బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్వవహరిస్తున్న పోలీసులు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న రాష్ట్ర హోంశాఖ - చందుపట్ల కీర్తి-సత్యపాల్ రెడ్డి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ బతుకులు మారుతాయనుకున్న సబ్బండ వర్గాల ప్రజల ఆశల మీద నీళ్లు చల్లి..ఎందరో అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మళ్లీ నిజం రజాకార్ల పాలన మొదలైందని, నిజాం రజాకర్ల హాయంలో దొరల గడీల పాలనను మైమరిపించేలా కేసీఆర్ పాలన కొనసాగుతుందని..రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. అపహస్యం చేస్తున్నాడని..ప్రశ్నించే గొంతుకను సమాధి చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా రాష్ట్రంలో పోలీసులు పని చేస్తూ..బీఆర్ఎస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని..పోలీస్ అధికారులు యూనిఫామ్ వదిలేసి బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకోవాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి.. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. బుధవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి మండల అధ్యక్షుడు చెవ్వ శేషగిరి యాదవ్ అధ్యక్షతన వహించగా..ముఖ్యఅతిథిగా విచ్చేసిన కీర్తి-సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రులు పర్యటించే ప్రాంతాల్లో విద్యార్థి, యువకులను, బీఆర్ఎస్ బాధితులను బైండోవర్ల పేరిట అరెస్టులు చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 23న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూపాలపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్..రాష్ట్ర కమిటీ సభ్యుడు వేల్పుల రాజకుమార్ ను 48 గంటల ముందు అరెస్టు చేసి అతనికి తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలు పెడుతున్నారని, రాజకుమార్ ను ఎక్కడ ఉంచారో ఆచూకీ కూడా తెలపకుండా కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.కేసిఆర్అసమర్థపాలనను అసహ్యించుకుంటున్న విద్యార్థులు,యువకులు, మేధావులు, బాధితులు, ప్రజలపై మీ ప్రతాపం చూపిస్తే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అదేవిధంగా మొగుళ్లపల్లి మండలంలోని పెద్ద కోమటిపల్లి గ్రామంలో ఐకెపి నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేసి రూ. 5.80లక్షల రూపాయలను గోల్ మాల్ చేశారని, మిల్లర్లు దళారులు కుమ్మక్కై ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రశీదులు ఇవ్వకుండా రైతాంగాన్ని నిట్ట నిలువుగా దోపిడీ చేసిన దళారులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వత్తాసు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు చదువు రామచంద్ర రెడ్డి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, బిజెపి చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్, నాయకులు మైదం శ్రీకాంత్, బండారి శ్రీనివాస్, మాచర్ల రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Feb 23 2023, 08:12