Mahbubabad: నవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైలులో పొగలు..పరుగులు పెట్టిన ప్రయాణికులు..
మహబూబాబాద్: నవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైలు(Navajeevan Express train)కు పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చైన్నై(Ahmedabad to Chennai) వెళ్తున్ననవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైలులో నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.. అప్రమత్తమైన లోకో ఫైలట్(Loco Pilot) మహబూబాబాద్ స్టేషన్ల(Mahbubabad Stations)లోనే రైల్వే రైలును నిలిపివేశారు. బ్రేక్ లైనర్స్(Brake Liners) పట్టివేయడంతో పొగలు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైలు నుంచి దిగి పరుగులు పెట్టారు. రైలును నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
Jammu Kashmir: మరో కాశ్మీరీ పండిట్ హత్య.. కాల్చిచంపిన ఉగ్రవాదులు..

Kashmiri Pandit shot dead: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. గత కొంత కాలంగా అమాయకులను, మైనారిటీలను, వలస కూలీలు, హిందూ పండిట్లను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి..

హైబ్రీడ్ టెర్రరిజాన్ని అవలంభిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. ఇదిలా ఉంటే తాజాగా మరో కాశ్మీరీ పండింట్ ను కాల్చి చంపారు ఉగ్రవాదులు. పుల్వామా జిల్లాలో ఆదివారం కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సంజయ్ శర్మని ఉగ్రవాదులు కాల్చిచంపారని పోలీసులు వెల్లడించారు..

మృతుడు దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని అచన్ ప్రాంతంలో తన గ్రామంలో సాయుధ గార్డుగా పనిచేస్తున్నారు. సంజయ్ శర్మ స్థానికంగా ఉన్న మార్కెట్ కు వెళ్లిన క్రమంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.

గతేడాది రాహుల్ భట్ అనే వ్యక్తిని ప్రభుత్వ కార్యాలయంలోనే కాల్చి చంపారు. దీని తర్వాత హిందూ మహిళా టీచర్ ని, అమ్రీన్ భట్ అనే టీవీ ఆర్టిస్టును ఇలాగే కాల్చిచంపారు. ఈ ఘటనల కారణంగా కాశ్మీర్ లోయలో ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఘటనలకు పాల్పడిన టెర్రిస్టులను భద్రతా బలగాలు కాల్చిచంపాయి..

సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ద​గ్థం..

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చివ్వెంల మండలం దురాజ్ పల్లి వద్ద సాంకేతికంగా సమస్య రావడంతో రెండు బస్సులు హైవేపై నిలిచిపోయాయి..

అకస్మాత్తుగా ఓ బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి.

అంతలో పక్కన ఉన్న మరో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ బస్సు పూర్తిగా దగ్ధం కాగా, మరో బస్సు పాక్షికంగా దగ్ధమైంది. సకాలంలో స్పందించని ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.

Maoists Letter : యుద్ధ వాతావరణం తెచ్చిన ప్రభుత్వం.. కూలీలను అరెస్ట్ చేస్తున్నారు..

Maoists Letter : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. సుక్మా జిల్లాలోని జాగర్‌గూడ అటవీప్రాంతంలో శనివారం డీఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు..

కాల్పుల్లో ఓ ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారని, వీరి మృతదేహాలను తోటి నక్సలైట్లు అడవిలోకి తీసుకెళ్లారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ ప్రెస్ నోట్ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది..

జాగర్‌గూడ ప్రాంతంలో జరిగిన నక్సల్స్ దాడి పై బస్తర్ మొత్తాన్ని పోలీసు క్యాంపుగా ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు. నాలుగు నెలల్లో మొత్తం తొమ్మిది క్యాంపులు తెరిచి ఆ ప్రాంతంలో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారన్నారు.

