బైరి నరేష్ పుంగి బజాయించిన అయ్యప్ప భక్తులు

బైరి నరేష్ పై మరోసారి దాడి!

అయ్యప్ప స్వామి పుట్టుక, చరిత్రకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో నాస్తిక సంఘం అధ్యక్షుడు అయిన బైరి నరేష్ పై వరంగల్ లో దాడి చేశారు హిందూ సంఘ కార్యకర్తలు.

గతంలో అయ్యప్ప స్వామి పుట్టుక, చరిత్రపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల ముందు బైరి నరేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది కొడంగల్ కోర్టు. ఈ నేపథ్యంలోనే బెయిల్ పై బయటికి వచ్చిన నరేష్ మరోసారి అయ్యప్ప పుట్టుకకు సంబంధించిన ఆధారాలు నాకు కావాల్సిందే అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆగ్రహించిన హిందూ సంఘాల కార్యకర్తలు తాజాగా వరంగల్ లో ఓ కార్యక్రమానికి వచ్చిన బైరి నరేష్ పై మరోసారి దాడి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అయ్యప్ప స్వామి పుట్టుక, చరిత్రకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో నాస్తిక సంఘం అధ్యక్షుడు అయిన బైరి నరేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా కొన్ని రోజుల క్రితం షరతులతో కూడిన బైయిల్ పై విడుదల అయ్యాడు బైరి నరేష్. విడుదల అయిన తర్వాత కూడా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తనకు అయ్యప్ప పుట్టుకకు గల ఆధారాలు కావాల్సిందే అని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు బైరి నరేష్. దాంతో ఈ అనుచిత వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ క్రమంలోనే వరంగల్ లోని ఆదర్శ లా కాలేజ్ లో ఓ కార్యక్రమానికి హాజరైన బైరి నరేష్ పై హిందూ సంఘ కార్యకర్తలు దాడికి దిగారు. కార్యక్రమాన్ని ముగించుకుని పోలీస్ వాహనంలో వస్తున్న బైరి నరేష్ పై హిందూ సంఘ నాయకులు దాడికి దిగారు. బైరి నరేష్ ను వెంబడించి, అతడి బట్టలు చింపి పరిగెత్తించి కొట్టారు హిందూ కార్యకర్తలు. తనకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని బైరి నరేష్ పోలీసులకు విన్నవించుకున్నట్లు సమాచారం..

Khushbu Sundar: ఖుష్బుకు కీలక బాధ్యతలు

న్యూఢిల్లీ: తమిళనాడు భారతీయ జనతా పార్టీ (BJP) నాయకురాలు ఖుష్బూ సుందర్‌(Khushbu Sundar)కు కీలక బాధ్యతలు లభించాయి. ఆమెను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి(National Commission for Women)గా నామినేట్ చేశారు.

దక్షిణాదిలో నటిగా పాపులర్ అయిన ఆమె వందకు పైగా తమిళ సినిమాల్లో నటించారు. రాజకీయాలంటే ఆసక్తి ఉండటంతో 2010లో ఆమె డీఎంకే పార్టీలో చేరారు. నాలుగేళ్ల తర్వాత హస్తం పార్టీలో చేరారు. 2020 వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధికార ప్రతినిధిగా కూడా సేవలందించారు. రాముడు, కృష్ణుడు, హనుమంతుడి బొమ్మలున్న చీర ధరించడం ద్వారా అప్పట్లో కలకలం రేపారు. క్షమాపణలు చెప్పాలంటూ హిందూ సంస్థలు రచ్చ చేశాయి కూడా.

ఖుష్బూ సుందర్‌ కొంతకాలం క్రితం బీజేపీలో చేరారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమిళనాడు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వస్తున్నారు. బాగా మాట్లాడతారని పేరు తెచ్చుకున్న ఖుష్బూ సుందర్‌ సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. మహిళల సమస్యలపై మరింత ఫోకస్ చేసేందుకు అవకాశం లభిస్తుందని ఖుష్బూ అంటున్నారు. మహిళల జోలికి రాజకీయ పార్టీల నేతలు వస్తే ఊరికునేది లేదని ఆమె హెచ్చరించారు.

సీబీఐ కస్టడీకి దిల్లీ డిప్యూటీ సీఎం

దిల్లీ: మద్యం కుంభకోణంలో అరెస్టయిన దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాకు రౌస్ అవెన్యూ కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది.

సిసోదియాను మార్చి 4 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. మద్యం కుంభకోణం కేసులో ఆయనను సీబీఐ అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపర్చింది.

