Congress Plenary Session: కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలకు భారీ ఏర్పాట్లు.. బీజేపీని ఓడించడమే లక్ష్యం
Congress Plenary Session From Feb 24 To Feb 26 In Raipur: కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు..
మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు అన్ని రాష్ట్రాల నుంచి 9915 మంది పీసీసీ ప్రతినిధులు, 1338 మంది ఏఐసీసీ ప్రతినిధులు, 487 కోఆప్టెడ్ సభ్యులు పాల్గొననున్నారు. అందులో ఏపీ నుంచి 350, తెలంగాణ నుంచి 238 పీసీసీ ప్రతినిధులు పాల్గొంటారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం.. 12 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులను ఏఐసీసీ సభ్యులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు నిర్వహించే అంశంపై ఫిబ్రవరి 24న తొలిరోజు కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. అలాగే.. మూడు రోజుల ప్లీనరీ సమావేశాల అజెండాను కూడా స్టీరింగ్ కమిటీ ఖరారు చేయనుంది. అనంతరం కాంగ్రెస్ సబ్జెక్ట్స్ కమిటీ.. ప్లీనరీ సమావేశాల్లో ఆమోదించనున్న తీర్మానాలకు తుది రూపునివ్వనుంది. చివరి రోజు (ఫిబ్రవరి 26)న నిర్వహించే భారీ బహిరంగ సభతో ఈ సమావేశాలు ముగియనున్నాయి.
Feb 20 2023, 13:40