం నా భగవంతుడు. ఆయన్ని చేరుకోవడానికి కావాల్సిన సాధనమే అహింస'' అని పేర్కొన్నారు. ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ.. ''నా సోదరుడు (రాహుల్‌ గాంధీ) ఎప్పుడూ భయపడలేదు. భవిష్యత్‌లో భయపడడు కూడా..'' అని అన్నారు.

తీన్మార్‌ మల్లన్నకు రిమాండ్‌..

ఆచూకీ చెప్పాలని పోలీస్‌ స్టేషన్‌కు భార్య..

హైదరాబాద్‌: మేడిపల్లి పీఎస్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లపై దాడి చేశారన్న కేసులో మంగళవారం రాత్రి అరెస్టు చేసిన చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నతోపాటు మరో నలుగురిని పోలీసులు బుధవారం ఉదయం హయత్‌నగర్‌ మేజి్రస్టేట్‌ ముందు హాజరు పర్చారు. మేజిస్ట్రేట్‌ మల్లన్నతోపాటు నలుగురు వ్యక్తులకు 14 రోజులు రిమాండ్‌ విధించడంతో వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. రాత్రి అరెస్టు చేసిన మల్లన్నను అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకుచ్చారు. కాగా, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే వరకు పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం సాయంత్రం 5 గంటలకు పీర్జాదిగూడలో చైన్‌ స్నాచింగ్‌ నేరాలను నిరోధించేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కానిస్టేబుళ్ల వద్దకు వచ్చి ఎవరు మీరు! అని ప్రశ్నించారు. తాము పోలీసులమని చెబుతున్నా.. వినకుండా వారిని కొట్టి, లాఠీలను లాక్కొని బలవంతంగా సమీపంలో ఉన్న క్యూ న్యూస్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆఫీసు ముందు తిరుగుతున్నారని, దీంతో అనుమానం వచ్చి తీసుకొచ్చామని కానిస్టేబుళ్ల గురించి మల్లన్నకు తెలిపారు. వారిని తన గదిలోకి తీసుకురావాలని మల్లన్న చెప్పడంతో లోపలికి తీసుకెళ్లి కానిస్టేబుళ్ల సెల్‌ఫోన్లు లాక్కొని, రెచ్చగొట్టేలా మాట్లాడుతూ.. కర్రలతో దాడి చేశారు.

ఈ విషయం తెలుసుకున్న రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను పంపించారు. సీనియర్‌ పోలీసు అధికారులు కూడా క్యూ న్యూస్‌ ఆఫీసుకు చేరుకొని నిర్బంధంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను రక్షించారు. వారిని నిర్బంధించిన తీన్మార్‌ మల్లన్నతో పాటు క్యూ న్యూస్‌ ఎడిటర్‌ బండారు రవీందర్, డ్రైవర్‌ ఉప్పాల నిఖిల్, ఆఫీసు బాయ్‌ సిర్రా సుధాకర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చింత సందీప్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవటంతో పాటు అక్రమంగా బంధించడం, కర్రలతో దాడి చేయడం వంటి నేరంపై ఆ ఐదుగురిపై ఐపీసీ సెక్షన్‌ 363, 342, 395, 332, 307 ఆర్‌/డబ్ల్యూ 34, సెక్షన్‌ 7(1) కింద కేసులు నమోదు చేశారు.

నా భర్త ఆచూకీ చెప్పండి..

ఇదిలా ఉండగా తన భర్త ఆచూకీ చెప్పాలని తీన్మార్‌ మల్లన్న భార్య మమత మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు, లాయర్లతో కలసి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ వెళ్లిన ఆమె, తన భర్తను ఎందుకు అరెస్ట్‌చేశారని, ఎక్కడికి తీసుకు వెళ్లారని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఇవ్వాలని కోరారు. కాగా, పోలీసులు మల్లన్నతో ఫోన్‌లో మాట్లాడిస్తామని ఆమెకు హామీ ఇచి్చనట్లు సమాచారం..

Tamilisai: కాంగ్రెస్ నేతల బృందంతో గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: కాంగ్రెస్ నేతల బృందంతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

'టీఎస్పీఎస్సీ (TSPSC) ఘటన చాలా పెద్దది.. సీరియస్‌గా తీసుకుంటాం' అని గవర్నర్ తమిళిసై స్పష్టంగా చెప్పారు. ప్రతిరోజూ ప్రభుత్వం, ప్రతిపక్ష నేతల కామెంట్స్ చూస్తున్నానని, రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కామెంట్స్‌ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నా, బాగా మాట్లాడుతారని తమిళిసై తెలిపారు.

TSPSC అంశంపై యాక్షన్ తీసుకోవాలని, విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని గవర్నర్‌ను కోరినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కోర్టులో కేసు వేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి తెలిపారు..

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వల్ల (TSPSC Paper Leak) లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసైని తెలంగాణ కాంగ్రెస్ నేతలు (Telangana Congress Leaders) కలిశారు.

అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. పేపర్ లీక్‌లో మంత్రి కేటీఆర్ (Minister KTR) శాఖ ఉద్యోగులదే కీలకపాత్రని ఆరోపించారు. కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్‌కు అప్లికేషన్ పెట్టామన్నారు. వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చామన్నారు..