ప్రభుత్వ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఆయనను నిన్న సీబీఐ అదుపులోకి తీసుకుంది.

మారకద్రవ్యాల నుండి యువతను కాపాడుదాం

•PYL మండల మహాసభలో ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్

ప్రగతిశీల యువజన సంఘం (PYL)మోతే మండల ప్రధమ మహాసభ రాయిపాడు గ్రామంలో కోడి లింగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముందుగా బిగిపిడికిలి జెండాను పీవైఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య ఆవిష్కరించారు. ఈ మహాసభను ప్రారంబిస్తూ ఐఎఫ్ టి యూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య మాట్లాడారు.

అనంతరం జరిగిన మహాసభలో ముఖ్య అతిథిగా పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో యువత మద్యం, గంజాయి,గుట్కా, మారకద్రవ్యాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు గురై జీవితాలను కోల్పోతున్నారని, ప్రభుత్వం వీటిని నియంత్రించడంలో ఘోరంగా విఫలం చెందిందని దుయ్యబెట్టారు.

ఎంజీఎం మెడికల్ కళాశాలలో ప్రీతి అనే విద్యార్థిని ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రీతి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని అన్నారు. విద్యాసంస్థలలో డ్రగ్స్, గంజాయి, మారక ద్రావవ్యాలను విక్రయిస్తున్న పోలీసులు చోద్యం చూస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన "షి" టీములు "షో" టీములుగానే మారినాయని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం మేల్కొని రాష్ట్రంలో యదేచ్ఛగా సాగుతున్న మద్యం, గంజాయి గుట్కా తదితర మారక ద్రవ్యాలను నిషేధించాలని, షి టీoలను వివిధ కళాశాలలో నిరంతరం ఉంచాలని డిమాండ్ చేశారు.

ఐఎఫ్ టి యూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య మాట్లాడుతూ దేశంలో,రాష్ట్రంలో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు నిరుద్యోగులను గాలికి వదిలేసారని, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందారని అన్నారు. 26 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని ఇప్పటివరకు భారీ నోటిఫికేషన్ ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని, దేశంలో కోటి ఉద్యోగాలు ఇస్తారన్న మోడీ ప్రభుత్వం హిందుత్వం ముసుగులో ప్రజల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు, బహుళ జాతి సమస్యలకు అప్పనంగా కట్టబెట్టి ప్రజలను మభ్యపెడుతున్నదని బియ్యబట్టారు. వెంటనే దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకపోతే ప్రగతిశీల యువకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు నల్లగొండ నాగయ్య, కునుకుంట్ల సైదులు, జిల్లా నాయకులు వీరబోయిన రమేష్, భువనగిరి గిరిబాబు, ధరావత్ రవి, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కాకి మోహన్ రెడ్డి, కోట్ల మధుసూదన్ రెడ్డి, ఎర్రబోయిన లింగయ్య, ఎర్రబోయిన పుల్లయ్య, భానోత్ శ్రీకాంత్, ఎర్ర ఎంకన్న, ఇరుగు మల్లయ్య, గుణగంటి నాగరాజు, కోడి లింగరాజు, నాగరాజు తదితరులు హాజరయ్యారు.

ఆయుష్మాన్ భారత్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలిి

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ను భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారు ఉరుమడ్లలో పాల్గొని ప్రతి ఒక్కరు ఈ హెల్త్ కార్డును ఉపయోగించుకునే 1100 పైగా అన్ని రకాల వైద్య చికిత్సలు అందే విధంగా పేద ప్రజలకు చేరువగా ఉరుమడ్ల గ్రామంలో బిజెపి బూత్ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినారు.

ఉరుమడ్ల గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ABHA హెల్త్ కార్డ్ ను తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం ఐదు లక్షల వరకు ఉచిత ఆరోగ్య చికిత్సల కోసం ఏర్పాటుచేసిన ఈ కార్డును సద్వినియోగం చేసుకోవాలని ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్ లో ఉచితంగా 1100 రకాల ఆరోగ్య పరీక్షలు చికిత్సలు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

తెలంగాణలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరికోసం ఎదురు చూడకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్సలు చేయించుకునే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సదా అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు అందజేశారన్నారు. కావున ఉరుమడ్ల గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు పొందాలని ఇట్టి కార్డును ఉచితంగా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు ఇంటి ఇంటికి వచ్చి అందజేస్తామన్నారు. ఇంత గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఉయ్యాల లింగస్వామి, యువజన నాయకులు పాకాల దినేష్, బూత్ కమిటీ అధ్యక్షులు ఈదుల పవన్, సుంకరి మల్లేష్, గంగాపురం వెంకన్న, మల్లేష్, జగన్, రాంబాబు, లింగస్వామి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

ఒక్క రోజులో మూడు ఫోన్లు మార్చిన సిసోదియా..!

