మాదిగల ప్రధాన శత్రువు బీజేపీ పార్టీ
ఎస్సీల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి బోడ సునీల్ మాదిగ, ఎమ్మెస్పీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి బకరం శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కోదాడ నుంచి చేపట్టిన మాదిగల సంగ్రామ పాదయాత్ర తొమ్మిదవ రోజు బుధవారం నల్లగొండ పట్టణ కేంద్రానికి చేరుకుంది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
ఎస్సీ వర్గీకరణకు 28 ఏళ్లగా మద్దతు తెలిపిన బీజేపీ ప్రస్తుతం దేశంలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలో ఉండి కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా మోసం చేస్తోందన్నారు. ఎన్నో బిల్లులను పార్లమెంట్ ఆమోదించుకుంటున్న బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
1996లో తిరుపతిలో, 2014లో భద్రాచలంలో ఎస్సీ వర్గీకరణపై బీజేపీ తీర్మానం చేసి ఇప్పుడు విస్మరించడమంటే నమ్మించి ద్రోహం చేయడమేనన్నారు. 2014 ఎన్నికల సమయం లో ప్రచారానికి వచ్చిన నరేంద్రమోదీ ఎస్సీలతో చర్చించి వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇచ్చారని, ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తరువాత కనీసం స్పందించడం లేదన్నారు.
ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మాదిగల ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎస్సీల వర్గీకరణ బిల్లును తక్షణమే పరిష్కరించి బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు ఎంఎస్ఎఫ్ రాష్ట్ర జిల్లా ఇంచార్జి మామిడి కరుణాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నల్లగొండ జిల్లా కోకన్వీనర్ ఇరిగి శ్రీశైలం మాదిగ, గ్యార శ్రీనివాస్, కత్తుల సన్నీ, కొండేటి గోపి, తరి కొండల్, మామిడి వెంకటేష్, ఎమ్మెస్పి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి కొమిరే స్వామి, నలగొండ మండల ఇన్చార్జి బొజ్జ దేవయ్య మాదిగ, పట్టణ నాయకులు బొజ్జ నాగరాజు, మల్లేపల్లి రాంబాబు, జీడిమెడ్ల రమేష్, బొజ్జ నవీన్, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.
Mar 08 2023, 21:13