వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కు ఇంటి స్థలాలు ఇవ్వాలి -టి, ఎస్, జే,ఏ, రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
Street Buzz news సూర్యాపేట జిల్లా:
(సూర్యాపేట):- ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారదులుగా కొనసాగుతున్న వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని లేదా ప్రత్యేక ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి డిమాండ్ చేశారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎటువంటి వేతనాలు లాభాపేక్ష ఆశించకుండా నిస్వార్ధంగా జర్నలిస్టు వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం గుర్తించి హైదరాబాద్,సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ లో, ఖమ్మం పట్టణ జర్నలిస్టులకు ఇస్తున్న విధంగానే రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు.అదేవిధంగా ప్రతి జిల్లా నియోజకవర్గ మండలాల కేంద్రాల్లో జర్నలిస్ట్ భవన్ ప్రెస్ క్లబ్బులు ఏర్పాటు చేయాలని జర్నలిస్టుల గౌరవానికి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం హెల్త్ కార్డులు పోలీస్ భరోసా కార్డులు ప్రత్యేకంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది పత్రిక యజమానులు ఇష్టానుసారంగా ధరలు పెట్టి అక్రిడేషన్లను అమ్ముకున్న సంగతి తమ దృష్టికి వచ్చిందని అర్హత లేని వారు జర్నలిజం లో లేనివారు సైతం అక్రిడేషన్లు కొనుగోలు చేసి ప్రభుత్వ రాయితీల కోసం ఎదురుచూస్తున్నారని అలాంటి వారిని ఏరిపారేసి ఎన్నో సంవత్సరాలుగా జర్నలిజంలో కొనసాగుతూ అక్రిడేషన్లు కొనుగోలు చేయలేని పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం గుర్తించాలని తెలిపారు.ప్రభుత్వం కొంతమంది స్వార్థపరులైన జర్నలిస్టులు పత్రికల యజమానులు చానల్ల యజమానుల కొన్ని చానల్లో పనిచేస్తున్న స్వార్థ జర్నలిస్టుల మాట మాటలు విని పూర్తిస్థాయి సర్వే చేయకుండా రాష్ట్రంలో అక్కడక్కడ కొంతమందికే ఇంటి స్థలాలు కేటాయించాలని ఒంటెద్దు పోకడ ఆలోచనలు చేస్తే మిగతా జర్నలిస్టుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఎక్కడైతే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుందో అక్రిడేషన్ లకు అతీతంగా ఎన్నో ఏండ్లుగా వర్కింగ్ లో ఉండి డబ్బులు పెట్టి అక్రిడేషన్లు కొనుగోలు చేయలేని నిరుపేద స్థితిలో ఉండి గత ప్రభుత్వాల నుండి ఎలాంటి లబ్ధి పొందని జర్నలిస్టులకు మొదటి ప్రయారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ విషయమై త్వరలోనే హైదరాబాద్ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.ఈ నిరసన కార్యక్రమానికి తమతో పాటు కలిసి వచ్చే అన్ని జర్నలిస్టు సంఘాలను కలుపుకొని పోతామని జర్నలిస్టులు తమ సమస్యలు పరిష్కారం కోసం యూనియన్లకు అతీతంగా కలిసికట్టుగా ఉద్యమించేందుకు కలిసి రావాలని ఉద్యమానికి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రరాజు జర్నలిస్టులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Feb 20 2023, 17:47