శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి.
•విద్యాసంస్థల యాజమాన్యంపై క్రిమినల్ కేసు, హత్యా కేసు నమోదు చేయాలి.
•బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.
మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడు అవుతాడని భావించిన తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసి విద్యాసంస్థల చైర్మన్ బిఎస్ రావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ కళాశాల యాజమాన్య వేధింపులు ఒత్తిడి తట్టుకోలేక ఓ ముక్కు పచ్చలారని విద్యార్థి జీవితం బలయిందన్నారు. పది రోజుల క్రితమే ఉప్పల్ ఫిర్జాదిగూడ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల లో అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఆమె ఆత్మహత్య ఘటన మరవకముందే హైదరాబాద్ లోని నార్సింగ్ ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన
నాగుల సాత్విక్ అనే ఇంటర్ మీడియట్ చదివే విద్యార్థి తన తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ముక్కు పచ్చలారని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థి సాత్విక్ ను పెద్ద ఎత్తున ఒత్తిడికి గురిచేయడం తిట్టడం కొట్టడం వల్లే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. యాజమాన్య వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని తక్షణమే శ్రీచైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసి విద్యాసంస్థల యాజమాన్యంపై క్రిమినల్ హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, యలిజాల రమేష్, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mar 02 2023, 18:11