నూతన జాతీయ విద్యా విధానం 2020 రాజ్యాంగ స్పూర్తి కి విరుద్దం.
•ప్రొ:చక్రధర్ రావు
నూతన జాతీయ విధ్యా విధానం 2020 భారత రాజ్యాంగ సమాఖ్య స్పూర్తి కి,భారత జీవన విధానాన్ని కి,బిన్న సంస్కృతులకు విరుద్దమని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్.కె.చక్రధర్ రావు అన్నారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి అధ్వర్యంలో ఆదివారం నల్లగొండ పట్టణంలో ని టి.ఎన్.జి.ఓ భవన్ లో "నూతన జాతీయ విద్యా విధానం 2020" పై జిల్లా గౌరవాధ్యక్షులు ఆర్.విజయ్ కుమార్ అధ్యక్షత న జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సదస్సు కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొ:చక్రధర్ రావు మాట్లాడుతూ
నూతన జాతీయ విద్యా విధానం పై కేంద్రం కమిటిలు వేయడం,కమిటిలు ఇచ్చిన రిపోర్టు ను పక్కకు పెట్టడం,పార్లమెంట్ లో చర్చకు పెట్టకుండా క్యాబినెట్ ఆమోదించడం ఇదంతా ప్రజాస్వామ్య స్పూర్తి కి విరుద్దం అన్నారు.సెక్యులర్ విద్యను ప్రోత్సహించకుండా జ్యోతిష్యం,భగవద్గీత, కు సంబంధించిన మత మౌడ్య కోర్సులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంధన్నారు.కేంద్రం వేసిన కమిటీ లో విద్యా రంగానికి సంబంధించిన విద్యారంగ నిపుణులు లేరన్నారు.అంతా కేంద్ర ప్రభుత్వ అధికారుల బృంధమే ఉంధన్నారు.వారికి విధ్యా విధానాల పై అవగాహన లేదన్నారు.అలాంటి విధానాలు ఈ దేశ పరిస్థితులకు అనువైనవి కావన్నారు.
సామాన్యులకు అంధని ద్రాక్ష ఎన్.ఇ.పి ప్రొ:లక్ష్మినారాయణ
విద్య అనేది ఉమ్మడి జాబితా లోని అంశం..కాని రాష్ర్టాల ఆలోచనలను,యూనివర్సిటీ ప్రొఫెసర్ ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు.
రాష్ర్టాల అభిప్రాయాలను గాని పార్టీ ల అభిప్రాయాలను గాని,కనీసం చర్చ కోసం కూడా యూనివర్సిటీ లకు కూడా పంపలేదన్నారు.కేంద్ర క్యాబినెట్ ఆమోదించి అమలులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంధన్నారు.పాలకులు ప్రజల ఆకాంక్ష ల వెలుగులో విధానాలు రుపొందించకుండా..వారి ప్రయోజనాల కోసం రుపొందిస్తున్నారన్నారు. ఆరవ తరగతి నుండే వృత్తి విద్యల పేరుమీద కుండల తయారీ, వడ్రంగం,కుమ్మరి పని,తోట పని మొదలైన కుల వృత్తులను కోర్సులు గా పెట్టి ప్రాచీన మధ్యయుగ కాలం నాటి కుల వ్యవస్థ ను బలోపేతం చేయాలని చూస్తుంధన్నారు. డిగ్రీ 4 సంవత్సరాల కోర్సు చేయమని ఎవరు కోరలే డిమాండ్ చేయలే.ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లను తీసుకొచ్చి ఇక్కడి విద్యా వ్యవస్థను దెబ్బ తీయడం లో భాగమే నూతన జాతీయ విద్యా విధానమన్నారు.ఈ జాతీయ విద్యా విధానం తో ప్రైవేటికరణ,కార్పోరేటికరణ,కాషాయికరణ పెరిగిపోయి సామాన్య విద్యార్థుల కు విద్య అందని ద్రాక్ష గా మారే ప్రమాదం ఉంధన్నారు.
ఈ కార్యక్రమంలో డి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య,డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాస్కర్,తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య,మానవ హక్కుల వేదిక బాధ్యులు గోసుల మోహన్,విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు పి.వెంకులు,ప్రధాన కార్యదర్శి కె.రత్నయ్య,కస్తూరి ప్రభాకర్, యు.టి.ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు,కె.పర్వతాలు,జ్వాలా వెంకటేశ్వర్లు,ఇందూరి సాగర్,పందుల సైదులు,కొండేటి మురళి,తదితరులు పాల్గొన్నారు.
Feb 27 2023, 13:16