ఈశాన్య రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించి భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ పథకాలకు ఆకర్షితులై ఈశాన్య రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కి బ్రహ్మరథం
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో ఉరుమడ్ల గ్రామంలో
బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి హర్షం
ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించారు. భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి పథకాలకు ఆకర్షితులై ఈశాన్య రాష్ట్ర ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాల్లో త్రిపుర నాగాలాండ్ మేఘాలయ రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారి ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తపరిచారు.
ఈ భారత దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఈ ఎన్నికలు నిగ్గు తేల్చాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మన భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టిన నరేంద్ర మోడీ గారి దీక్ష దక్షిత భారత దేశంలోని ప్రతి రాష్ట్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని ఈ ఎన్నికల ద్వారా నిరూపించారు. యావత్తు భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాజీ వార్డ్ సభ్యులు రూపాని నరసింహ, ఉయ్యాల లింగస్వామి గౌడ్, పాలకూరి వెంకన్న గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు ఈదుల పవన్, సుంకరి మల్లేష్ గౌడ్, చింతకాయల రాము, పాకాల దినేష్, పల్లపు వెంకటేష్, పాకాల అర్జున్ తదితరులు పాల్గొన్నారు
Mar 05 2023, 09:52