Senior Leader D Srinivas : తీవ్ర అస్వస్థత.. కండిషన్ సీరియస్

హైదరాబాద్ : పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది..

డీఎస్‌కు ఫిట్స్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు.

తన తండ్రి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని.. ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని కాబట్టి రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని ట్విటర్ వేదికగా తన కార్యకర్తలకు తెలిపారు. నేడు రేపు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. ''మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు'' అని అరవింద్ తన ట్వీట్‌లో తెలిపారు.

Supreme Court: అమరావతిపై ఏపీ ప్రభుత్వం పిటిషన్లు.. మార్చి 28న విచారణ

దిల్లీ: రాజధాని అమరావతిపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. రాజధానిపై పిటిషన్లను త్వరగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

త్వరగా వాదనలు ముగించాలని జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఆ పిటిషన్లపై మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దీనిపై గతవారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ రాజ్యాంగ ధర్మాసనం బుధ, గురువారాల్లో మిస్‌లేనియస్ పిటిషన్లపై విచారణను నిలుపుదల చేసిన నేపథ్యంలో అప్పుడు వాయిదా పడింది..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

Tirupati : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నేడు స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది..

ఆదివారం శ్రీవారిని 81,170 భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి నిన్న 27,236 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ సాయం నేడు.. రూ.16,800 కోట్లు విడుదల చేయనున్న ప్రధాని

దిల్లీ: దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతులకు ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిది’ 13వ విడత కింద రూ.16,800 కోట్ల సాయాన్ని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు.

ఈ పథకంలో అర్హులైన రైతులకు ఏడాదిలో రూ.6,000 సాయం చొప్పున మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది.

కర్ణాటకలోని బెళగావిలో లక్ష మందికి పైగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి, జల్‌ జీవన్‌ మిషన్‌ లబ్ధిదారులతో నిర్వహించనున్న సభలో ప్రధాని 13వ విడత సాయాన్ని విడుదల చేస్తారని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.2.25 లక్షల కోట్ల నిధులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు

మేఘాలయ, నాగాలాండ్‌లలో నేడే ఎన్నికలు

షిల్లాంగ్‌, కోహిమా: ఈశాన్య భారత్‌లోని నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో 60 శాసనసభ నియోజకవర్గాల చొప్పున ఉన్నాయి. అయితే నాగాలాండ్‌లో ఒక స్థానం (అకులుటో) ఎన్నిక ఏకగ్రీవం కాగా, మేఘాలయలో ఓ అభ్యర్థి (సోహియాంగ్‌ స్థానంలో) మరణించారు.

ఫలితంగా సోమవారం రెండు రాష్ట్రాల్లోనూ 59 స్థానాలకే ఎన్నికలు జరగనున్నాయి. నాగాలాండ్‌లో మొత్తం 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారికోసం 2,291 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో అధికార నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ), భాజపా పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచాయి. కాంగ్రెస్‌, ఎన్‌పీపీ, ఎన్సీపీ, జేడీయూల నుంచి వాటికి గట్టి పోటీ ఎదురవుతోంది. మరోవైపు- మేఘాలయలో 369 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రాష్ట్రంలో 21.6 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వారికోసం 3,419 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. అధికార నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), ప్రతిపక్ష కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది.

35 మంది ఓటర్ల కోసం..

మేఘాలయలోని పలు ప్రాంతాల్లో అధికారులు తీవ్ర ఇబ్బందులను అధిగమించిమరీ పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. చాలాచోట్ల వారు వాగులు, నదులు, కొండలు, లోయలు దాటాల్సి వచ్చింది. గంటల కొద్దీ కాలినడకన వెళ్లక తప్పలేదు. అమ్లారెమ్‌ నియోజకవర్గ పరిధిలోని కామ్సింగ్‌ పోలింగ్‌ కేంద్రం పరిధిలో 35 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సిబ్బంది పడవ సాయంతో నదిని దాటి అక్కడికి చేరుకున్నారు.

నూతన జాతీయ విద్యా విధానం 2020 రాజ్యాంగ స్పూర్తి కి విరుద్దం.

