యువత అన్ని రంగాల్లో నైపుణ్యాలతో ముందుకు వెళ్ళాలి
కబడ్డీ పోటీలను ప్రారంభించిన మండల జడ్పిటిసి నాయకుడు అనిల్ జాదవ్
Street Buzz news:
(బోథ్ నియోజకవర్గం):- నేరడిగొండ మండలం రాజుర గ్రామంలో మంగళవారం కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలు బోథ్ ముద్దుబిడ్డ మండల జడ్పిటిసి నాయకుడు అనిల్ జాదవ్ చేతుల మీదుగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో క్రీడాకారులను ఉత్తేజ పరుస్తూ క్రీడా అనేది మానవ శరీరానికి ముఖ్య పాత్ర పోషిస్తుందని అలాగే ప్రతి యువత అన్ని రంగాల్లో నైపుణ్యాలతో ముందుకు ముందుకు వెళ్లాలని. యువత ఎటువంటి చెడు అలవాటులకు పాల్పడద్దని మంచి మార్గంలో యువత నడవాలని. యువతను ఉద్దేశించి అనిల్ జాదవ్ కోరారు.ఈ కార్యక్రమంలో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ పిఎసిఎస్ చైర్మేన్ నానక్ సింగ్, గులాబ్, సర్పంచ్ రమేష్, సర్పంచ్ స్థానిక సర్పంచ్ వసంతరావు, గ్రామ నాయక్ అంబారావు, కార్ భారీ నారాయణ ,గణేష్, ఎక్స్ ఎంపీపీ రామ్ చందర్, పిఎసిఎస్ డైరెక్టర్ గంగా సింగ్, ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి,చింటూ రెడ్డి, ఉత్తం, మేఘరాజ్, సవాయ్ రామ్, కాశీరాం ,సో రాజి ,మరియు గ్రామ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Feb 23 2023, 07:37