Chandrababu: వివేకాది ముమ్మాటికీ అంతఃపుర హత్యే: చంద్రబాబు

ఏలూరు: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని భయంకరంగా హత్య చేసి.. ఆ విషయాన్ని దాచిపెట్టేందుకు అనేక కుట్రలు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు.వివేకా హత్యకు ముందు, తర్వాత ఏం జరిగిందో సీబీఐ దర్యాప్తులో అన్నీ బయటకు వచ్చాయన్నారు. ఏలూరులో నిర్వహించిన తెదేపా జోన్‌-2 సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

''హత్యకు ముందు ఎంపీ అవినాష్‌ ఇంట్లో కుట్ర జరిగినట్లు దర్యాప్తులో తేలింది. రాజకీయాలకు అడ్డు వస్తున్నారనే వివేకాను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినా ఎంపీ అవినాష్‌.. అమాయకుడని వైకాపా నేతలు చెబుతున్నారు. వివేకా ఎలా చనిపోయారో తెలియాలని.. అందుకోసం కచ్చితంగా శవపరీక్ష చేయాల్సిందేనని ఆనాడు ఆయన కుమార్తె సునీత పట్టుబట్టింది.

తండ్రి హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఆమె.. పోరాడి కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకున్నారు. అయితే, వివేకా హత్యను తెదేపా నేతలపై నెట్టేందుకు ప్రయత్నించారు.వివేకా హత్యతో అవినాష్‌కు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. వివేకా హత్యకు ముందు అవినాష్‌ ఇంట్లో అందరూ కూర్చున్నారు. హత్య తర్వాత లోటస్‌ పాండ్‌కు ఫోన్‌ వెళ్లింది. ఇవన్నీ చూస్తుంటే.. వివేకాది ముమ్మాటికీ అంతఃపుర హత్యే'' అని చంద్రబాబు పేర్కొన్నారు.

''వైకాపా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం పూర్తిగా విఫలమైంది. ఒంగోలులో తెదేపా నిర్వహించిన 'మహానాడు'కు ఎన్ని ఆటంకాలు కలిగించినా విజయవంతమైంది. ఇటీవల అనపర్తి వెళ్లకుండా అనేక ఇబ్బందులు పెట్టారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి మరీ అడ్డుకున్నారు. అనపర్తి సభ మనలో స్ఫూర్తి రగిలించింది. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కందుకూరు తొక్కిసలాటను అడ్డంపెట్టుకొని జీవో.నం.1 తీసుకొచ్చారు. జగ్గంపేట, పెద్దాపురం సభలకు జనం భారీగా వచ్చారు. ప్రజల స్పందన చూసి అనపర్తి సభను అడ్డుకున్నారు. కార్యకర్తలే మా బలం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపాదే విజయం'' అని చంద్రబాబు వెల్లడించారు..

చంద్రబాబుకు బాలకృష్ణ పూనినట్లున్నాడు: కొడాలి నాని సెటైరికల్‌ పంచ్‌

తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును పిచ్చి ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

కాగా, కొడాలి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం ‍ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేశాడు. మీ అంతు తేలుస్తానంటూ చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబును జైల్లోగానీ, పిచ్చాసుపత్రిలోగానీ పెట్టాలి. చంద్రబాబు ఛాలెంజ్‌లకు భయపడేవారు ఎవరూ లేరు. నారా లోకేష్‌ పిచ్చి కూతలు కూస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.

నారా లోకేష్‌ బ్రెయిన్‌లెస్‌ కిడ్‌. రాజ్యాంగం గురించి లోకేష్‌కు ఏం తెలుసు?. చంద్రబాబు ముందు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.తర్వాత బ్లాక్‌ క్యాట్‌ కమెండోలను వదులుకోవాలి. అప్పుడు చంద్రబాబు ఛాలెంజ్‌లు చేయాలి. చంద్రబాబుకు బాలకృష్ణ పూనినట్లున్నాడు. సీఎం జగన్‌పై చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. లోకేష్‌ తన పిచ్చి వాగుడుని చంద్రబాబుకు అంటించినట్టున్నాడు. రాజ్యాంగం ముసుగులో చంద్రబాబు పిచ్చివాగుడు వాగుతున్నాడు. చంద్రబాబుతో ప్రజలకు ఇబ్బంది. పోలీసులను కించపరుస్తూ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. పట్టాభిని గన్నవరం పంపింది చంద్రబాబే. గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై చిన్న గీత కూడా పడలేదు' అని పేర్కొన్నారు.