అత్యాధునిక సైనిక హెలికాప్టర్లు, డ్రోన్లు, నిఘా విమానాల సహాయంతో ఆ ప్రాంతాన్ని పర్యావేక్షిస్తున్నారు. మినపా క్యాంపుతో సహా ఇతర పోలీస్ స్టేషన్లు, శిబిరాల్లో కాల్పులు, బాంబు దాడులకు రిహార్సల్ చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైమానిక దాడులను తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతున్నాయని ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు మిర్చి, కూలీ కోసం వెళ్తున్న కూలీలను కూడా మావోయిస్టు నేపథ్యంలో అరెస్టు చేస్తున్నారంటూ గంగ ఆరోపించారు..

సీనియర్లంతా ఒక్కటయ్యారమ్మా: ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లికి ప్రీతి ఫోన్‌

వరంగల్‌: వరంగల్‌ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆత్మహత్యకు యత్నించే ముందు ఆమె తన తల్లికి ఫోన్‌ చేసింది. ప్రీతి తన బాధను పంచుకుంది. ఈ ఫోన్‌ కాల్‌కి సంబంధించిన ఆడియో క్లిప్‌ బయటకు వచ్చింది.

‘‘సైఫ్‌ నాతో పాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లంతా ఒకటిగా ఉన్నారు. నాన్న పోలీసులతో ఫోన్‌ చేయించినా లాభం లేకుండా పోయింది. సైఫ్‌ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. నేను అతడిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒక్కటై నన్ను దూరం పెడతారు.

ఏదైనా ఉంటే తన దగ్గరికి రావాలి కానీ ప్రిన్సిపల్‌కి ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్‌వోడీ నాగార్జునరెడ్డి నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు’’ అని తల్లితో ప్రీతి పేర్కొంది. సైఫ్‌తో తాను మాట్లాడతానని.. ఇబ్బంది లేకుండా చేస్తానని తల్లి ఆమెతో చెప్పింది. అన్నిదారులూ మూసుకుపోవడంతోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ భవన్ కి తరలివెళ్లిన సిరిసిల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు...
ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారి అధ్యక్షతన ఇంటి ఇంటికి తెలుగుదేశం పార్టీ కిట్ల పంపిణీ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గ వర్గం నుండి నియోజకవర్గ బాద్యులు ఆవునూరి దయాకర్ రావు ఆధ్వర్యంలో అన్ని మండలాల అధ్యక్ష ప్రధానకార్యదర్శులు తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన అన్నారుఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తీగల శేఖర్ గౌడ్,మాలోత్ సూర్యనాయక్,నారాయణ గౌడ్,చెపూరి ప్రభాకర్,కడారి రాంరెడ్డి,పర్మాల మల్లేశం, MD ఆయూబ్ ఖాన్, TNSF నాయకులు మోతె రాజిరెడ్డి, శ్యాగ ప్రశాంత్, MD సల్మాన్, శనిగరం బాలరాజు, మాలోత్ హరిసింగ్ నాయక్ తదితరులు ఉన్నారు...
Convoy Attack: కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి..

కోల్‌కతా: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ (Nisith Pramanik) కాన్వాయ్‌పై పశ్చిమబెంగాల్‌ (West Bengal) లోని కూచ్ బెహర్ (Cooch Behar)లో శనివారంనాడు రాళ్ల దాడి జరిగింది.

ఈ దాడిలో కేంద్ర మంత్రి వాహనం అద్దాలు పగిలాయి. అల్లరిమూకను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. తన నియోజకవర్గమైన కూచ్ బెహర్‌లోని పార్టీ కార్యాలయానికి మంత్రి వెళ్తుండగా ఈ దాడి జరిగింది.

కాగా, తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్టు మంత్రి ప్రమాణిక్ ఆరోపించారు. ''ఒక మంత్రికే రక్షణ లేకుండా పోతే సామన్యుడి పరిస్థితి ఏమిటో ఆలోచించండి. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఎలా ఉందనే దానికి ఈ ఘటన అద్దం పడుతుంది'' ఆయన అన్నారు..

Sharmila: సంచలన నిర్ణయం తీసుకున్న షర్మిల.. వివేకా హత్య కేసులో సీబీఐ..