•ప్రొ:చక్రధర్ రావు

నూతన జాతీయ విధ్యా విధానం 2020 భారత రాజ్యాంగ సమాఖ్య స్పూర్తి కి,భారత జీవన విధానాన్ని కి,బిన్న సంస్కృతులకు విరుద్దమని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్.కె.చక్రధర్ రావు అన్నారు.

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి అధ్వర్యంలో ఆదివారం నల్లగొండ పట్టణంలో ని టి.ఎన్.జి.ఓ భవన్ లో "నూతన జాతీయ విద్యా విధానం 2020" పై జిల్లా గౌరవాధ్యక్షులు ఆర్.విజయ్ కుమార్ అధ్యక్షత న జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సదస్సు కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొ:చక్రధర్ రావు మాట్లాడుతూ

నూతన జాతీయ విద్యా విధానం పై కేంద్రం కమిటిలు వేయడం,కమిటిలు ఇచ్చిన రిపోర్టు ను పక్కకు పెట్టడం,పార్లమెంట్ లో చర్చకు పెట్టకుండా క్యాబినెట్ ఆమోదించడం ఇదంతా ప్రజాస్వామ్య స్పూర్తి కి విరుద్దం అన్నారు.సెక్యులర్ విద్యను ప్రోత్సహించకుండా జ్యోతిష్యం,భగవద్గీత, కు సంబంధించిన మత మౌడ్య కోర్సులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంధన్నారు.కేంద్రం వేసిన కమిటీ లో విద్యా రంగానికి సంబంధించిన విద్యారంగ నిపుణులు లేరన్నారు.అంతా కేంద్ర ప్రభుత్వ అధికారుల బృంధమే ఉంధన్నారు.వారికి విధ్యా విధానాల పై అవగాహన లేదన్నారు.అలాంటి విధానాలు ఈ దేశ పరిస్థితులకు అనువైనవి కావన్నారు.

సామాన్యులకు అంధని ద్రాక్ష ఎన్.ఇ.పి ప్రొ:లక్ష్మినారాయణ

విద్య అనేది ఉమ్మడి జాబితా లోని అంశం..కాని రాష్ర్టాల ఆలోచనలను,యూనివర్సిటీ ప్రొఫెసర్ ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు.

రాష్ర్టాల అభిప్రాయాలను గాని పార్టీ ల అభిప్రాయాలను గాని,కనీసం చర్చ కోసం కూడా యూనివర్సిటీ లకు కూడా పంపలేదన్నారు.కేంద్ర క్యాబినెట్ ఆమోదించి అమలులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంధన్నారు.పాలకులు ప్రజల ఆకాంక్ష ల వెలుగులో విధానాలు రుపొందించకుండా..వారి ప్రయోజనాల కోసం రుపొందిస్తున్నారన్నారు. ఆరవ తరగతి నుండే వృత్తి విద్యల పేరుమీద కుండల తయారీ, వడ్రంగం,కుమ్మరి పని,తోట పని మొదలైన కుల వృత్తులను కోర్సులు గా పెట్టి ప్రాచీన మధ్యయుగ కాలం నాటి కుల వ్యవస్థ ను బలోపేతం చేయాలని చూస్తుంధన్నారు. డిగ్రీ 4 సంవత్సరాల కోర్సు చేయమని ఎవరు కోరలే డిమాండ్ చేయలే.ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లను తీసుకొచ్చి ఇక్కడి విద్యా వ్యవస్థను దెబ్బ తీయడం లో భాగమే నూతన జాతీయ విద్యా విధానమన్నారు.ఈ జాతీయ విద్యా విధానం తో ప్రైవేటికరణ,కార్పోరేటికరణ,కాషాయికరణ పెరిగిపోయి సామాన్య విద్యార్థుల కు విద్య అందని ద్రాక్ష గా మారే ప్రమాదం ఉంధన్నారు.

ఈ కార్యక్రమంలో డి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య,డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాస్కర్,తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య,మానవ హక్కుల వేదిక బాధ్యులు గోసుల మోహన్,విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు పి.వెంకులు,ప్రధాన కార్యదర్శి కె.రత్నయ్య,కస్తూరి ప్రభాకర్, యు.టి.ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు,కె.పర్వతాలు,జ్వాలా వెంకటేశ్వర్లు,ఇందూరి సాగర్,పందుల సైదులు,కొండేటి మురళి,తదితరులు పాల్గొన్నారు.

