నిజంనిప్పులాంటిది

Mar 08 2023, 12:26

UNSC: పాక్ మాటలకు స్పందించడం కూడా దండగే.. భారత్‌ ఘాటు విమర్శలు..

యునైటెడ్‌ నేషన్స్‌: అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ (Pakistan)కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఐరాసలో మహిళల భద్రతపై చర్చ సందర్భంగా కశ్మీర్‌ (Kashmir Issue) అంశాన్ని లేవనెత్తిన దాయాది పాక్‌కు భారత్‌ (India) గట్టి సమాధానమిచ్చింది.అలాంటి ద్వేషపూరిత, అసత్య ప్రచారాలకు ప్రతిస్పందించడం కూడా దండగే అని దుయ్యబట్టింది. అసలేం జరిగిందంటే..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women's Day) పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి (United Nations) భద్రతా మండలిలో 'మహిళ, శాంతి, భద్రత' అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ (Pakistan) విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ మాట్లాడుతూ..

మరోసారి జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir) అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఐరాస (UN)కు భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ (Ruchira Kamboj) ఘాటుగా స్పందించారు. ''ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా మహిళలకు భద్రత, శాంతియుత పరిస్థితులను నెలకొల్పాలనే ముఖ్యమైన అంశంపై చర్చ జరుపుతున్నాం. ఈ చర్చ ఆవశ్యకతను మేం గుర్తించి దానికి పూర్తి గౌరవిస్తున్నాం.

దానిపైనే మా దృష్టంతా. ఈ సమయంలో జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్‌ ప్రతినిధులు చేసిన పనికిమాలిన, నిరాధారమైన, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి ద్వేషపూరిత, అసత్య ప్రచారాలకు ప్రతిస్పందించడం కూడా దండగే'' అని ఆమె మండిపడ్డారు..

కశ్మీర్‌ (Kashmir) అంశాన్ని ఎత్తిచూపి అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను దోషిగా నిలబెట్టాలని పాక్‌ గతంలోనూ పలుమార్లు ప్రయత్నించి భంగపాటుకు గురైన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమేనని, వాటిపై ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారత్ ఇదివరకే దాయాదికి గట్టిగా చెప్పింది. పొరుగు దేశంతో తాము సాధారణ సంబంధాలనే కోరుకుంటున్నామని న్యూదిల్లీ మరోసారి స్పష్టం చేసింది. అయితే ఆ బంధం కొనసాగాలంటే.. బీభత్సం, శత్రుత్వం లేని వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ఇస్లామాబాద్‌పైనే ఉందని నొక్కి చెప్పింది..

నిజంనిప్పులాంటిది

Mar 08 2023, 12:24

మహిళా జర్నలిస్టులకు కేటీఆర్ భరోసా

హైదరాబాద్‌: ఉమెన్స్‌ డే సందర్భంగా హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మీరు మంచి పనిచేస్తే ఎవరూ పొగడరు. కానీ, చిన్న తప్పు చేసినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమాజంలో మా పరిస్థితి కూడా అంతే. ఎంత మంచి చేసినా ఎవరూ గుర్తించరు కానీ.. తప్పులు అందరూ గుర్తిస్తారు. మహిళా కెమెరామెన్‌, జర్నలిస్టు విధులు చాలా కష్టమైనవి. మహిళల కోసం వీహబ్‌ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం అందుబాటులోకి తెస్తున్నారు.

మీడియా రిలేటెడ్‌ స్టార్టప్‌ పనులు చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తప్పు చేసినప్పుడు చీల్చి చెండాడండి. దాంతో పాటు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలియజేయండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్య సేవలు అందిస్తున్నాం.

మాతా శిశుమరణాలు తగ్గాయి, నిమ్స్‌లో అత్యధిక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు చేశాం. మా తప్పులు ఎంత కవర్‌ చేస్తారో.. పాజిటివ్‌ న్యూస్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వండి. దుర్ఘటనలు జరిగినప్పుడు మాకు బాధ్యత లేదన్నట్టు మాట్లాడటం సరికాదు. రాష్ట్రంలో ఉన్న మహిళా జర్నలిస్టులు అంతా కలిసి ఒక యూనియన్‌గా ఏర్పడి... మీ సమస్యలను ఐఅండ్‌పీఆర్‌ శాఖకు తెలపాలి’’ అని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్రభుత్వ సత్కారం అందుకున్న మహిళా జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Mar 08 2023, 12:18

Pawan Kalyan:మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే..

వాడవాడలా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చట్టసభల్లో, అన్నిచోట్ల మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని మా పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచింది. మహిళల రిజర్వేషన్లు సాధించే విషయంలో నా రాజకీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుంది.

స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి మన సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.

మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం ఆవిష్కృతం కావడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవం వేళ మహిళా మణులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సృష్టిలో సగభాగం మహిళ, ప్రతీ మనిషి జీవితంలో కీలకపాత్ర పోషించే ఆడపడుచులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంపూర్ణ స్త్రీ సాధికారత సాధించాలని ఆకాంక్షిస్తున్నాం అని ట్వీట్ చేశారు పవన్.

నిజంనిప్పులాంటిది

Mar 08 2023, 12:10

Delhi Liquor Scam : ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్ ఇదీ..

హైదరాబాద్ : ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) స్పందించారు. విచారణకు హాజరు అయ్యేందుకు సమయం కావాలని ఆమె అడుగుతున్నారు..

10 వ తేదీ తరువాత విచారణకు వస్తానని ఈడీ (ED)ని కోరుతున్నారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేనని కవిత చెబుతున్నట్లు సమాచారం. 33 శాతం మహిళా రిజర్వేషన్ల కోసం 10 న ఢిల్లీ (Delhi)లో ధర్నాకు కవిత సన్నాహాలు చేసుకున్నారు. ఆ కార్యక్రమం తరువాత విచారణకు హాజరు అవుతానని ఈడీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. కవిత విజ్ఞప్తి పై ఇంకా ఈడీ అధికారులు స్పందించలేదు..

తెలంగాణ తల వంచదు !!

ఈడీ నోటీసులపై కవిత మీడియాతో మాట్లాడుతూ.. ''రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ నాకు నోటీసులు జారీ చేసింది..

చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటాము. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షాపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాము'' అని పేర్కొన్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 08 2023, 11:21

Corona Virus: కరోనా వచ్చి.. తగ్గిపోలేదు.. ఏడాది తర్వాతే దాని విశ్వరూపం

Corona Virus: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ప్రజా జీవితాన్ని సమూలంగా మార్చేసింది. మనిషి ఎదుటి వారిని చూసి జడుసుకునేంతగా చేసేసింది..

తాజాగా బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడ్డ ఏడాది తర్వాత శరీరంలోని ఏదో ఒక అవయవం దెబ్బతింటున్నదని అధ్యయనంలో తేలింది. అలసట, శ్వాస సమస్యలు, ఛాతి, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెదడు సంబంధ సమస్యలు, నిద్రలేమి, ఆందోళనతో రోగులు నిత్యం సతమతమవుతూనే ఉన్నారు.

దీర్ఘకాల కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న 59 శాతం మందిలో కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడ్డ ఏడాది తర్వాత శరీరంలోని ఏదో ఒక అవయవం దెబ్బతింటున్నదని పరిశోధనలు తెలుపుతున్నాయి. కరోనా వైరస్ సోకినప్పుడు ఇబ్బంది పడని వారిలో కూడా ఈ సమస్య తలెత్తుతుందని పరిశోధకులు గుర్తించారు. 536 మంది కొవిడ్‌ రోగులపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందులో 13 శాతం మంది కరోనాతో దవాఖానలో చేరినవారు కాగా, 32 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. ఈ 536 మంది రోగులకు ఆరు నెలల తర్వాత 40 నిమిషాల పాటు మల్టీ ఆర్గాన్‌ ఎంఆర్‌ఐ స్కాన్‌ నిర్వహించారు. ఈ ఫలితాలను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో విశ్లేషించగా, ఇందులో షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. ఈ అధ్యయన ఫలితాలు 'జర్నల్‌ ఆఫ్‌ ది రాయల్‌ సొసైటీ ఆఫ్‌ మెడిసిన్‌'లో ప్రచురితమయ్యాయి.

