గోమాసే శ్రీనివాస్ పై దాడిని ఖండించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్


గవ్వల శ్రీకాంత్

Street Buzz news తెలంగాణ రాష్ట్రం:

(కరీంనగర్ జిల్లా):- దళిత బహుజన నాయకులు నేతకాని మహర్ జాతీయ ఆధ్యక్షులు అణగారిన కులాల ఐక్య వేదిక జాతీయ ఆధ్యక్షులు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోమాసే శ్రీనివాస్ పై దాడి చేయడం చాల దురదృష్టకరమని గవ్వల శ్రీకాంత్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .ఏదైన సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కాని దాడులు చేయడం ఏమిటని ఇది ప్రజాస్వామ్యామ లేకుంటే రౌడీల రాజ్యమా అని ప్రశ్నించారు. బహిరంగంగా గోమాసే శ్రీనివాస్ గారికి క్షేమాపణలు చెప్పాలని తెలంగాణ ఎస్ సి, ఎస్ టి, బిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ఆధ్యక్షులు వంచిత్ బహుజన్ ఆఘాడి విబిఏ జాతీయ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

బహుజన రాజ్యంలోనే అభివృద్ధి సాధ్యం


 _మతోన్మాద బిజెపి మద్దతిచ్చే బీఆర్ఎస్ లను గద్దెదింపుతాం_

 _వంచిత్ బహుజన అఘాడి రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయ్ కుమార్_

Street Buzz news జగిత్యాల:

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరికి మేలు జరగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలన్న బహుజన రాజ్యంలోనే సాధ్యమవుతుందని వంచిత్ బహుజన అఘాడి రాష్ట్ర కో ఆర్డినేటర్ డా,, బండి విజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణాలో బహుజనులు ఎక్కువగా ఉన్నారని ఏండ్లు గడుస్తున్నా బహుజనుల్లో అభివృద్ధి లేదన్నారు. బహుజనుల ప్రయోజనాలకోసం అంబేద్కర్ కుటుంబ పార్టీ అవసరం ఇక్కడ ఉందని గుర్తించారన్నారు. మహారాష్ట్రలో శివసేన ఉద్దోవ్ తక్రితో పొత్తు కొనసాగిస్తున్నామని తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. దాదాపు 60 సీట్లలో విబిఏ అభ్యర్యులు బరిలో ఉంటారన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మతోన్మాదాన్ని పెంచిపోషిస్తోందని రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెప్పే బి.ఆర్.ఎస్. మతోన్మాదాన్ని అనచిన దాఖలాలు లేవన్నారు. త్వరలో నిజాం గ్రౌండ్ లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి బహుజనుల్లో ఐక్యతను చాటుతమన్నారు. రాష్ట్రంలో దేశంలో బడుగు, బలహీన మైనార్టీ, షెడ్యూల్ కులాలను కేవలం ఓటు బ్యాంకుగా, చిన్న పతకాలకు లబ్ధిదారులుగా ప్రభుత్వాలు మార్చుతున్నాయని విజయ్ కుమార్ అన్నారు. ఆచరణలో ఎక్కడను అంబేద్కర్ విధానాలు అమలు కావడం లేదని దేశంలో, రాష్ట్రంలో పరిపాలనలో ముఖ్యమైన పోస్టుల్లో దళిత ఐఏఎస్, ఐపీఎస్ లకు పోస్టింగులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 ఏండ్ల కాలంలో దళితులు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారని, దళితులకు 3 ఎకరాల భూమి భూటకమన్నారు. అగ్రకుల ప్రాజెక్టులకు కోట్ల రూపాయలు ఇస్తూ దళితబందుకు నిధుల కొరత పెట్టారన్నారు. ఎస్సి, ఎస్టీ చట్టం నిర్వీర్యం అయ్యిందని, ఎస్సి కార్పొరేషన్ బిసి కార్పొరేషన్ ట్రైబల్ వేల్పర్ ఉనికి కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు లేవన్నారు. రాష్ట్రం తీరు ఇలావుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని పెంచిపోషిస్తూ మనుధర్మ శాస్త్రం అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో రిజర్వేషన్లు లేకుండా చేస్తూ బడుగు, బలహీన, దళిత, మైనార్టీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చాలని చేస్తోందన్నారు. ఉన్న పరిశ్రమలను మూసివేసి నిరుద్యోగన్ని పెంక్సహిపోచిస్తుందని ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్ముతు మనువాదుల గర్శలు నింపుకుంటున్నారని ప్రవేట్ పరం చేయడం వలన బిసి లకు ఎస్ సి లకు ఎస్ టి లకు రిజర్వేషన్ లేకుండ చేసిందన్నారు మనువాద పార్టీలను గద్దె దించడం బాబాసాహెబ్ అంబేడ్కర్ కుటుంభంతోనే సాధ్యమవుతుందని వంచిత్ బహుజన్ అఘాడి పార్టీని బలోపేతం చేయాలని వంచిత్ బహుజన్ అఘాడి రాష్ట్ర కో ఆర్డినేటర్ డా,, బండి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ గవ్వల శ్రీకాంత్, జగిత్యాల నియోజకవర్గ ఆధ్యక్షులు తీగల శేఖర్, పట్టణ ఆధ్యక్షులు దాసరి వెంకటి, జిల్లా నాయకులు జే భూమ్ రాజ్, కే మహేందర్ తదితరులు పాల్గొన్నారు

