ఉద్యమ నాయకులకు భయపడి ముందస్తు అరెస్టులు
PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్
Street Buzz news :రంగారెడ్డి జిల్లా:
షాబాద్ మండలం హైతబాద్ లోని వెల్స్ పాన్ కంపెనీలో కొత్త యూనిట్ నీ ప్రారంభించడానికి వస్తున్న మంత్రి కేటీఆర్ ని విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమకారులు, అడ్డుకుంటారనే భయంతో పోలీసులు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU ) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ ని చేవెళ్ల పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ విద్యార్థి సంఘాలకు భయపడి ఇలా ముందస్తు అరెస్టులు చేసి మంత్రి కేటీఆర్ ఎన్ని రోజులు కార్యక్రమాలు చేస్తారన్నారు. ఉన్న సమస్యలను పరిష్కరిస్తే ఈ భయం మంత్రి కేటీఆర్ కు ఉండేది కాదు కదా అని అన్నారు. ఇది అరాచకమైన రాచరిక పాలనలా ఉందన్నారు.ఈ వ్యవస్థ తీరు ఇది ప్రజాస్వామ్య దేశం కదా ? ప్రశ్నించే హక్కుని కాలరాస్తున్నా ఈ రాష్ట్రంలో రాక్షసుల పాలనా రాజ్యమేలుతుందని మండి పడ్డారు.ఇంత పిరికి తనంతో అధికారం ఎందుకు చేపట్టాలి ? ప్రజల సొమ్ముని దోచుకు తినేవారే ఇలా భయపడుతూ రాజ్యాన్నీ పాలిస్తారు. అయినా అవినీతి మంత్రులను, అడ్డుకోవాలి అని ప్రశ్నించే గొంతుక అనుకుంటే ఎంత సేపు,, ఎలాగైనా అడ్డుకుంటుంది.వారిని ఆపడం ఎవ్వరి తరం కాదని కాబట్టి ఇప్పటికైనా ఈ ముందస్తు అరెస్ట్ లు చేయడం మానుకోవాలన్నారు. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు అనేకం ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరుతూ చేవెళ్లలోనిప్రభుత్వడిగ్రీకళాశాలనిర్మాణం 2014లో ప్రారంభిస్తే ఇప్పటివరకు పూర్తి కాకపోవడం సిగ్గుచేటు అని,ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరం లోపలప్రగతిభవన్ కట్టడం పూర్తయింది. కానీ పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాలేదని అన్నారు.శంకరపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలి అని అలాగే హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని అన్నారు. బస్సుల సమస్యను కూడా పరిష్కరించాలని, అదేవిదంగా పెండింగ్ లో ఉన్న 3500 కోట్ల ఫీజురియంబర్స్మెంట్ &స్కాలర్షిప్ ని వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU )రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ డిమాండ్ చేశారు.
Feb 22 2023, 15:05