కార్యకర్తల శ్రేయస్సే జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యం
•జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్య చంద్ర
నర్సీపట్నం : కార్యకర్తల శ్రేయస్సే జన సేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర అన్నారు.
శుక్రవారం ఆయన నర్సీపట్నంలో విలేకర్లతో మాట్లాడుతూ కార్యకర్తల యోగక్షేమాలు కాంక్షించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహా సంకల్పం చేపట్టారన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని పని జనసేన పార్టీ ద్వారా చేసి చూపిస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి ప్రాణాలు పణంగా పెట్టి కృషి చేసే కార్యకర్తలకు ఆకస్మిక మరణం జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా వారి కుటుంబాలకు ఇన్యూరెన్స్ అందించి భరోసా కల్పిస్తున్నారన్నారు.
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళాన్ని అందజేయడం జరిగిందన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు, వారికి ప్రమాద భీమా చేయించే నిమిత్తం గత రెండు సంవత్సరాలుగా ఏటా రూ. కోటి చొప్పున విరాళాన్ని అందజేశారని, మూడో ఏటా తన వంతుగా కోటి విరాళాన్ని అందించారన్నారు. ఎంతో ఆశయం, త్రికరణ శుద్ధితో పనిచేసే కార్యకర్తలే జనసేన బలం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారన్నారు. జనసేన పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి ఆలోచించి వారి బాగోగులు చూసే జనసేన పార్టీ అధినేతను పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా చేపడుతున్నామన్నారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని జనసైనికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, నర్సీపట్నం నాయకులు కొత్తకోట రామశేఖర్, మారిశెట్టి రాజా, నాతవరం మండల యువత అధ్యక్షులు బైన మురళీ, గొలుగొండ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి, వీసం వెంకటేష్, పరవాడ లోవరాజు తదితరులు పాల్గొన్నారు..
Feb 24 2023, 12:39