ఇప్పుడున్న టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అందరినీ సస్పెండ్ చేసి.. పారదర్శక విచారణ చేస్తారని భావించామని.. కానీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసే విశేష అధికారం గవర్నర్‌కు ఉందన్నారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారని విమర్శించారు..

తీన్మార్ మల్లన్న నిర్బంధం అక్రమం..

•నిర్బంధాలతో ప్రశ్నించే గొంతుకలను ఆపగలేరు..!

•విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు

తెలంగాణ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల ముందు ఉంచుతున్న తీన్మార్ మల్లన్న ,సుదర్శన్ గౌడ్ ల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు పి.వై.ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్,టిపివైఎస్ జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం,టీఎస్.యు జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి అన్నారు.

బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం చౌరస్తాలో ప్రశ్నించే గొంతుకల అరెస్టును నిరసిస్తూ విద్యార్థి యువజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రశ్నించే గొంతుకలే టార్గెట్ గా లాఠిలను నిర్బంధాలను ప్రయోగిస్తుందన్నారు. మందకృష్ణ మాదిగ కోదండరాం, విమలక్క,డాక్టర్ చెరుకు సుధాకర్, వంటి ప్రజా గొంతుకుల ఇండ్లపై దాడులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిందన్నారు.

గత రెండు రోజుల క్రితం తెరాస పార్టీకి సంబంధించిన నాయకులు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేసి నానా బీభత్సం సృష్టించి,సిబ్బంది పై హత్యా ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. ఆరోజు దాడి చేయడానికి వచ్చిన వారే ఈరోజు తీన్మార్ మల్లన్న పై కేసు పెట్టి మమ్ములనే హత్య చేయడానికి ప్రయత్నం చేసినరని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.తీన్మార్ మల్లన్న పై అనేకమార్లు అధికార పార్టీ నాయకులు అనేక చోట్ల దాడులు చేశారన్నారు.అనేకసార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చట్టం కెసిఆర్ కు చుట్టంగా మారిందన్నారు.బారాస పార్టీ దాడులతో నిర్బంధాలతో తన నిరంకుశ అధికారాన్ని పదిలపరుచుకోవడానికి అనేక కుట్రలకు తెరలేపుతుందన్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన తప్పును ఎత్తిచూపడం గాని తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల పక్షాన నిలబడడంగాని ఈ ప్రభుత్వానికి గిట్ట లేదన్నారు. కెసిఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీని నిరంతరాయంగా తీన్మార్ మల్లన్న ప్రజలకు అందించడమే ఈ ప్రభుత్వానికి గిట్ట లేదన్నారు.ఒక వేళ తీన్మార్ మల్లన్న విధానం సరిగ్గా లేకుంటే ప్రభుత్వానికి నచ్చకుంటే న్యాయస్థానాన్ని ప్రభుత్వం గాని ఆ పార్టీ గాని ఆశ్రయించవలసి ఉండే. కానీ ప్రశ్నించే గొంతుకలపై భౌతిక దాడులు చేసి గొంతు నొక్కాలనుకోవడం ప్రభుత్వం యొక్క అవివేకమైన చర్య అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ సహనాన్ని కోల్పోయి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వారన్నారు. ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గాలను మానుకోవాలసిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. తక్షణమే తీన్మార్ మల్లన్న ను వారి సిబ్బందిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా కార్యదర్శి చారి, టి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా సంపత్,కత్తుల చంధన్, ఉదయ్, సాయి, శ్రీకాంత్, సందీప్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఉగాది సంబరాలు

అమరావతి: తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసంలోని

వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు జరుగుతున్నాయి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోని గోశాలలో ఉగాది సంబరాలు జరుపుకున్నారు.

సీఎం నివాసంలోని గోశాలలో తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా

సెట్టింగ్ లు ఏర్పాటు చేశారు.

తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారు. పంచాంగ శ్రవణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

హైదరాబాద్‌: డీజీపీ అంజనీకుమార్‌కి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ రాశారు. పలు ఫోన్‌ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ లేఖలో పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని రాజాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తనకు పాకిస్తాన్‌ నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు ట్విట్టర్‌ ద్వారా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

వాట్సాప్‌ ద్వారా పాకిస్థాన్‌ నుంచి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తన ఆచూకీ, కుటుంబ వివరాలు చెబుతూ... హైదరాబాద్‌లో ఉన్న యాక్టివ్‌ స్లీపర్‌ సెల్‌ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్‌ తెలిపారు.

ప్లస్‌ 923105017464 నెంబర్‌ ద్వారా బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు రాజాసింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

గోరుముద్దలో మరో పౌష్టికాహారం.. నేడు ప్రారంభించనున్న సీఎం జగన్‌

జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బలవర్థకమైన ఆహారానికి ఏటా రూ.1,910 కోట్లు

►మధ్యాహ్న భోజన పథకానికి గత సర్కారు సగటున రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఏటా రూ.1,824 కోట్లు వ్యయం చేస్తున్నారు.

తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచి్చస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది..