Sonia Gandhi: దేశంలో విద్వేషాలు రగిలిస్తున్నారు.. భాజపాపై సోనియా విమర్శలు

రాయ్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌): కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై (BJP) కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) విమర్శలు గుప్పించారు..

దేశంలో ఆ పార్టీ విద్వేషాలను రగిలిస్తోందని దుయ్యబట్టారు. దేశంలో మైనారిటీలు, మహిళలు, దళితులే, గిరిజనులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు రాయ్‌పూర్‌లో జరుగుతున్న పార్టీ 85వ ప్లీనరీలో (Congress plenary) ఆమె మాట్లాడారు.

కొంతమంది వ్యాపారుల కోసం ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతోందని సోనియా విమర్శించారు. పరోక్షంగా అదానీ వ్యవహారాన్ని ఉద్దేశించి ఈ విమర్శలు చేశారు. ప్రధాని మోదీ, భాజపా దేశంలోని వ్యవస్థల్ని గుప్పిట పెట్టుకున్నాయని విమర్శించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భాజపా ఓటమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భాజపా పాలనను సమర్థంగా ఎదుర్కోవాలంటే.పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. భారత్‌ జోడో యాత్రతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడం సంతోషంగా ఉందని చెప్పారు.

పార్టీ రాజ్యాంగానికి సవరణ..

కాంగ్రెస్‌ తన పార్టీ విధానాలకు ప్లీనరీలో సవరణ చేసింది. పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి అయిన సీడబ్ల్యూసీలో వివిధ స్థాయిల కమిటీల్లో 50% స్థానాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళ, మైనార్టీ, యువతకు కేటాయించేలా సవరణ చేశారు. అలాగే సీడబ్ల్యూసీ సంఖ్యను సైతం ప్రస్తుతం ఉన్న 25 నుంచి 35కి పెంచారు. కమిటీలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ప్రధానులు, మాజీ అధ్యక్షులకు సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వం కల్పించేలా మరో సవరణ సైతం చేశారు. దీనివల్ల మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వం దక్కనుంది.

Andhra News: అదానీ కంపెనీలకు జగన్‌ సర్కార్‌ కట్టబెట్టిన ఆస్తులెన్ని?: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

అమరావతి: ఏపీలో అదానీ కంపెనీలకు కట్టబెట్టిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

దేశమంతా హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చ జరుగుతుంటే.. అదానీ కంపెనీలతో లాలూచీ పడి హడావుడిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై వందలాది ఎకరాలను ఆ సంస్థకు కట్టబెట్టడం దారుణమన్నారు. దీనికి వెనుకనున్న మతలబేంటో సీఎం జగన్‌ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడానికి సీఎం జగన్‌ రాష్ట్రంలోని ఆస్తులన్నింటినీ అదానీ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కూడా అదానీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న డెయిరీలను కాదని గుజరాత్‌కు చెందిన అమూల్‌ డెయిరీని ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. గుజరాత్‌ పెట్టుబడిదారులకు, అదానీతో సీఎం జగన్‌కు ఉన్న లింక్‌ ఏమిటో సమగ్రంగా చర్చ జరగాలన్నారు.

ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన

ఢిల్లీ: ఏపీ నూతన గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్‌ జస్టిrస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖులతో గవర్నర్‌ సమావేశం కానున్నారు..

ఈ మేరకు ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో గవర్నర్‌ నజీర్‌ సమావేశమయ్యారు. సాయంత్రం గం. 6.15 ని.లకు ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ను కలవనున్నారు.

రేపు(ఆదివారం) మధ్యాహ్నం గం. 12.30ని.లకు ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్‌ నజీర్‌ సమావేశమవుతారు. అనంతరం రేపు సాయంత్రం గం. 630 ని.లకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో నజీర్‌ భేటీ కానున్నారు.

చత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు , జవాన్లు మధ్య ఎదురు కాల్పులు

•ముగ్గురు డిఆర్ జి జవాన్లు మృతి

సుక్మాకు చెందిన జగర్గుండా నుండి డిఆర్‌జి పార్టీ -రావేజ్డ్ మావోయిస్టులు కూంబింగ్ కు వెళ్ళగా పోలీసు పార్టీ మావోయిస్టుల మధ్య జాగ్ర్గుండ మరియు కుండ్డ్ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్...

ముగ్గురు DRG జవాన్లు మృతి...

01) ఆసి రామురామ్ నాగ్

02) అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజామ్ జోగా

03) సైనిక్ వాన్‌జామ్ భెమా...గా గుర్తింపు

Maharashtra: 70 కి.మీ. ప్రయాణించి 512 కిలోల ఉల్లి అమ్మితే.. మొత్తంగా రూ.2 వచ్చాయి

Maharashtra: ఉల్లిపండించిన రైతుకు కన్నీళ్లు మిగిలాయి. ఆరుగాలం చెమటోడ్చి పండించిన 512 కిలోల ఉల్లిని అమ్మకానికని 70 కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ మార్కెట్‭కు తీసుకెళ్తే కేవలం రెండు రూపాయల (రూ.2) ఆదాయం వచ్చింది..

రశీదు రాసి రెండు రూపాయల చెక్కు ఆ రైతు చేతిలో పెట్టాడు వ్యవసాయ మార్కెట్‭లోని వ్యాపారి. చెక్కు చేతిలో పడ్డాక ఆ రైతు చేతులు తెలియకుండానే తలమీదకు వెళ్లాయి. అతి నిరాశను బాధను చెప్పుకుంటూ దు:ఖమయమయ్యాడు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా బోర్గావ్ గ్రామానికి చెందిన తుకారాం చవాన్ అనే రైతు వ్యధ ఇది..

ఏపీఎంసీ వద్ద కిలో ఉల్లి ఒక్క రూపాయి పలికింది. ఈ లెక్కన తుకారాం 512 కిలోల ఉల్లికి 512 రూపాయలు వచ్చాయి. అయితే ఇందులో ఏపీఎంసీ వ్యాపారి రవాణా ఛార్జీలు, హెడ్‌లోడింగ్ ఛార్జీలు 509.50 అయ్యాయి. ఇక నికర లాభం 2.49 రూపాయల చెక్ వచ్చింది. అయితే ఇందులో కూడా తుకారాంకు నష్టం తప్పలేదు. బ్యాంక్ లావాదేవీ రౌండ్ ఫిగర్‌లో జరుగుతాయి కాబట్టి. తుకారానికి మిగిలేది కేవలం 2 రూపాయలే. పోయిన ఏడాది ఉల్లికి తాను కిలోకి 20 రూపాయల చొప్పున అమ్మినట్లు తుకారాం తెలిపాడు..

కేసులుంటే స్వీపర్‌ కొలువూ రాదు..కానీ మంత్రులు కావొచ్చు

నేరాభియోగాలున్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి

సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : అవినీతికి సామాన్య మానవుడు బలవుతున్నాడని, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అవినీతిని రూపుమాపాలంటే అన్నిస్థాయుల్లో జవాబుదారీతనాన్ని తేవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

క్రిమినల్‌ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) విచారణ సందర్భంగా జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్న ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

పిల్‌ను దాఖలు చేసిన న్యాయవాది అశ్విన్‌ ఉపాధ్యాయ్‌ తన వాదనలు వినిపిస్తూ ‘‘వేధింపులు, హత్య, అపహరణ లాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తి ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్‌ లేదా పోలీస్‌ కానిస్టేబుల్‌ కూడా కాలేడు. కానీ అవే నేరాలు చేసిన వ్యక్తి మాత్రం మంత్రి కావొచ్చు’’ అని పేర్కొన్నారు. ఈ పిల్‌పై స్పందన తెలపాల్సిందిగా కేంద్రం, ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

జడ్చర్లలో ఘోరం..!
మాటలకందని సభ్య సమాజం తలదించుకునే జైనుల్లబుద్దీన్ బాబా లైంగిక అమాయక హిందూ స్త్రీలే లక్ష్యంగా దుర్మార్గపు స్త్రీల పుట్టుమచ్చల ఆధారంగా జాతకాలు చూస్తామంటూ యువతుల నగ్న (న్యూడ్) వీడియోలు..!!

నగ్నంగా స్త్రీ పూజ చేస్తే సొమ్ములు, కానుకలు కదలి వస్తాయి.

పూజ చేసే సమయంలో ఫోటోలు, వీడియోలు తీసినా డిస్టర్బ్ చేయరాదు.. పూజలో లీనమైపోవాలి.!

అంతకుమించి కనకవర్షం కురియాలంటే హైదరాబాదులోని మా గురువు దగ్గర ఓ రోజు నగ్నంగా గడిపితే చాలు.. కాసుల వర్షం, కనక వర్షం కురుస్తుంది!

అయితే, ఓ షరతు..!! గురువు గారితో గడిపే సమయంలో కించిత్ వేరే భావన మదిలో మెదలకూడదు. పరాయి వారితో గడుపుతున్నామనే భావన ఒక సెకండ్ సమయం కూడా ఆలోచించకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో వస్తే.. ఇక అంతే, ధారగా కురిసే కనకవర్షం మధ్యలో ఆగిపోతుంది. ఇక మీ అదృష్టం మరుగున పడి దురదృష్టం ఆవహిస్తుంది.. ఫోటోలు, వీడియోలు తీసినా ఏమీ అనవద్దు.. ఒకవేళ ఏమైనా అంటే ఇక అంతే, మీకు రావాల్సిన అదృష్టం మాయమైపోతుంది.

ఇదంతా వినడానికి విడ్డూరంగా ఉంది కదూ.. కానీ ఇది అక్షరాల సత్యం. ఇది ఎక్కడో మారుమూల అడవి ప్రాంతంలో జనజీవనం లేని నిర్జీవ ప్రాంతంలోని సంఘటన కాదు..అత్యంత రద్దీప్రాంతమైన బెంగళూరు హైవేను అనుకొని.. అనుసంధానం చేసుకొని ఉన్న ఖరీదైన జడ్చర్ల పట్టణంలోనిది ఈ ఘటన. మరో విచిత్రం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, అటు కర్ణాటక రాష్ట్రం లోని మహిళలు కూడా ఇక్కడ రావడం విశేషం. హిందూ మహిళలకు మాత్రమే జైనుల్లబుద్దీన్ బాబా గారు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. దీంతో జడ్చర్ల లో ఈ బాబా దగ్గరికి క్యూ కడుతున్నారు మహిళలు. రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో( 60 కిలోమీటర్ల దూరంలో) ఉన్న జడ్చర్ల పట్టణంలో మహిళలకు మాయ మాటలు చెప్పి జైనుల్లబుద్దీన్ నగ్న పూజలు చేస్తున్నాడు. చిత్ర విచిత్రంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నాడు. ఆ ఫోటోల ఆధారంగా మహిళలను బ్లాక్ మెయిల్ చేసి రకరకాల రూపంలో వాడుకుంటున్నాడు. డబ్బులు గుంజుతున్నాడు. ఈ విషయం బయటపడితే పరువు పోతుందని.. డబ్బుకు ఆశపడి నగ్నంగా పూజ చేయించుకున్న వందలాది మంది బాధితులు తమ బాధను లో లోపలే దిగమింగుతున్నారు. "చెప్పుకుంటే పరువు పోతుంది.. చెప్పకపోతే ప్రాణం పోతుంది" అన్నట్టు మహిళల బాధ అంతా ఇంతా కాదు. చివరకు ఒకరిద్దరు మహిళలు ధైర్యం చేసి ఈ బాబా నగ్న పూజల ముసుగును తొలగించారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బాబా నగ్న పూజలను, రాసలీలలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంత జరుగుతున్నా ఈ లోకంలో ఏ మీడియా గానీ మిగతా పెద్దలు గాని తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం మరో విశేషం.

ముఖ్యంగా ఈ విషయంపై రాష్ట్ర మహిళా కమిషన్ మరియు జాతీయ మహిళా కమిషన్, ఇతర మహిళా సంఘాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మహిళ కమిషన్ దృష్టికి రాకపోవడం గమనార్హం.!

నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలి

మహిళలకు మాయ మాటలు చెప్పి లైంగికంగా హింసకు గురిచేసిన బాబా జైనుల్లాబుద్దీన్, అతని అనుచరులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ళకు తలగ్గి పోలీసులు నామ మాత్రం కేసులు నమోదు చేస్తే ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు.

…….FULL DEATILS….

జాతకాలు మారుస్తామంటూ..

– న్యూడ్‌ ఫొటోలు సేకరించిన ముఠాæ

– ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో ఆగడాలు

– మాయమాటలతో అమాయక ప్రజలకు వల

– జడ్చర్ల పోలీసుల అదుపులో ఇద్దరు..

– మరో ఇద్దరి కోసం గాలింపు

: ‘మీ జాతకాలు చూస్తాం.. హస్తరేఖలు, పుట్టుమచ్చలు, ఇతర మరకల ఆధారంగా ఉన్నది ఉన్నట్లు చెబుతాం.. మీరు కోరినట్లుగా జాతకం మారుస్తాం.. ఆ తర్వాత మీరు అనుకున్నది జరుగుద్ది.. కనకవర్షం కురిపిస్తాం’ అంటూ అమాయక మహిళలకు పలువురు మాయమాటలు చెప్పి న్యూడ్‌ ఫొటోలు సేకరించారు. ఈఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో వెలుగు చూడగా.. తవ్విన కొద్దీ వారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసులు ఈ ముఠాలో ఓ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు మరో ఇద్దరి పేర్లు వెలుగులోకి రాగా.. వారి కోసం గాలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో..

జాతకాలు మారుస్తామంటూ పలువురు సుమారు మూడు నెలల క్రితం తమతమ స్థానిక ప్రాంతాల్లో జ్యోతిష్య కేంద్రాలు పెట్టుకున్నారు. ఇలా మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని కోడుపర్తి, హైదరాబాద్, వికారాబాద్‌ జిల్లా ఆమన్‌గల్‌లో ఎవరి ఇళ్ల వద్ద వారు కార్యకలాపాలు ప్రారంభించారు. తమ దగ్గరికి వస్తే మంచి జరుగుతుందంటూ తెలిసిన వారి నుంచి విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రధానంగా పూలు, పండ్లు, కూరగాయలు విక్రయించే అమాయక మహిళలకు వల వేశారు. ఇలా పురుషులు సైతం చాలా మంది వారికి చిక్కినట్లు సమాచారం. శరీరంపై పుట్టుమచ్చలను తాము స్వయంగా చూసి గుర్తిస్తేనే జాతకం పక్కాగా ఉంటుందని చెప్పారు. ఫోటోలను పైకి పంపిస్తామని.. అక్కడ అమ్మవారికి పూజలు చేస్తారని.. మీకు అమ్మవారి పూనకం వస్తుందని.. ఆతర్వాత కనక వర్షం కురుస్తుందని.. అప్పుడే మాకు కొంత ముట్టాజెప్పాలని నమ్మబలికారు. అలా ఒక్కొక్కరి వద్ద న్యూడ్‌ ఫొటోలను సేకరించినట్లు సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన క్రమంలోనేనా..

జాతకం పేరిట అమాయక ప్రజలను తమ వద్దకు మూడు పర్యాయాలు రప్పించుకుని.. న్యూడ్‌ఫొటోలు సేకరించిన అక్రమార్కులు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన క్రమంలో వారి బాగోతం బట్టబయలైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకరు ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. దీని ఆధారంగా విచారించిన ఖాకీలు జైనొద్దిన్ రాములు అనే వ్యక్తులను ఓ పౌల్ట్రీ ఫామ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని విచారించిన క్రమంలో తిరుపతి, శంకర్‌ పేర్లు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వారిని పట్టుకునేందుకు ఓ పోలీస్‌ బృందాన్ని కేటాయించినట్లు వినికిడి. దీనిపై పోలీస్‌ అధికారులను సంప్రదించగా.. ‘విచారణ జరుగుతోంది.. పూర్తయిన తర్వాత వెల్లడిస్తాం’ అని ముక్తసరిగా సమాధానమిచ్చారు.

ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేస్తారు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అంతే కాకుండా ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేసే రోజులు వస్తాయని ప్రముఖ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ఆర్కా ల్యాబ్‌ సీఈవో గాయత్రి తెలిపారు.

ఇకపై శరీరానికి సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా వ్యాధి ఎంటో నిర్ధారణ చేయవచ్చన్నారు. ఇలాంటి ఇకపైనూతన టెక్నాలజీ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్‌ స్క్రీనింగ్‌ డివైజ్‌ పరికరంతో రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను సులువుగా గుర్తించవచ్చని సీఈవో గాయత్రి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డివైజ్‌ తయారీ, వీటి వినియోగానికి అవసరమైన సాంకేతికతను బెంగళూరు కేంద్రంగా అందిస్తున్నట్టు చెప్పారు.

నిల్చున్న చోటే ముఖ కదలికలను కెమెరా రికార్డు చేసి వాటిని ఎనలైజ్‌ చేసేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ సాయంతో బీపీ, షుగర్‌, గుండె సంబంధిత వ్యాధులను గుర్తించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్‌తోపాటు మరికొన్ని సెంటర్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు క్లినిక్‌ల ద్వారా ఈ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 4వేల మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా వైద్య పరీక్షలు చేయగా 91 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నూతన డివైజ్‌ ద్వారా రూ.100-150 లోపే హెల్త్‌ రిపోర్టు పొందవచ్చని ఆమె తెలిపారు.

CM Jagan: విద్యుత్‌ కోతలనే మాటే వినిపించకూడదు: అధికారులకు సీఎం ఆదేశం

అమరావతి: వేసవిలో విద్యుత్‌ కొరత లేకుండా చూడాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారు. విద్యుత్‌ కొరత వల్ల కోతలనే మాట వినిపించకూడదని అధికారులకు సూచించారు..

కరెంట్‌ కోతలు లేకుండా అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలన్నారు. విద్యుత్‌ శాఖపై సీఎం జగన్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వేసవిలో విద్యుత్‌ డిమాండ్, రైతులకు కనెక్షన్లపై సమీక్షించిన సీఎం.. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

బొగ్గు నిల్వలపైనా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో జాప్యం ఉండకూడదని.. దరఖాస్తు చేసిన నెలలోనే కనెక్షన్‌ ఇవ్వాలని ఆదేశించారు. మార్చి నాటికి మరో 20వేల విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తవుతోందని తెలిపారు.

Ts Raj Bhavan: పూలదండ ఆరోపణలపై తెలంగాణ రాజ్‌భవన్‌ క్లారిటీ

హైదరాబాద్‌: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ పూలదండతో వచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని రాజ్ భవన్ తీవ్రంగా ఖండించింది.

ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడిలో సమర్పించడానికి కారులో పూల దండ ఉంచామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్‌భవన్‌ నుంచి ప్రకటన వెలువడింది.

''గవర్నర్ వేరే ప్రదేశాల నుంచి రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చేటప్పుడు ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడికి వెళ్లి రావడం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయాన్ని దుష్ప్రచారం చేస్తూ విపరీత అర్థాలు తీయడం సహేతుకం కాదు. అలాగే ప్రీతి త్వరగా కోలుకోవాలని హనుమంతుడి గుడిలో గవర్నర్ ప్రార్థించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు సమగ్రంగా దర్యాప్తు జరిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నర్ నిమ్స్ పర్యటనను సరైన దృష్టితో అర్థం చేసుకోవాలి'' అని ప్రకటనలో పేర్కొంది.