వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి...కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం....
•CPI (M-L) న్యూడెమోక్రసీ
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను అమాంతంగా గృహ వినియోగదారులకు 50/రు,,లు, కమర్ష్యాల్ 350 లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం (బస్టాండ్)వద్ద రాస్తారోకో నిర్వహించి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా CPI (ML)న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఇందూరు సాగర్, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్,పాల్గొని మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం రోజు రోజుకు వంట గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులను రోడ్డున పడేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే పెట్రోల్,డీజిల్ ధరలను పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు.
పేద,మధ్య తరగతి,సాధారణ ప్రజలు ధరల పెరుగుదలతో హార్దికం ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.దేశభక్తి ముసుగులో దేశ సంపదను కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు,ఆదాని,అంబానీ లాంటి బడా పెట్టుబడి దారులకు కట్టబెడుతూ..ప్రజలకు మాత్రం ధరల భారాన్ని మోపుతున్నారని దుయ్యబట్టారు. గ్యాస్ ధరలు పెంచడం మూలంగా మధ్యతరగతి ప్రజల జీవితాలను హార్దికం గా దెబ్బతింతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారి,పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలె పవన్, IFTU జిల్లా నాయకులు బొంగరాల నర్సింహ,సీపీఐ (యం.యల్) న్యూడెమోక్రసీ,IFTU నాయకులు రావుల వీరేష్,కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహా,మామిడాల ప్రవీణ్,నాంపల్లి శంకర్, నర్సింహా,బొమ్మపాల అశోక్,రాంనగర్ శంకర్,మోడీకట్టి సురేందర్, మహేష్,చింత యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.
Mar 02 2023, 17:39