74 మందులకు రిటైల్ ధరలు ఖరారు: ఎన్‌పీపీఏ
దిల్లీ: జాతీయ మందుల ధరల నిర్ణాయక సంస్థ (ఎన్‌పీపీఏ) 74 మందులకు రిటైల్ ధరలను నిర్ణయించింది. ఈ నెల 21న జరిగిన 109వ ఎన్‌పీపీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మధుమేహ వ్యాధి చికిత్సలో వినియోగించే డాపాగ్లిఫ్లోజిన్ సిటాగ్లిప్టిన్, మెట్‌ఫామిన్ హెచ్‌సీఎల్ (ఈఆర్) ట్యాబ్లెట్‌కు రూ.27.75 ధర; రక్తపోటును అదుపు చేయటానికి వినియోగించే టెల్మిసార్టాన్, బిసోప్రొలోల్ ఫ్యూమరేట్ ట్యాబ్లెట్‌కు రూ.10.92 ధర నిర్ణయించారు.
మరో 80 ఔషధాలకు గరిష్ఠ ధర (సీలింగ్ ప్రైస్)లనూ ఎన్‌పీపీఏ నిర్ణయించింది. మూర్ఛ, నూట్రోపెనియా వ్యాధి ఔషధాలు ఇందులో ఉన్నాయి. సోడియమ్ వాల్‌ప్రొయేట్- 200 ఎంజీ ట్యాబ్లెట్‌కు రూ.3.20, ఫిల్‌గ్రాస్టిమ్ ఇంజెక్షన్ (ఒక వయల్)కు రూ.1,034.51 ధర ఖరారు చేశారు. స్టెరాయిడ్ తరగతికి చెందిన ఔషధం హైడ్రోకార్టిసోన్- 20 ఎంజీకి రూ.13.28 గరిష్ఠ ధర నిర్దేశించారు.
Feb 28 2023, 18:04