Bill Gates: మోదీతో మాట్లాడాక.. మరింత ఆశతో ఉన్నా: బిల్‌గేట్స్
దిల్లీ: టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. అన్ని రంగాల్లో దేశం పురోగతి చెందుతోందని, సృజనాత్మకత రంగంలో పెట్టుబడులు పెడితే ఎలాంటి అద్భుతాలు సాధించగలమో చెప్పేందుకు ఈ దేశమే నిదర్శనమని కొనియాడారు..
ఈ సందర్భంగా భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ టెక్నాలజీ గురించి బిల్‌గేట్స్ ప్రస్తావించారు. సాంకేతికతతో ప్రభుత్వం పనితీరు మెరుగవుతుందని చెప్పేందుకు గతిశక్తి ఉత్తమ ఉదాహరణ అని అన్నారు. ఇక, జీ-20 (G-20) సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై స్పందిస్తూ.. ''దేశంలోని నూతన ఆవిష్కరణల నుంచి ప్రపంచం ఎలా ప్రయోజనం పొందొచ్చే చెప్పేందుకు ఇది గొప్ప అవకాశం'' అని ప్రశంసించారు.
''ప్రధానితో మాట్లాడిన తర్వాత.. ఆరోగ్యం, అభివృద్ధి, పర్యావరణ రంగాల్లో భారత్ (India) సాధిస్తోన్న పురోగతి గురించి గతంలో కంటే మరింత ఆశావాహ దృక్పథంతో ఉన్నా. మనం సృజనాత్మకత రంగంలో పెట్టుబడులు పెడితే ఏం సాధించగలమో భారత్ నిరూపిస్తోంది. ఈ పురోగతి ఇలాగే కొనసాగాలని, భారత్ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నా'' అంటూ గేట్స్ (Bill Gates) తన బ్లాగ్‌ను ముగించారు.
Mar 04 2023, 19:33