హైదరాబాద్:వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (YSR Telangana Party President YS Sharmila Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు..

త్వరలో అఖిలపక్షం నేతల (All party leaders)తో భారత రాష్ట్రపతి (President) వద్దకు వెళ్లాలని షర్మిల నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, అణచివేత చర్యలను ఎండగట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణలోని అన్ని పార్టీల నేతలకు వైఎస్ షర్మిల లేఖలు రాయనున్నారు.

తెలంగాణ (Telangana) లో శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఆరోపించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan)తో షర్మిల భేటీ అయి ర్యాగింగ్ అంశంపై చర్చించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ''తెలంగాణలో వాస్తవ పరిస్థితులను వివరించేందుకే గవర్నర్‌ను కలిశా. కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారు. దేశంలో భారత రాజ్యాంగం అమలులో ఉంటే తెలంగాణలో కేసీఆర్ (KCR) రాజ్యాంగం అమలు అవుతుంది. తెలంగాణలో ప్రతిపక్షాలకు స్థానం లేదు. ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనేది కేసీఆర్ ఉద్దేశం. బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో గూండాలు మాత్రమే ఉన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరా. వీధి కుక్కలు దాడి చేసి పసి ప్రాణాలు తీస్తే పట్టించుకునే దిక్కులేదు. తెలంగాణలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగాలను కేసీఆర్ గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రజల పక్షాన నేను నిలబడితే ఇష్టం వచ్చినట్లు నన్ను తిట్టారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇబ్బందులు పెడుతున్నారు. తొమ్మిది సంవత్సరాల్లో కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం వైఎస్‌ఆర్‌టీపీకి(YSRTP), ప్రతిపక్షాలకు లేదు. అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరుతున్నాం. ఇదే విషయంపై త్వరలో రాష్ట్రపతిని కలిసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరతాం.'' అని షర్మిల చెప్పుకొచ్చారు.

గవర్నర్‌తో సమావేశం అనంతరం... నిమ్స్‌(NIMS) లో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్థిని ప్రీతిని షర్మిల పరామర్శించనున్నారు. తెలంగాణలో ఎవరికీ భద్రత లేదన్నారు షర్మిల. ప్రీతి (Preethi) ఘటన అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై న్యాయవాదిని చంపారని గుర్తుచేశారు. ఇక వైఎస్. వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ (CBI) తన పని తాను చేయాలని కోరుతున్నామన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని షర్మిల తెలిపారు.

నిందితులను ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలి...

•వి.సి, రిజిస్ట్రార్ లను సస్పెండ్ చేయాలని డిమాండ్..

•జిల్లా ఎస్పీ కి వినతిపత్రం ఇవ్వడానికి వెలుతున్న క్రమంలో నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు..

హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లా పూర్ మెట్టు సమీపంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిటెక్ విద్యార్థి నవీన్ ను దారుణంగా హత్య చేసి శరీర భాగాలను వేరు చేసిన హరిహరను, కాకతీయ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నేతలు పాలడుగు నాగార్జున(కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి) పందుల సైదులు(విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు) బకరం శ్రీనివాస్(ఎం.ఎస్పి) డిమాండ్ చేశారు.

శనివారం నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో కాకతీయ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన సైఫ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిటెక్ విద్యార్థి నవీన్ ను ప్రేమ వ్యవహారంలో హత్య చేసిన హరిహర ల కిరాతకాలను నిరసిస్తూ ఐక్య విద్యార్థి యువజన సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది.అనంతరం జిల్లా ఎస్పీ ని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి నేతలు వెలుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.ఈ క్రమంలో నాయకుల ను అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్టేషన్ కు తరలించడం జ‌రిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ విద్యార్థిని సైఫ్ వెంటాడిన విధానం,వేధించిన వేధింపులు, బిటెక్ విద్యార్థి నవీన్ ను హత్య చేసిన విధానం అమానవీయంగా ఉన్నాయని ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టిన నిందితులను ఫాస్ట్రాక్ ఏర్పాటు చేసి 45 రోజుల లోపు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను సరిగ్గా శిక్షించకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని వారన్నారు.

