Chandrababu Naidu: పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తా..
ఎన్టీఆర్ భవన్ సమీపంలోని సీకే కన్వెన్షన్ హాల్ టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. గత నాలుగేళ్లల్లో టీడీపీ శ్రేణులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై చర్చ జరిగింది..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం అనుసరించవలసిన విధానాలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన చంద్రబాబు బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వైసీపీ నేతల దాడుల్లో తాము పడ్డ ఇబ్బందులను.. లీగల్ సెల్ అందించిన సాయాన్ని సదస్సులో వివరించారు బాధిత కుటుంబాల సభ్యులు. రావణున్ని యుద్దంలో ఓడించడానికి రాముడొక్కడే చాలు..
కానీ ధర్మ పరిరక్షణ కోసం రాముడు అందరి సాయం తీసుకున్నారు. ఉడుత కూడా ధర్మ పరిరక్షణ కోసం సాయం చేసింది. పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తా. అధికార పార్టీకి సహకరించే పోలీసులను హెచ్చరిస్తున్నా. తప్పుడు పనులకు పోలీసులు సహకరించకూడదు. నాలుగేళ్లల్లో విశాఖలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు. విశాఖలో రూ. 40 వేల కోట్లను దోచుకున్నారు. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకున్నారు. పోర్టు.. భూములను బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారని మండిపడ్డారు చంద్రబాబు..
ప్రభుత్వానికి లాయర్ల అవసరం ఉంది.అధికారంలోకి వచ్చాక టీడీపీ లీగల్ సెల్ లాయర్ల సేవలు వినియోగించుకుంటాం.ఇప్పటి వరకు నాపై ఎలాంటి కేసులు లేవు.నాపై కేసులు పెట్టేందుకు ఎవ్వరూ సాహసించ లేదు.ఇప్పుడు నాపై ఎన్ని కేసులున్నాయో నాకే తెలీదు.నాపై ఏమైనా కేసులున్నాయా..? అని డీజీపీకి లేఖ రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు చంద్రబాబు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించాలి.వైసీపీ పతనం ఇక్కడ నుంచే ప్రారంభం కావాలి.ఓటర్ల జాబితా మొదలుకుని.. ఏజెంట్ల నియామకం వరకు లీగల్ సెల్ సేవలు అవసరం.ఏజెంట్ల నియామకం విషయంలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి.డెకాయిట్లు రాజకీయాల్లో ఉండకూడదంటే.. వచ్చే ఎన్నికల్ని సీరియస్సుగా తీసుకోవాలి.ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్ సేవలు అవసరం అన్నారు చంద్రబాబు..
Mar 04 2023, 19:45