స్త్రీ,పురుష సమానత్వం కై ఉద్యమిద్దాం...
అంతర్జాతీయ మహిళా పోరాట దినోత్సవం సభలో
POW రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి. అనసూయ
అంతర్జాతీయ మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఆధ్వర్యంలో జిల్లా నాయకురాలు కప్పల విజయ అధ్యక్షతన సభ జరిగింది.
ఈ సందర్భంగా POW రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి. అనసూయ మరియు హంస ఫౌండేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మి గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ శ్రామిక మహిళల సంఘటిత పోరాటాలకు, హక్కుల సాధనకు సంకేతంగా నిలుస్తూ మార్చి 8 స్ఫూర్తినిస్తున్నదని. నేడున్న సామాజిక, ఆర్థిక సంక్షోభిత పరిస్థితుల్లో మహిళలు అడుగడుగునా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, ప్రేమ పేరిట హంతక దాడులకు, పరువు హత్యలకు బలవుతున్నారని దుయ్యబట్టారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీ,దళిత మహిళలపై భూస్వామ్య, పెత్తందార్ల దోపిడీ, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని. పాలకులు అనుసరిస్తున్న దోపిడీ విధానాలన్నీ మహిళల జీవితాల్ని నిరంతరం అభద్రతలోకి నెట్టేస్తున్నాయని. హక్కుల్ని కాలరాస్తున్నాయని అన్నారు. సమాజంలో వేళ్ళూనుకొని వున్న పితృస్వామ్య భావజాలం, భూస్వామ్య సామ్రాజ్యవాద దోపిడీ విష సంస్కృతులు, మద్యం దోపిడీ - ఇవన్నీ కలగలిసి మహిళల జీవితాలని హింసాత్మకం చేస్తున్నాయని పేర్కొన్నారు. స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో, హుందాగా బ్రతకటం మహిళల హక్కు అని, అందుకోసం మహిళల్ని అడుగడుగునా అణచివేస్తూ, హక్కుల్ని నిరాకరిస్తున్న పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు సాగించాలని, సంఘటిత శ్రామికవర్గ పోరాటాల ఆవశ్యకతను ఎలుగెత్తి చాటిన మార్చి 8 స్ఫూర్తిని స్వీకరిద్దామని.
మద్యం, మత్తు పదార్థాలు, విష సంస్కృతి ప్రభావాలకు యువతను బలిచేస్తున్న నేరమయ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని మహిళల జీవితాల్ని విధ్వంసం చేస్తూ, శ్రామిక ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్న పాలకుల మద్యం విధానాన్ని ప్రతిఘటిద్దామని. మహిళలపై సాగుతున్న శ్రమదోపిడి, పితృస్వామ్య పీడన, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు.ఆధిపత్య పితృస్వామ్య వ్యవస్థను స్టీరికరిస్తున్న మనువాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని అన్నారు.
CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో మనుధర్మ శాస్రం పేరుతో తిరోగమన వాదాన్ని ప్రజలపై బీజేపీ,ఆర్.ఎస్.ఎస్ లాంటి సంఘ్ పరివార్ శక్తులు కుటిల ప్రయత్నం చేస్తున్నాయని,ఈ విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు,మహిళను అంగడి బొమ్మగా,ఆట వస్తువుగా మార్చి పెట్టుబడి సరుకుగా మారుస్తున్నారని దేనికి వ్యతిరేకంగా మహిళలోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు...
ఈ కార్యక్రమంలో POW జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బురుగు అంజన్న,పజ్జూరి ఉపేంద్ర,కప్పల విజయ,సిలువేలు సునీత,వరక్క,పద్మ,రాదమ్మ,వెంకటమ్మా,రేణుక,స్వప్న, ఎల్లమ్మ,సుశీల,రమేశ్వరి,రోజా,సరితా తదితరులు పాల్గొన్నారు.
Mar 08 2023, 21:16