కేసీఆర్ రాక్షస పాలనలో మనుషులను కుక్కలు పీక్కుతింటున్నాయి - రేవంత్ రెడ్డి

Street Buzz news తెలంగాణ రాష్ట్రం:

మ‌నుషుల‌ను వీధికుక్కలు పీక్కుతినే స్థాయి అధ్వాన పాల‌న రాష్ట్రంలో కొనసాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజ‌మెత్తారు. ఐదేళ్ల చిన్నారిని హైద‌రాబాద్‌లో కుక్కలు క‌రిచి చంపేస్తే కుక్కలకు ఆకలేసింద‌ని అక్కడి మేయ‌ర్ చెప్పడం సిగ్గుచేట‌న్నారు. ఈ ప్రభుత్వానికి మాన‌వ‌త్వం లేద‌ని, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. కుక్కలు కరిచి మనుషులు చనిపోతే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారన్నారు. బాధిత కుటుంబానికి న‌ష్ట ప‌రిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకున్న ఘ‌నత ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి ద‌క్కింద‌న‌నారు. బాధిత కుటుంబంపై కనీస సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం ఇద‌ని దుయ్యబ‌ట్టారు. కేటీఆర్ భూపాలపల్లి పర్యటనకుముందే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా 14వ రోజు భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండ‌లంలోని కోటంచ‌లోని ల‌క్ష్మీ న‌ర‌సింహా స్వామి ఆల‌యంలో స్వామి వారిని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సీత‌క్క, నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర స‌త్యనారాయ‌ణ‌ రావుతో క‌లిసి ద‌ర్శించుకున్నారు. అనంత‌రం రేవంత్ రెడ్డి ఆల‌యం ఎదుట విలేక‌రుల‌తో మాట్లాడారు. న‌క్సలైట్లు ఎర్రజెండాలు పాతి పేద‌ల‌కు పంచి పెట్టిన భూముల‌ను మ‌ళ్లీ గండ్ర ర‌మ‌ణారెడ్డి ఆక్రమించుకుంటున్నాడ‌ని ఆరోపించారు. దోపిడీకి ధ‌ర‌ణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని వంద‌ల ఎక‌రాలను ఆక్రమించుకుంటున్నారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో పాల‌కుర్తికి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు, భూపాల‌ప‌ల్లికి ర‌మ‌ణారెడ్డిని, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యే విన‌య్‌ భాస్కర్‌ను, వ‌రంగ‌ల్ తూర్పుకు న‌న్నపునేని న‌రేంద‌ర్‌ల‌ను సామంత రాజులుగా నియ‌మించుకుని మంత్రి కేటీఆర్ దోపిడీకి పాల్పడుతున్నాడ‌ని ధ్వజ‌మెత్తారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో బీఆర్ఎస్ నేత‌లు గుండాలుగా మారిపోయార‌న్నారు. ప్రజ‌ల ఆస్తుల‌కు, భూముల‌కు ర‌క్షణ లేకుండాపోయింద‌ని అన్నారు. భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర గండ్ర వెంక‌ట‌ ర‌మ‌ణారెడ్డి భూముల ఆక్రమణ‌ల‌పై విచారణకు డ్రామారావు సిద్ధమా? అంటూ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి స‌వాల్ విసిరారు. ఎమ్మెల్యే గండ్ర ర‌మ‌ణారెడ్డి చేస్తున్న దందాలు, అక్రమాలు, భూ ఆక్రమ‌ణ‌ల్లో కేటీఆర్‌కు వాటాలు లేకుంటే.. విచారణకు అదేశించాల‌ని డిమాండ్ చేశారు. గండ్ర ర‌మ‌ణారెడ్డి చేస్తున్న దందాల్లో, అక్రమాల్లో కేటీఆర్‌కు భాగ‌స్వామ్యం ఉంద‌ని నిరూపించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాను బీఆర్ఎస్ గుండాలు ఆక్రమించుకున్నారని అన్నారు. పార్టీ ఫిరాయించిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టేది లేదని, సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి దివాలకోరు రాజకీయాలు చేస్తున్నాడ‌ని మండిపడ్డారు.  అనంత‌రం చిట్యాల మండ‌లం చ‌ల్లగ‌రిగేకు వాహ‌నంలో చేరుకున్న రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో గ్రామానికి చెందిన‌ ప‌లువురు బీఆర్ఎస్‌కు చెందిన నాయ‌కులు, కార్యక‌ర్తలు కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకున్నారు. అనంత‌రం ఇదే మండ‌లంలోని తిరుమలాపూర్ నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, ఇల్లు లేని నిరుపేదలకు రూ. 