నిజంనిప్పులాంటిది

Mar 08 2023, 11:10

కవితపై అరెస్ట్ కత్తి వేలాడుతూ ఢిల్లీ మద్యం కేసులో విచారణకు సమన్లు ​​పంపిన ఈడీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురికి కష్టాలు పెరగొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా అరెస్ట్ తర్వాత కవితపై అరెస్ట్ కత్తి వేలాడుతున్నది. ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి బుధవారం కవితను ఈడీ విచారణకు పిలిచింది.

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని మార్చి 13 వరకు ED కస్టడీకి మరియు మద్యం వ్యాపారి అమన్‌దీప్ దాల్‌ను మార్చి 21 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఢిల్లీ కోర్టు ఒక రోజు తర్వాత కవితకు సమన్లు ​​వచ్చాయి. రాష్ట్ర సమితి (BRS) నాయకుడిని CBI ప్రశ్నించింది. ఈ కేసులో డిసెంబర్ 12న హైదరాబాద్‌లో ఏడు గంటలకు పైగా.

ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్లైని ఒకరోజు ముందు ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి 100 కోట్ల రూపాయల లంచం అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సౌత్ గ్రూప్‌తో కలిసి కుట్ర పన్నారని ఆరోపిస్తూ పిళ్లైని ఇడి అరెస్టు చేసింది. వ్యాపారవేత్త పిళ్లై రాబిన్ డిస్టిలరీస్ ఎల్‌ఎల్‌పి అనే కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె, శాసన మండలి సభ్యురాలు కవిత తదితరులతో సంబంధం ఉన్న మద్యం కార్టెల్ సౌత్ గ్రూప్‌కు అతను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఇడి పేర్కొంది. అరెస్టయిన మద్యం వ్యాపారి సమీర్ మహంద్రు, అతని భార్య గీతిక మహంద్రు మరియు వారి కంపెనీ ఇండోస్పిరిట్ గ్రూప్‌తో కూడా పిళ్లైకి సంబంధం ఉంది.

ఈమేరకు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడైన కవిత చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్ల సోమవారం కోర్టు నుంచి ఉపశమనం పొందారు. అతను రూస్ అవెన్యూ కోర్టు నుండి బెయిల్ పొందాడు. హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబును సీబీఐ బృందం అరెస్టు చేసినట్లు తెలియజేశారు.

నిజంనిప్పులాంటిది

Mar 08 2023, 09:46

Ambani Driver జీతం ఎంతో తెలుసా? IT ఉద్యోగులకు మించి.. వారందరి కంటే ఎక్కువే!

Ambanis Driver: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దిగ్గజ వ్యాపారవేత్త, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ గురించి, ఆయన జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల కోట్ల ఆస్తి. ఇక అంబానీ ఇంట్లో పని వారికి కూడా భారీగానే జీతం ఉంటుందని తెలుసు కానీ.. అది ఎంతో కచ్చితంగా తెలియకపోవచ్చు. అయితే.. ఇప్పుడు అంబానీ డ్రైవర్ జీతం చర్చనీయాంశంగా మారింది. తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.

సెలబ్రిటీల జీవితం గురించి తెలిసిందే. ఈ ఒక్క పదానికి ఉన్న ఆకర్షణే వేరు. వారి లైఫ్‌స్టైల్ మామూలుగా ఉండదు. ఇక వారి దగ్గర పని చేసేవారు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతుంటారు. ఇప్పుడు భారత దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత Driver కూడా అలాగే వార్తల్లోకి ఎక్కారు. అతడి జీవితం గురించి సోషల్ మీడియాలో పలు వీడియోలు చక్కర్లు కొడుతుండగా.. ఇప్పుడు ఆ డ్రైవర్ గురించి పలు మీడియాల్లో కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇక 2017లో అంబానీ వ్యక్తిగత డ్రైవర్ జీతం నెలకు రూ.2 లక్షల రూపాయలు అని దానిని బట్టి తెలుస్తోంది. ఈ లెక్కన ఏడాదికి రూ.24 లక్షల వరకు వస్తుంది. ఇంకా అంబానీ ఇంట్లో డ్రైవర్ అంటే.. జీతానికి అదనంగా ఇంకా చాలానే ప్రయోజనాలు ఉంటాయి. అవన్నీ వేరే. వాటి సంగతెందుకు గానీ.. ఐదేళ్ల కిందటే నెలకు రూ.2 లక్షలంటే ఇప్పుడెంత ఉంటుందో.. అదీ Ambani దగ్గర అంటే.. ఊహించడానికే చాలా కష్టంగా ఉంటుంది.

ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే వృత్తి నిపుణులకు కూడా ఈ స్థాయిలో Salary ఉంటుందని గ్యారెంటీ ఇవ్వలేం. అది కూడా ఎన్నో ఏళ్లు పని చేస్తే గానీ దక్కకపోవచ్చు. దీంతో ఇప్పుడు అంబానీ వ్యక్తిగత డ్రైవర్ వార్తల్లో నిలిచారు. ప్రపంచ కుబేరుడి ఇంట్లో పనిచేస్తున్నారంటే.. వారికి ఆ పనిలో ఎంతో నైపుణ్యం ఉండాలి. ఇక అంబానీ తన వ్యక్తిగత డ్రైవర్‌ను.. ఓ ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థ ద్వారా నియమించుకున్నారని ఆ వార్తా కథనాలు వెలువరించాయి.

ప్రముఖులు, దిగ్గజాల దగ్గర పనిచేసేటప్పుడు ఎలా వ్యవహరించాలో సహా అన్ని నైపుణ్యాలను ఆ కంపెనీలు ట్రైనింగ్ ఇస్తుంటాయి. ఇక లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలా వాడాలి? అని కూడా శిక్షణ ఇస్తుంటాయి. ఎలాంటి రోడ్లపై అయినా, అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనప్పటికీ.. ఆ వాహనాన్ని నడిపేలా వీరు తర్ఫీదు పొందుతారు. ఆ డ్రైవర్లతో సహా వంట మనుషులు, గార్డులు, వివిధ సిబ్బందికి ప్రోత్సాహకాలతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉంటుందంట.

ఇక ప్రముఖులకు డ్రైవర్లు, వంట మనుషులు, ఇతర సిబ్బంది ఎలా ఉంటారు? వారి జీవితం ఎలా ఉంటుందనేది మనం చాలా వరకు సినిమాల్లో చూస్తుంటాం. సినిమా సెలబ్రిటీల మేనేజర్స్, బాడీ గార్డ్స్, ఆయాల జీతాలు కూడా బయటకు వచ్చాయి. బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, Salman Khan వంటి స్టార్ హీరోలు వారి వారి బాడీగార్డ్స్‌కు కోట్లల్లో జీతం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ దంపతులు.. తమ పిల్లల్ని చూసుకునే ఆయాకు నెలకు లక్షన్నర రూపాయలు ఇస్తున్నారట. ఇక ఓవర్‌టైమ్ సమయంలో ఇది రూ.1.75 లక్షల వరకు ఉంటుందంట. కొద్దిరోజుల కింద షారుక్ ఖాన్ మేనేజర్ విలాసవంతమైన ఒక ఇంటిని కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. ఆమె ఏడాదికి రూ.7-9 కోట్ల వరకు జీతం తీసుకుంటారని తెలిసింది. ఇక ఆమె ఆస్తుల విలువ రూ.50 కోట్లకుపైమాటే.

నిజంనిప్పులాంటిది

Mar 07 2023, 14:39

లాలూ కుమార్తె ఇంటికి సీబీఐ.. Land For Job Caseలో మాజీ సీఎంకు ప్రశ్నలు

పట్నా: ఆర్జేడీ(RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌(Lalu Prasad Yadav)ను మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రశ్నిస్తోంది.

ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై నమోదైన కేసు (Land For Job Case)లో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ విచారణ లాలూ కుమార్తె మీసా భారతి ఇంట్లో జరుగుతోంది..

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ(UPA)హయాంలో లాలూ( Lalu Prasad Yadav) రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదుచేసింది. బీహార్‌ మాజీ సీఎం లాలూతోపాటు ఆయన భార్య రబ్రీదేవి, మరో 14 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. సోమవారం రబ్రీని ఆమె నివాసంలో ప్రశ్నించిన సీబీఐ.. ప్రస్తుతం లాలూను విచారిస్తోంది..

నిజంనిప్పులాంటిది

Mar 07 2023, 14:38

సాధారణ ఫ్లూనే దేశంలో దడపుట్టిస్తోంది.. తేలికగా తీసుకోవద్దు!

ఢిల్లీ: ప్రస్తుతం దేశంలో విజృంభిస్తోంది సాధారణ ఫ్లూ అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండాల్సిందేనని అంటున్నారు ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా..

కరోనా కాకున్నా ఆ వైరస్‌లానే H3N2 ఇన్‌ఫ్లూయెంజా ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తోందని హెచ్చరిస్తున్నారాయన. పండుల సీజన్‌ వేళ అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారాయన. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు..

ఈ నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో మాస్కులు వాడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. కరోనా టైంలో పాటించిన జాగ్రత్తలను పాటిస్తే.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చిన చెప్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇష్టానుసారం యాంటీ బయోటిక్స్‌ వాడొద్దని ఇదివరకే ఐసీఎంఆర్‌ ప్రజలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. వృద్ధులు, చిన్నారులతో పాటుగా గుండె, కిడ్నీ, ఇతరత్ర వ్యాధులు ఉన్నవాళ్లు సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 07 2023, 14:36

Smuggling: బోటులో డ్రగ్స్.. చెరువులో బంగారు బిస్కెట్లు..

Smuggling: గుజరాత్ తీరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇరాన్ నుంచి అక్రమంగా వచ్చిన ఓ బోటులో డగ్స్ కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు. మొత్తం రూ.425 కోట్ల విలువైన 61 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్ చేశారు. గుజరాత్ ఏటీఎస్ ఇచ్చిన సమాచారం మేరకు ఇరాన్ పడవను కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు.

కోస్ట్ గార్డ్స్ గుజరాత్ తీరంలో సముద్రంలో పెట్రోలింగ్ చేస్తున్న సమంలో ఓఖా తీరానికి దాదాపుగా 340 కిలోమీటర్ల దూరంలో భారత జలాల్లో ఓ పడవ అనుమానాస్పదంగా ఉందని గమనించారు. కోస్ట్ గార్డ్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చేస్తుండగా, వెంబడించి పట్టుకున్నారు.

చెరువులో బంగారు బిస్కెట్లు..

పశ్చిమ బెంగాల్ లోని నాడియా జిల్లాల్లో కళ్యాణి సరిహద్దు ఔట్ పోస్టు ప్రాంతంలోని చెరువులో సుమారు రూ. 2.57 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను బీఎస్ఎఫ్ సోమవారం స్వాధీనం చేసుకుంది. విశ్వసనీయ సమచారం రావడంతో బీఎస్ఎఫ్ చెరువులో తనిఖీ చేపట్టింది. సుమారుగా 40 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ రూ. 2.57 కోట్ల ఉంటుందని బీఎస్ఎఫ్ తెలిపింది. కొన్ని నెలల క్రితం ఓ స్లగ్మర్ చెరువులోకి దూకి బంగారం దాచిపెట్టినట్లు తెలిపారు. అదును చూసి బంగారాన్ని తీసేందుకు స్మగ్లర్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.