ప్రజా గోస బిజెపి బరోసా కార్యక్రమం లో బాగంగా బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం

•ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చిట్యాల మాజీ జెడ్పిటిసి, చిట్యాల మున్సిపాలిటీ ఒకటవ వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామం మరియు ఎలికట్టే గ్రామాల్లో నిన్న రాత్రి జరిగిన ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమం బిజెపి నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యులు శక్తి కేంద్రం ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చిట్యాల మాజీ జెడ్పిటిసి చిట్యాల మున్సిపాలిటీ ఒకటవ వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఉరుమడ్ల గ్రామ బిజెపి నాయకులు బిజెపి భరోసా కార్యక్రమానికి విచ్చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారిని శాలువాతో సన్మానించి పెద్ద ఎత్తున మహిళలు యువకులు కోలాటాలతో బిజెపి నినాదాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఉరుమడ్ల గ్రామంలో భారీ ర్యాలీ తీసి సభా వేదికకు చేరుకొని బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్ గారు గ్రామదేవతలైన ముత్యాలమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి బిజెపి భరోసా కార్యక్రమాన్ని శక్తి కేంద్రం ఇంచార్జ్ నర్ర మాధవి గోపాల్ రెడ్డి గారు ప్రారంభించారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి రవీందర్ గారు మాట్లాడుతూ ఉరుమడ్ల గ్రామ మహిళల యువకుల ఉత్సాహం చూసి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కేసీఆర్ 9 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తాగుబోతు రాష్ట్రంగా మార్చాడన్నారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి తగిన మూల్యం తప్పదన్నారు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని తెలియజేశారు.

దళిత ముఖ్యమంత్రి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, లక్ష రూపాయల రుణమాఫీ, కేజీ టు పీజీ విద్య, యాదవులకు గొర్రెలు, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని బిసి సొసైటీలు ఫెడరేషన్లు అన్ని సంఘాలను నిర్వీర్యం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల ద్వారా గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వీధిలైట్లు, రోడ్లు, మరుగుదొడ్లు, పల్లె పకృతి వనాలు, రైతు వేదికలు, స్మశానవాటికలు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, సుకన్య సమృద్ధి యోజన, ఫసల్ బీమా యోజన, ఇలా 350 పైగా కేంద్ర ప్రభుత్వ పథకాలను నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు.

అన్ని విధాల సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వెచ్చించి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలంగాణ ప్రజలకు కరోనా కష్టకాలం నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నారని అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఉచితంగా కరోనా మూడు దఫాలుగా టీకాలు వేయించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ఐదు లక్షల వరకు మనం ఏ ఆసుపత్రికి వెళ్లిన ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చని తెలియజేశారు.

కేంద్రం నుంచి సరాసరి మన గ్రామాలకు అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం 1250 రూపాయలు ఒక్కరికి చొప్పున గ్రామపంచాయతీకి కేంద్ర ప్రభుత్వo నిధులు కేటాయిస్తుందన్నారు. ఉరుమడ్ల గ్రామపంచాయతీకి 20 లక్షల నుండి 25 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ నిధులు కేటాయించబడతాయని తెలియజేశారు. ఎలికట్టే గ్రామంలో బిజెపి నాయకులు బూత్ కమిటీ అధ్యక్షులు పులుగు శ్రీనివాస్ గుడిపాటి సందీప్ చర్లపల్లి లింగస్వామి పామనగుండ్ల వెంకన్న ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్ గారికి శాలువాతో సన్మానించి మహిళలు కోలాటాలతో భారీ స్వాగతం పలికారు. ఎలికట్టె గ్రామ నూతన బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. గ్రామస్తులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమానికి శక్తి కేంద్రం ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు అధ్యక్షతన సమావేశాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రవీందర్ గారు మాట్లాడుతూ ఎలికట్టే గ్రామంలో దళితులకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు దళిత బంధు మన గ్రామాల్లో ఎందుకు ప్రవేశ పెట్టలేదు దళితులను మోసం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దతించడమే లక్ష్యంగా మనందరం కలిసికట్టుగా పనిచేసి భారతీయ జనతా పార్టీని బలపరిచి రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాల పైన సవివరంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన మోసాల గురించి ప్రజలకు వివరంగా బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నకరేకల్ అసెంబ్లీ కన్వీనర్ మైల నరసింహ, మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు సుంకరి మల్లేష్ గౌడ్, ఈదుల పవన్ చింతకాయల రాము, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, ఎస్సీ మోర్చ నకిరేకల్ కన్వీనర్ కోరబోయిన లింగస్వామి, ఓబీసీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గరిసె రవికాంత్, గంజి గోవర్ధన్, సీనియర్ నాయకులు ఉయ్యాల లింగస్వామి, యువజన నాయకులు పాకల దినేష్, మాజీ వార్డు సభ్యులు రూపాని నరసింహ, పాలకూరి వెంకన్న జగన్ పవన్ వెంకటేష్, అర్జున్, మచ్చ గిరి సైదులు నరసింహ వెంకన్న భిక్షమయ్య అంజయ్య కిష్టయ్య బజారు వెంకటేష్, శ్రీశైలం నాగేష్ మహేష్ సురేష్ శివ రాంబాబు లింగస్వామి రమేష్ సందీప్ సాయి మరియు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

రెండోసారి విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి..

సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ముగింపుకు చేరుతున్నట్టే పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా రెండో సారి కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజర్యారు..

ఆయన్ను పలు రకాల ప్రశ్నలు వేస్తున్నారు అధికారులు.. తొలిసారి విచారణకు హాజరైనప్పుడు పలు ప్రశ్నలకు ఎంపీ సమాధానాలు చెప్పలేదు. ఈ నేపథ్యంలో మరోసారి పాత ప్రశ్నలతో పాటు.. దస్తగిరి చెప్పిన అంశాలపై..

హత్య జరిగిన రోజు ఎవరు పాత్ర ఏంటి అన్న విషయాలపై విచారణ చేస్తున్నారు. మరోవైపు సీబీఐ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపించారు. అవినాష్ రెడ్డికి మద్దతుగా ఆయన అనుచరులు అక్కడకు చేరుకున్నారు. ఆయనకు అనూకలంగా నినాదాలు చేస్తూ.. పరిస్థితి గందరగోళంగా మారడంతో.. సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి అనుచరులను అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు.

తెలంగాణలో ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 28న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి వెల్లడించారు.

మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

ఏప్రిల్‌ 30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. మే 7 నుంచి 11 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.

AP CID: మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇళ్లలో ఏపీ సీఐడీ సోదాలు

మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇళ్లలో ఏపీ సీఐడీ సోదాలు

హైదరాబాద్‌: మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇళ్లలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కూకట్‌పల్లి, కొండాపూర్‌, గచ్చిబౌలిలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు..

అమరావతి భూముల కొనుగోలు అంశంలో సీఐడీ అదికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం

ఏపీ మూడవ గవర్నర్‌గా జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం నేతలు, అధికారులు గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యకర్తల శ్రేయస్సే జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యం

•జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్య చంద్ర

నర్సీపట్నం : కార్యకర్తల శ్రేయస్సే జన సేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర అన్నారు.

శుక్రవారం ఆయన నర్సీపట్నంలో విలేకర్లతో మాట్లాడుతూ కార్యకర్తల యోగక్షేమాలు కాంక్షించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహా సంకల్పం చేపట్టారన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని పని జనసేన పార్టీ ద్వారా చేసి చూపిస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి ప్రాణాలు పణంగా పెట్టి కృషి చేసే కార్యకర్తలకు ఆకస్మిక మరణం జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా వారి కుటుంబాలకు ఇన్యూరెన్స్ అందించి భరోసా కల్పిస్తున్నారన్నారు.

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళాన్ని అందజేయడం జరిగిందన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు, వారికి ప్రమాద భీమా చేయించే నిమిత్తం గత రెండు సంవత్సరాలుగా ఏటా రూ. కోటి చొప్పున విరాళాన్ని అందజేశారని, మూడో ఏటా తన వంతుగా కోటి విరాళాన్ని అందించారన్నారు. ఎంతో ఆశయం, త్రికరణ శుద్ధితో పనిచేసే కార్యకర్తలే జనసేన బలం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారన్నారు. జనసేన పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి ఆలోచించి వారి బాగోగులు చూసే జనసేన పార్టీ అధినేతను పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

నర్సీపట్నం నియోజకవర్గంలో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా చేపడుతున్నామన్నారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని జనసైనికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, నర్సీపట్నం నాయకులు కొత్తకోట రామశేఖర్, మారిశెట్టి రాజా, నాతవరం మండల యువత అధ్యక్షులు బైన మురళీ, గొలుగొండ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి, వీసం వెంకటేష్, పరవాడ లోవరాజు తదితరులు పాల్గొన్నారు..