5 లక్షల రూపాయలను కేటాయిస్తామని, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, మహిళలకు వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తామని, రూ. 500 లకే వంట గ్యాస్ ను అందిస్తామని హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, మొగుళ్లపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నీల రాజు కురుమ, నాయకులు మండ రవీందర్ గౌడ్, క్యాతరాజు రమేష్, నీరటి మహేందర్, నడిగోటి రాము, ఎండి రఫీ, బండారి కుమారస్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్వవహరిస్తున్న పోలీసులు


 ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న రాష్ట్ర హోంశాఖ - చందుపట్ల కీర్తి-సత్యపాల్ రెడ్డి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ బతుకులు మారుతాయనుకున్న సబ్బండ వర్గాల ప్రజల ఆశల మీద నీళ్లు చల్లి..ఎందరో అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మళ్లీ నిజం రజాకార్ల పాలన మొదలైందని, నిజాం రజాకర్ల హాయంలో దొరల గడీల పాలనను మైమరిపించేలా కేసీఆర్ పాలన కొనసాగుతుందని..రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. అపహస్యం చేస్తున్నాడని..ప్రశ్నించే గొంతుకను సమాధి చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా రాష్ట్రంలో పోలీసులు పని చేస్తూ..బీఆర్ఎస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని..పోలీస్ అధికారులు యూనిఫామ్ వదిలేసి బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకోవాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి.. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. బుధవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి మండల అధ్యక్షుడు చెవ్వ శేషగిరి యాదవ్ అధ్యక్షతన వహించగా..ముఖ్యఅతిథిగా విచ్చేసిన కీర్తి-సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రులు పర్యటించే ప్రాంతాల్లో విద్యార్థి, యువకులను, బీఆర్ఎస్ బాధితులను బైండోవర్ల పేరిట అరెస్టులు చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 23న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూపాలపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్..రాష్ట్ర కమిటీ సభ్యుడు వేల్పుల రాజకుమార్ ను 48 గంటల ముందు అరెస్టు చేసి అతనికి తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలు పెడుతున్నారని, రాజకుమార్ ను ఎక్కడ ఉంచారో ఆచూకీ కూడా తెలపకుండా కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.కేసిఆర్అసమర్థపాలనను అసహ్యించుకుంటున్న విద్యార్థులు,యువకులు, మేధావులు, బాధితులు, ప్రజలపై మీ ప్రతాపం చూపిస్తే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అదేవిధంగా మొగుళ్లపల్లి మండలంలోని పెద్ద కోమటిపల్లి గ్రామంలో ఐకెపి నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేసి రూ. 5.80లక్షల రూపాయలను గోల్ మాల్ చేశారని, మిల్లర్లు దళారులు కుమ్మక్కై ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రశీదులు ఇవ్వకుండా రైతాంగాన్ని నిట్ట నిలువుగా దోపిడీ చేసిన దళారులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వత్తాసు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు చదువు రామచంద్ర రెడ్డి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, బిజెపి చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్, నాయకులు మైదం శ్రీకాంత్, బండారి శ్రీనివాస్, మాచర్ల రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కుక్కల దాడిలో మృతి చెందిన బాలుని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి


•విబిఏ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ డిమాండ్•

Street Buzz news తెలంగాణ రాష్ట్రం:

(కరీంనగర్ జిల్లా) :- హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేటలో లో ప్రదీప్ (4) బాలుడు కుక్కల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ,ఈ బాలుడి మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విబిఏ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ మృతి చెందిన బాలుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక గ్రామములో మండల కేంద్రాలలో పట్టణాలలో మనుషుల పైన పశువులపైన అడవి జంతువులపైన కుక్కలు చిన్న పెద్ద తేడా లేకుండ మీద కొరికి కరిచి గాయపరుస్తున్నాయి సంపుతున్నాయి కాని గ్రామాలలో సర్పంచులు మండల జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని కుక్కలను పెంచుతున్న యజమానులు వాటిని ఇంటిలో కట్టి ఉంచుకోవడం లేదు, కావున ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తెచ్చి కుక్కను ఎవరు సాధిన ఆ కుక్కతో ఎవరికి ప్రమాదం జరిగిన వారినే బాద్యులుగా చేయాలి. వారి నుండి నష్టపరిహారం కోటి రూపాయలు వారి కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. గ్రామాలలో ఉన్న వీది కుక్కలను వదించాలి, కక్కులు ఎవరిని కరిచిన ఆ గ్రామ సర్పంచ్ ను అధికారిని పట్టణం లో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లు,వార్డు సభ్యులను, ఎం ఎల్ ఏ, ఎం పి, లను కింది నుంచి పై వరకు అధికారులను బాద్యులు గా చేయాలని, ప్రభుత్వం పూర్తీ బాధ్యత వహించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ఆధ్యక్షులు మరియు వంచిత్ బహుజన్ ఆఘాడి విబిఏ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఒకవేళ కుక్కలు ఎవరిని కరిచిన స్థానిక సర్పంచ్ అధికారులు ప్రజాప్రతినిధులు పెంచిన యజమానులను బాద్యులుగా చేస్తూ నష్టపరిహారం తో పాటు వారిపై కేసులు బుక్ చేసి కఠినంగా శిక్షించాలని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

ముందస్తుగా అక్రమ అరెస్టులు


స్వేరో స్టూడెంట్ యూనియన్ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు 

Street Buzz newsరంగారెడ్డి జిల్లా: షాబాద్ మండలం హైతబాద్ లొ వెల్ స్పాన్ కంపెనీ నూతన యూనిట్ ను బి ఆర్ఎస్ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా స్వేరో స్టూడెంట్ యూనియన్ SSU , రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాస్,చేవెళ్ల మండల్ కార్యదర్శి రఘురాం లను అక్రమంగా అరెస్టు చేసి చేవెళ్ల పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఉద్యమ నాయకులకు భయపడి ముందస్తు అరెస్టులు


PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్

Street Buzz news :రంగారెడ్డి జిల్లా: 