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కి కొంతమంది విద్యార్థులు మత్తు పానీయాలను గంజాయి గుట్కాల ను సేవిస్తున్నా యూనివర్సిటీ విసీ కి గాని, రిజిస్టార్ కు గాని పట్టింపు లేదన్నారు. మహాత్మగాంధీ యూనివర్సిటీలో హాస్టళ్లకు బాధ్యత వహిస్తున్న వార్డెన్స్ ఏనాడు కూడా ఇలాంటి విద్యార్థులను నియంత్రించిన దాఖలాలు లేవన్నారు.

యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులపై యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులపై అధ్యాపకులు వేధింపులకు పాల్పడినా విద్యార్థినిలపై విద్యార్థులు ఆకృత్యాలకు పాల్పడినా వీసీకి రిజిస్టార్లకు ఫిర్యాదులు చేసినా ఏనాడూ చర్యలు తీసుకోలేదు అన్నారు. యూనివర్సిటీ విసీ రిజిస్టార్ల నిర్లక్ష్యమే నేడు నవీన్ బలయ్యాడని వారన్నారు. కాకతీయ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం ప్రీతి ఆత్మహత్యకు కారణం అయిందన్నారు.దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు ప్రేమోన్మాదుల అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ప్రభుత్వాలు ఈ ఉన్మాదులను కట్టడి చేయడంలో విఫలమయ్యాయని వారన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరి సాగర్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్,టి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, మాల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా వినయ్,కెవిపిఎస్ జిల్లా సహయ కార్యదర్శి గాదే నర్సింహ్మ,బొల్లు రవీందర్, కొంపల్లి రాము,బొల్లెపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు.

Sonia Gandhi: దేశంలో విద్వేషాలు రగిలిస్తున్నారు.. భాజపాపై సోనియా విమర్శలు

రాయ్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌): కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై (BJP) కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) విమర్శలు గుప్పించారు..

దేశంలో ఆ పార్టీ విద్వేషాలను రగిలిస్తోందని దుయ్యబట్టారు. దేశంలో మైనారిటీలు, మహిళలు, దళితులే, గిరిజనులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు రాయ్‌పూర్‌లో జరుగుతున్న పార్టీ 85వ ప్లీనరీలో (Congress plenary) ఆమె మాట్లాడారు.

కొంతమంది వ్యాపారుల కోసం ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతోందని సోనియా విమర్శించారు. పరోక్షంగా అదానీ వ్యవహారాన్ని ఉద్దేశించి ఈ విమర్శలు చేశారు. ప్రధాని మోదీ, భాజపా దేశంలోని వ్యవస్థల్ని గుప్పిట పెట్టుకున్నాయని విమర్శించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భాజపా ఓటమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భాజపా పాలనను సమర్థంగా ఎదుర్కోవాలంటే.పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. భారత్‌ జోడో యాత్రతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడం సంతోషంగా ఉందని చెప్పారు.

పార్టీ రాజ్యాంగానికి సవరణ..

కాంగ్రెస్‌ తన పార్టీ విధానాలకు ప్లీనరీలో సవరణ చేసింది. పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి అయిన సీడబ్ల్యూసీలో వివిధ స్థాయిల కమిటీల్లో 50% స్థానాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళ, మైనార్టీ, యువతకు కేటాయించేలా సవరణ చేశారు. అలాగే సీడబ్ల్యూసీ సంఖ్యను సైతం ప్రస్తుతం ఉన్న 25 నుంచి 35కి పెంచారు. కమిటీలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ప్రధానులు, మాజీ అధ్యక్షులకు సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వం కల్పించేలా మరో సవరణ సైతం చేశారు. దీనివల్ల మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వం దక్కనుంది.