పాత పద్ధతిలోనే పన్నుల విధానాన్ని కొనసాగించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్
Street Buzz news సిద్దిపేట జిల్లా:
(చేర్యాల) : - చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో పాత పద్ధతిలోనే ఇంటి పన్నులు వసూలు చేయాలని జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన జేఏసీ, అఖిలపక్షం సమావేశంలో వారు మాట్లాడుతూ.. చేర్యాల పట్టణ ప్రజల భౌగోళిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పన్నులు పెంచాలి తప్ప ఇస్టా రాజ్యాంగ మున్సిపల్ లో తీర్మానాలు చేసి పెంచే నిర్ణయం చేయడం సబాబు కాదన్నారు. ఇప్పటికే పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు ఇంటి పన్నులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని పాత పద్ధతిలోనే పన్నులు వసూలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై మార్చి 6న మున్సిపల్ కార్యాలయం ముందు జేఏసీ, అఖిలపక్షం ఇంటి పన్ను బాధితుల సంఘం, వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగంరెడ్డి, అవుశర్ల యాదయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందె బీరయ్య, ఎంఎస్పీ డివిజన్ ఇంచార్జి సనవాల ప్రసాద్, ఇంటి పన్ను బాధితుల సంఘం అధ్యక్షుడు బద్దీపడగ నర్సింహా రెడ్డి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, వైశ్య సంఘం అధ్యక్షుడు నీల శివకుమార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఉప్పల నాగరాజు, వైశ్య యువజన సంఘం అధ్యక్షులు అయిత సంపత్, జేఏసీ నాయకులు బండి సుదర్శన్, పిల్లి జాస్వ, రాళ్లబండి భాస్కర్, ఆముదాల రంజిత్ రెడ్డి, పుల్లని వేణు, నంగి తిరుపతి, మెర్గోజు సత్యనారాయణ, దొడ్డెని రాజీరెడ్డి, భవణయ్య తదితరులు పాల్గొన్నారు.
Feb 21 2023, 08:15