షాబాద్ మండలం హైతబాద్ లోని వెల్స్ పాన్ కంపెనీలో కొత్త యూనిట్ నీ ప్రారంభించడానికి వస్తున్న మంత్రి కేటీఆర్ ని విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమకారులు, అడ్డుకుంటారనే భయంతో పోలీసులు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU ) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ ని చేవెళ్ల పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ విద్యార్థి సంఘాలకు భయపడి ఇలా ముందస్తు అరెస్టులు చేసి మంత్రి కేటీఆర్ ఎన్ని రోజులు కార్యక్రమాలు చేస్తారన్నారు. ఉన్న సమస్యలను పరిష్కరిస్తే ఈ భయం మంత్రి కేటీఆర్ కు ఉండేది కాదు కదా అని అన్నారు. ఇది అరాచకమైన రాచరిక పాలనలా ఉందన్నారు.ఈ వ్యవస్థ తీరు ఇది ప్రజాస్వామ్య దేశం కదా ? ప్రశ్నించే హక్కుని కాలరాస్తున్నా ఈ రాష్ట్రంలో రాక్షసుల పాలనా రాజ్యమేలుతుందని మండి పడ్డారు.ఇంత పిరికి తనంతో అధికారం ఎందుకు చేపట్టాలి ? ప్రజల సొమ్ముని దోచుకు తినేవారే ఇలా భయపడుతూ రాజ్యాన్నీ పాలిస్తారు. అయినా అవినీతి మంత్రులను, అడ్డుకోవాలి అని ప్రశ్నించే గొంతుక అనుకుంటే ఎంత సేపు,, ఎలాగైనా అడ్డుకుంటుంది.వారిని ఆపడం ఎవ్వరి తరం కాదని కాబట్టి ఇప్పటికైనా ఈ ముందస్తు అరెస్ట్ లు చేయడం మానుకోవాలన్నారు. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు అనేకం ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరుతూ చేవెళ్లలోనిప్రభుత్వడిగ్రీకళాశాలనిర్మాణం 2014లో ప్రారంభిస్తే ఇప్పటివరకు పూర్తి కాకపోవడం సిగ్గుచేటు అని,ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరం లోపలప్రగతిభవన్ కట్టడం పూర్తయింది. కానీ పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాలేదని అన్నారు.శంకరపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలి అని అలాగే హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని అన్నారు. బస్సుల సమస్యను కూడా పరిష్కరించాలని, అదేవిదంగా పెండింగ్ లో ఉన్న 3500 కోట్ల ఫీజురియంబర్స్మెంట్ &స్కాలర్షిప్ ని వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU )రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ డిమాండ్ చేశారు.

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 50 వేల రూపాయల జరిమానా

Street Buzz news సిద్దిపేట జిల్లా:

(తొగుట):- బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గజ్వేల్ ఏసీపీ తెలిపారు.ఈ సందర్భంగా గజ్వెల్ ఏసీపీ M. రమేష్ మాట్లాడుతూ తొగుట పోలీస్ స్టేషన్ పరిధి లోఉన్న సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన రౌడీషీటర్ మన్నె బాగయ్య(49) తండ్రి రామయ్య అతని సత్ప్రవర్తన గురించి, SI తోగుట తేదీ: 17-06-2022 నాడు స్థానిక తహసీల్దారు వద్ద బైండోవర్ చేయడం జరిగిందని బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించి నేరం చేసినందున అతని పై తొగుట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని నేరం చేసినాడని స్థానిక తహసీల్దారుకు సమాచారం అందించగా తహసీల్దార్ విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన పై రౌడీ షీటర్ కు 50 వేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని గజ్వేల్ ఏసీపీ ఒక ప్రకటనలో తెలిపారు. గజ్వెల్ డివిజన్ పరిధిలో ఉన్న రౌడీలు, కేడీలు, డిసీలు, సస్పెక్ట్ మంచి ప్రవర్తనతో మెలగాలని వారితో పాటు వివిధ కేసులలో బైండ్ ఓవర్ చేయబడిన వారు ఎవరైనా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన గజ్వేల్ ఏసీపీ M.రమేష్.

