తీన్మార్ మల్లన్న నిర్బంధం అక్రమం..
•నిర్బంధాలతో ప్రశ్నించే గొంతుకలను ఆపగలేరు..!
•విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు
తెలంగాణ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల ముందు ఉంచుతున్న తీన్మార్ మల్లన్న ,సుదర్శన్ గౌడ్ ల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు పి.వై.ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్,టిపివైఎస్ జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం,టీఎస్.యు జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి అన్నారు.
బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం చౌరస్తాలో ప్రశ్నించే గొంతుకల అరెస్టును నిరసిస్తూ విద్యార్థి యువజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రశ్నించే గొంతుకలే టార్గెట్ గా లాఠిలను నిర్బంధాలను ప్రయోగిస్తుందన్నారు. మందకృష్ణ మాదిగ కోదండరాం, విమలక్క,డాక్టర్ చెరుకు సుధాకర్, వంటి ప్రజా గొంతుకుల ఇండ్లపై దాడులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిందన్నారు.
గత రెండు రోజుల క్రితం తెరాస పార్టీకి సంబంధించిన నాయకులు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేసి నానా బీభత్సం సృష్టించి,సిబ్బంది పై హత్యా ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. ఆరోజు దాడి చేయడానికి వచ్చిన వారే ఈరోజు తీన్మార్ మల్లన్న పై కేసు పెట్టి మమ్ములనే హత్య చేయడానికి ప్రయత్నం చేసినరని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.తీన్మార్ మల్లన్న పై అనేకమార్లు అధికార పార్టీ నాయకులు అనేక చోట్ల దాడులు చేశారన్నారు.అనేకసార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చట్టం కెసిఆర్ కు చుట్టంగా మారిందన్నారు.బారాస పార్టీ దాడులతో నిర్బంధాలతో తన నిరంకుశ అధికారాన్ని పదిలపరుచుకోవడానికి అనేక కుట్రలకు తెరలేపుతుందన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన తప్పును ఎత్తిచూపడం గాని తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల పక్షాన నిలబడడంగాని ఈ ప్రభుత్వానికి గిట్ట లేదన్నారు. కెసిఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీని నిరంతరాయంగా తీన్మార్ మల్లన్న ప్రజలకు అందించడమే ఈ ప్రభుత్వానికి గిట్ట లేదన్నారు.ఒక వేళ తీన్మార్ మల్లన్న విధానం సరిగ్గా లేకుంటే ప్రభుత్వానికి నచ్చకుంటే న్యాయస్థానాన్ని ప్రభుత్వం గాని ఆ పార్టీ గాని ఆశ్రయించవలసి ఉండే. కానీ ప్రశ్నించే గొంతుకలపై భౌతిక దాడులు చేసి గొంతు నొక్కాలనుకోవడం ప్రభుత్వం యొక్క అవివేకమైన చర్య అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ సహనాన్ని కోల్పోయి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వారన్నారు. ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గాలను మానుకోవాలసిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. తక్షణమే తీన్మార్ మల్లన్న ను వారి సిబ్బందిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా కార్యదర్శి చారి, టి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా సంపత్,కత్తుల చంధన్, ఉదయ్, సాయి, శ్రీకాంత్, సందీప్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Mar 23 2023, 19:19