దిల్లీ: మద్యం కుంభకోణంలో అరెస్టయిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)ను నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు. ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా సిసోదియాను నిన్న సీబీఐ (CBI) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాత్రంతా ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయంలోనే గడిపారు. ఈ ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రౌస్‌ అవెన్యూ కోర్టులో సిసోదియాను హాజరుపర్చనున్నారు.

ఛార్జ్‌షీట్‌లో పేరు..

సిసోదియా (Manish Sisodia) అరెస్టుపై సీబీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విచారణకు సహకరించకపోవడం వల్లే ఆయనను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. కీలకమైన అంశాలపై ఆయన సరిగా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. తప్పించుకునే విధంగా సమాధానాలు ఇచ్చారని, విరుద్ధమైన సాక్ష్యాలను ఎదుర్కొన్నప్పటికీ దర్యాప్తునకు సహకరించలేదని ఆరోపించింది. ఈ కేసులో సిసోదియా నుంచి రాబట్టాల్సిన సమాచారం ఎంతో ఉన్నందున.. ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ.. న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సిసోదియా పేరు కూడా ఉన్నట్లు సీబీఐ (CBI) వర్గాలు తెలిపాయి. అయితే, ఈ కేసులో ఆయనను నిందితుడిగా పేర్కొనలేదని తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేసినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

18 ఫోన్లు ఉపయోగించిన సిసోదియా..

సిసోదియా (Manish Sisodia) ఇతర వ్యక్తుల పేర్ల మీద అనేక ఫోన్‌ నంబర్లు, ఫోన్లు తీసుకున్నారని, ఆ తర్వాత వాటిల్లో కొన్నింటిని ధ్వంసం చేశారని సీబీఐ (CBI) వర్గాలు ఆరోపించాయి. ఆయన 18 ఫోన్లు, నాలుగు ఫోన్‌ నంబర్లు ఉపయోగించేవారని పేర్కొన్నాయి. ఒక్క రోజులోనే ఆయన మూడు ఫోన్లను మార్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.

ఆప్‌ దేశవ్యాప్త నిరసనలు..

సిసోదియా అరెస్టుకు నిరసనగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేడు దేశవ్యాప్త నిరసనలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు. అటు సీబీఐ (CBI) కార్యాలయం ముందూ భద్రతను పెంచారు.

Senior Leader D Srinivas : తీవ్ర అస్వస్థత.. కండిషన్ సీరియస్

హైదరాబాద్ : పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది..

డీఎస్‌కు ఫిట్స్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు.

తన తండ్రి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని.. ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని కాబట్టి రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని ట్విటర్ వేదికగా తన కార్యకర్తలకు తెలిపారు. నేడు రేపు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. ''మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు'' అని అరవింద్ తన ట్వీట్‌లో తెలిపారు.

Supreme Court: అమరావతిపై ఏపీ ప్రభుత్వం పిటిషన్లు.. మార్చి 28న విచారణ

దిల్లీ: రాజధాని అమరావతిపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. రాజధానిపై పిటిషన్లను త్వరగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

త్వరగా వాదనలు ముగించాలని జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఆ పిటిషన్లపై మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దీనిపై గతవారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ రాజ్యాంగ ధర్మాసనం బుధ, గురువారాల్లో మిస్‌లేనియస్ పిటిషన్లపై విచారణను నిలుపుదల చేసిన నేపథ్యంలో అప్పుడు వాయిదా పడింది..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

Tirupati : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నేడు స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది..

ఆదివారం శ్రీవారిని 81,170 భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి నిన్న 27,236 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ సాయం నేడు.. రూ.16,800 కోట్లు విడుదల చేయనున్న ప్రధాని

దిల్లీ: దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతులకు ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిది’ 13వ విడత కింద రూ.16,800 కోట్ల సాయాన్ని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు.

ఈ పథకంలో అర్హులైన రైతులకు ఏడాదిలో రూ.6,000 సాయం చొప్పున మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది.

కర్ణాటకలోని బెళగావిలో లక్ష మందికి పైగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి, జల్‌ జీవన్‌ మిషన్‌ లబ్ధిదారులతో నిర్వహించనున్న సభలో ప్రధాని 13వ విడత సాయాన్ని విడుదల చేస్తారని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.2.25 లక్షల కోట్ల నిధులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు