ప్రజా గోస బిజెపి బరోసా కార్యక్రమం లో బాగంగా బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం
•ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చిట్యాల మాజీ జెడ్పిటిసి, చిట్యాల మున్సిపాలిటీ ఒకటవ వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామం మరియు ఎలికట్టే గ్రామాల్లో నిన్న రాత్రి జరిగిన ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమం బిజెపి నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యులు శక్తి కేంద్రం ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చిట్యాల మాజీ జెడ్పిటిసి చిట్యాల మున్సిపాలిటీ ఒకటవ వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఉరుమడ్ల గ్రామ బిజెపి నాయకులు బిజెపి భరోసా కార్యక్రమానికి విచ్చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారిని శాలువాతో సన్మానించి పెద్ద ఎత్తున మహిళలు యువకులు కోలాటాలతో బిజెపి నినాదాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఉరుమడ్ల గ్రామంలో భారీ ర్యాలీ తీసి సభా వేదికకు చేరుకొని బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్ గారు గ్రామదేవతలైన ముత్యాలమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి బిజెపి భరోసా కార్యక్రమాన్ని శక్తి కేంద్రం ఇంచార్జ్ నర్ర మాధవి గోపాల్ రెడ్డి గారు ప్రారంభించారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి రవీందర్ గారు మాట్లాడుతూ ఉరుమడ్ల గ్రామ మహిళల యువకుల ఉత్సాహం చూసి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కేసీఆర్ 9 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తాగుబోతు రాష్ట్రంగా మార్చాడన్నారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి తగిన మూల్యం తప్పదన్నారు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని తెలియజేశారు.
దళిత ముఖ్యమంత్రి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, లక్ష రూపాయల రుణమాఫీ, కేజీ టు పీజీ విద్య, యాదవులకు గొర్రెలు, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని బిసి సొసైటీలు ఫెడరేషన్లు అన్ని సంఘాలను నిర్వీర్యం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల ద్వారా గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వీధిలైట్లు, రోడ్లు, మరుగుదొడ్లు, పల్లె పకృతి వనాలు, రైతు వేదికలు, స్మశానవాటికలు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, సుకన్య సమృద్ధి యోజన, ఫసల్ బీమా యోజన, ఇలా 350 పైగా కేంద్ర ప్రభుత్వ పథకాలను నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు.
అన్ని విధాల సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వెచ్చించి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలంగాణ ప్రజలకు కరోనా కష్టకాలం నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నారని అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఉచితంగా కరోనా మూడు దఫాలుగా టీకాలు వేయించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ఐదు లక్షల వరకు మనం ఏ ఆసుపత్రికి వెళ్లిన ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చని తెలియజేశారు.
కేంద్రం నుంచి సరాసరి మన గ్రామాలకు అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం 1250 రూపాయలు ఒక్కరికి చొప్పున గ్రామపంచాయతీకి కేంద్ర ప్రభుత్వo నిధులు కేటాయిస్తుందన్నారు. ఉరుమడ్ల గ్రామపంచాయతీకి 20 లక్షల నుండి 25 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ నిధులు కేటాయించబడతాయని తెలియజేశారు. ఎలికట్టే గ్రామంలో బిజెపి నాయకులు బూత్ కమిటీ అధ్యక్షులు పులుగు శ్రీనివాస్ గుడిపాటి సందీప్ చర్లపల్లి లింగస్వామి పామనగుండ్ల వెంకన్న ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్ గారికి శాలువాతో సన్మానించి మహిళలు కోలాటాలతో భారీ స్వాగతం పలికారు. ఎలికట్టె గ్రామ నూతన బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. గ్రామస్తులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమానికి శక్తి కేంద్రం ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు అధ్యక్షతన సమావేశాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రవీందర్ గారు మాట్లాడుతూ ఎలికట్టే గ్రామంలో దళితులకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు దళిత బంధు మన గ్రామాల్లో ఎందుకు ప్రవేశ పెట్టలేదు దళితులను మోసం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దతించడమే లక్ష్యంగా మనందరం కలిసికట్టుగా పనిచేసి భారతీయ జనతా పార్టీని బలపరిచి రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాల పైన సవివరంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన మోసాల గురించి ప్రజలకు వివరంగా బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నకరేకల్ అసెంబ్లీ కన్వీనర్ మైల నరసింహ, మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు సుంకరి మల్లేష్ గౌడ్, ఈదుల పవన్ చింతకాయల రాము, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, ఎస్సీ మోర్చ నకిరేకల్ కన్వీనర్ కోరబోయిన లింగస్వామి, ఓబీసీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గరిసె రవికాంత్, గంజి గోవర్ధన్, సీనియర్ నాయకులు ఉయ్యాల లింగస్వామి, యువజన నాయకులు పాకల దినేష్, మాజీ వార్డు సభ్యులు రూపాని నరసింహ, పాలకూరి వెంకన్న జగన్ పవన్ వెంకటేష్, అర్జున్, మచ్చ గిరి సైదులు నరసింహ వెంకన్న భిక్షమయ్య అంజయ్య కిష్టయ్య బజారు వెంకటేష్, శ్రీశైలం నాగేష్ మహేష్ సురేష్ శివ రాంబాబు లింగస్వామి రమేష్ సందీప్ సాయి మరియు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
Feb 24 2023, 19:56