యువత అన్ని రంగాల్లో నైపుణ్యాలతో ముందుకు వెళ్ళాలి


కబడ్డీ పోటీలను ప్రారంభించిన మండల జడ్పిటిసి నాయకుడు అనిల్ జాదవ్

Street Buzz news:

(బోథ్ నియోజకవర్గం):- నేరడిగొండ మండలం రాజుర గ్రామంలో మంగళవారం కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలు బోథ్ ముద్దుబిడ్డ మండల జడ్పిటిసి నాయకుడు అనిల్ జాదవ్ చేతుల మీదుగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో క్రీడాకారులను ఉత్తేజ పరుస్తూ క్రీడా అనేది మానవ శరీరానికి ముఖ్య పాత్ర పోషిస్తుందని అలాగే ప్రతి యువత అన్ని రంగాల్లో నైపుణ్యాలతో ముందుకు ముందుకు వెళ్లాలని. యువత ఎటువంటి చెడు అలవాటులకు పాల్పడద్దని మంచి మార్గంలో యువత నడవాలని. యువతను ఉద్దేశించి అనిల్ జాదవ్ కోరారు.ఈ కార్యక్రమంలో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ పిఎసిఎస్ చైర్మేన్ నానక్ సింగ్, గులాబ్, సర్పంచ్ రమేష్, సర్పంచ్ స్థానిక సర్పంచ్ వసంతరావు, గ్రామ నాయక్ అంబారావు, కార్ భారీ నారాయణ ,గణేష్, ఎక్స్ ఎంపీపీ రామ్ చందర్, పిఎసిఎస్ డైరెక్టర్ గంగా సింగ్, ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి,చింటూ రెడ్డి, ఉత్తం, మేఘరాజ్, సవాయ్ రామ్, కాశీరాం ,సో రాజి ,మరియు గ్రామ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా మాతృభాష దినోత్సవం

Street Buzz news:

హుజురాబాద్ పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మరియు తెలుగు అధ్యాపకులు మేకల నవీన్ కుమార్ గారి ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రాంగణం నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీగా నినాదాలతో వెళ్లి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలను అలంకరించి తిరిగి కళాశాల ప్రాంగణంలో సభా కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి తెలుగు అధ్యాపకులు మేకల నవీన్ కుమార్ గారి గురువర్యులు శ్రీ రామకృష్ణ సార్ మరియు ముఖ్య అతిథి హుజరాబాద్ చైర్మన్ రాధిక శ్రీనివాస్ గార్లు హాజరయ్యారు.శ్రీ గందె రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ మాతృభాష గొప్పతనాన్ని వివరిస్తూ పరభాషల కంటే మన భాష గొప్పదని తెలుగు గౌరవిస్తే అమ్మను గౌరవించినట్లే అని ప్రతి విద్యార్థి శ్రద్ధతో చదివి మంచి మార్పు రావాలని ఆశీస్సులు తెలియజేసింది రామకృష్ణ సార్ మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను వివరించారు కళాశాల కరస్పాండెంట్ శ్రీ ఏనుగు మైపాల్ రెడ్డి మాట్లాడుతూ అన్ని సబ్జెక్టులతో పాటు మా కళాశాలలో తెలుగు ఒక ప్రత్యేకమైన భాషగా తెలుగు భాషను గౌరవిస్తూ తెలుగు అధ్యాపకులకు అన్ని విధాల సహకారాలు అందిస్తూ తెలుగు భాషను ముందుకు తీసుకెళుతున్నానని తెలుగు భాషను మా కళాశాలలో ఒక అమ్మలా మేము ఆరాధిస్తామని ప్రతి విద్యార్థి తప్పక తెలుగు భాషను గౌరవించాలన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు శ్రీ గందె రాధిక శ్రీనివాస్, శ్రీ రామకృష్ణ సార్, కరస్పాండెంట్ మైపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి,వివిధ అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.