చిన్నారిపై కుక్కల దాడి : నగరం మేయర్ ని ఆ కుక్కల మధ్య వదలండి. రామ్ గోపాల్ వర్మ

అంబర్ పేట్ లో జరిగిన వీధి కుక్కలు దాడి ఘటనపై గద్వాల్ మేయర్ విజయలక్ష్మిని విమర్శిస్తూ సిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హైదరాబాద్ అంబర్ పేట్ లో జరిగిన వీధి కుక్కల దాడి ఘటనలో నాలుగేళ్ల బలుడు ప్రదీప్ మరణించిన ఘటన అందరినీ తీవ్రంగా కలిసి వేసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై రాంగోపాల్ వర్మ తనదైన శైలి లో స్పందించారు. వీధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి) విఫలమైందంటూ విమర్శించారు. శునకాలకు ఆకలి వేయడం వల్లే చిన్నారిపై దాడి చేసాయని. నగరం మేయర్ విజయలక్ష్మి ఇచ్చిన వివరణ పై రాంగోపాల్ వర్మ మండిపడ్డారు.

Narendra Modi: మాకు మోదీ కావాలి.. పాకిస్థానీ వీడియో వైరల్‌
ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభం(Economic Crisis)తో పాకిస్థాన్‌(Pakistan) అతలాకుతలమవుతోన్న విషయం తెలిసిందే. పెరుగుతోన్న నిత్యావసర, ఇంధన ధరలు (Petrol Price), రాయితీల్లో కోత వంటివి స్థానికుల్లో ప్రభుత్వంపై ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ పరిస్థితులపై ఓ స్థానికుడు స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది. 'షరీఫ్‌ వద్దు.. ఇమ్రాన్‌ వద్దు.. మాకు ప్రధాని మోదీ (Narendra Modi) కావాలని.. ఆయనే దేశ పరిస్థితులను చక్కదిద్దగలర'ని అతను వ్యాఖ్యానించడం గమనార్హం. ఓ పాకిస్థానీ యూట్యూబర్‌ తీసిన వీడియో (Viral Video)లో.. అతను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. 'పాక్‌ నుంచి ప్రాణాలతో పారిపోండి. భారత్‌లోకి అయినా సరే అనే నినాదాలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి?' అని ఓ స్థానికుడిని యూట్యూబర్‌ ప్రశ్నించగా.. అతను వాస్తవమేనని పేర్కొన్నాడు. దేశ విభజన జరగకుండా.. రెండు దేశాలు కలిసి ఉంటే ఈరోజు తాము కూడా భారత్‌ మాదిరే సరసమైన ధరలకే సరుకులు, ఇంధనం కొనుగోలు చేసేవాళ్లమని తెలిపాడు. రాత్రిపూట పిల్లలకు భోజనం పెట్టలేని పరిస్థితి ఉంటే ఇక్కడి ఉండి ఏం లాభమని వాపోయాడు. పాకిస్థానీయులు తమను భారత్‌తో పోల్చుకోవడం మానుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ రెండు దేశాల మధ్య ఏ విషయంలోనూ పోలిక లేదని వ్యాఖ్యానించాడు. పాక్‌ను గట్టెక్కించగలిగేది భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని అతను పేర్కొన్నాడు. 'మాకు నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్‌, ముషారఫ్‌లు అవసరం లేదు. మాకు కేవలం ప్రధాని మోదీ కావాలి. పాక్‌లోని అన్ని వ్యవహారాలను ఆయన సరిదిద్దగలరు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. పాక్‌ ఆ దేశం దారిదాపుల్లో కూడా లేదు' అని చెప్పాడు. మోదీ పాలనలో జీవించేందుకు సిద్ధమేనని చెబుతూ.. 'మోదీ గొప్ప వ్యక్తి. చెడ్డవాడు కాదు. భారతీయులు సరసమైన ధరలకే టమాటా, చికెన్‌, పెట్రోల్‌ వంటివి పొందుతున్నారు. మోదీ మాకు కావాలి. ఆయన పాక్‌ను పాలించేలా, బాగు చేసేలా చేయాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా' అని అన్నాడు.