ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

చత్రపతి శివాజీ 393వ జయంతి వేడుకల్లో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్. 

Street Buzz news సంగారెడ్డి జిల్లా:

(సంగారెడ్డి):- సదాశివపేట పట్టణంలో భారత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం చత్రపతి శివాజీ 393 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ లాంటి వీరులు మనదేశంలో జన్మించడం గర్వించదగ్గ విషయమని  అలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని దేశభక్తి భావంతో నేటి యువతరం మంచి నడవడికతో మంచి అలవాట్లతో యుద్ధ రణరంగంలో పోరాడే వీరుల అవినీతిని అంతం చేయడానికి అవినీతికి పాల్పడుతున్నటువంటి దేశద్రోహులను వెంటాడి వెంబడించి వారు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ తరిమికొడుతూ చత్రపతి శివాజీ లా ముందుకు సాగాలని తెలియజేశారు. అదేవిధంగా మనం బాగుంటే మన ఆలోచన విధానం బాగుంటే మన ప్రజలు బాగుంటారని, మన ప్రాంతాలు బాగుంటాయని, మన రాష్ట్రాలు బాగుంటాయని మరియు మన దేశం బాగుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భగలేకర్ భగవాన్ , ప్రధాన కార్యదర్శి శివకుమార్, సభ్యులు రాములు, బగలేకర్ విశాల్ కుమార్ , వై భగవంతరావు మరియు పట్టణ ప్రముఖులు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నిమ్మాయల మల్లేశం గారు , పట్టణ ప్రజలు, బాల, బాలికలు , మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.