Kishan Reddy: కుటుంబ పార్టీల కారణంగా ఏపీలో అభివృద్ధి కుంటుపడుతోంది..
![]()
Kishan Reddy In Global Investors Summit 2023: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకూ దిగజారుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందని, కుటుంబ పార్టీల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక్క బీజేపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏపీ ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు.
![]()
అయితే.. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు, బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పర్యాటక అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని రాజధానిలో నిర్వహించే సభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారన్నారు. ఇదే సమయంలో కిషన్ రెడ్డి నోటి వెంట ఏపీ రాజధాని ప్రస్తావన కూడా వచ్చింది. విశాఖపట్టణం రాజధాని ప్రాంతం అని, జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీగా మాధవ్‌ని ఆశీర్వదించి మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాధవ్ వంటి వారుంటే.. ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు..
Mar 04 2023, 15:43