Congress Plenary: ప్రధాని మోదీ, అదానీ ఒక్కటే.. కాంగ్రెస్ ప్లీనరీలో రాహుల్ ఫైర్..

రాయ్‌పూర్‌: ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ ఒక్కటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల మూడో రోజు ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

అదానీకి, మోదీకి సంబంధమేంటని పార్లమెంటులో తాను ప్రశ్నలు సంధిస్తే ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులు ఆయనకు వత్తాసుపలికేలా మాట్లాడుతున్నారని రాహుల్ విమర్శించారు. అదానీ గురించి పార్లమెంటులో ప్రశ్నించవద్దని బీజేపీ నేతలు అంటున్నారని, కానీ వాస్తవం ప్రజలకు తెలిసే వరకు తానూ ఈ విషయంపై ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్ స్పష్టం చేశారు.

'భారత్‌ జోడో యాత్రలో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రజలు, రైతుల సమస్యలు దగ్గరుండి చూశా. కులం, మతం, వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచి జోడో యాత్రకు విశేష స్పందన లభించింది. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా ప్రజలు నాతోపాటు నడిచారు. ఈ యాత్ర నాకు పాఠాలు నేర్పింది. నాలుగు నెలల పాటు ఓ తపస్సులా ఈ యాత్ర సాగింది. కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపాము. కానీ బీజేపీ దాన్ని తీసుకెళ్లింది.' అని రాహుల్ వ్యాఖ్యానించారు..

Mahbubabad: నవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైలులో పొగలు..పరుగులు పెట్టిన ప్రయాణికులు..
మహబూబాబాద్: నవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైలు(Navajeevan Express train)కు పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చైన్నై(Ahmedabad to Chennai) వెళ్తున్ననవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైలులో నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.. అప్రమత్తమైన లోకో ఫైలట్(Loco Pilot) మహబూబాబాద్ స్టేషన్ల(Mahbubabad Stations)లోనే రైల్వే రైలును నిలిపివేశారు. బ్రేక్ లైనర్స్(Brake Liners) పట్టివేయడంతో పొగలు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైలు నుంచి దిగి పరుగులు పెట్టారు. రైలును నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
Jammu Kashmir: మరో కాశ్మీరీ పండిట్ హత్య.. కాల్చిచంపిన ఉగ్రవాదులు..

Kashmiri Pandit shot dead: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. గత కొంత కాలంగా అమాయకులను, మైనారిటీలను, వలస కూలీలు, హిందూ పండిట్లను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి..

హైబ్రీడ్ టెర్రరిజాన్ని అవలంభిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. ఇదిలా ఉంటే తాజాగా మరో కాశ్మీరీ పండింట్ ను కాల్చి చంపారు ఉగ్రవాదులు. పుల్వామా జిల్లాలో ఆదివారం కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సంజయ్ శర్మని ఉగ్రవాదులు కాల్చిచంపారని పోలీసులు వెల్లడించారు..

మృతుడు దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని అచన్ ప్రాంతంలో తన గ్రామంలో సాయుధ గార్డుగా పనిచేస్తున్నారు. సంజయ్ శర్మ స్థానికంగా ఉన్న మార్కెట్ కు వెళ్లిన క్రమంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.

గతేడాది రాహుల్ భట్ అనే వ్యక్తిని ప్రభుత్వ కార్యాలయంలోనే కాల్చి చంపారు. దీని తర్వాత హిందూ మహిళా టీచర్ ని, అమ్రీన్ భట్ అనే టీవీ ఆర్టిస్టును ఇలాగే కాల్చిచంపారు. ఈ ఘటనల కారణంగా కాశ్మీర్ లోయలో ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఘటనలకు పాల్పడిన టెర్రిస్టులను భద్రతా బలగాలు కాల్చిచంపాయి..

సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ద​గ్థం..

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చివ్వెంల మండలం దురాజ్ పల్లి వద్ద సాంకేతికంగా సమస్య రావడంతో రెండు బస్సులు హైవేపై నిలిచిపోయాయి..

అకస్మాత్తుగా ఓ బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి.

అంతలో పక్కన ఉన్న మరో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ బస్సు పూర్తిగా దగ్ధం కాగా, మరో బస్సు పాక్షికంగా దగ్ధమైంది. సకాలంలో స్పందించని ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.