Cheetahs: మళ్లీ ఎగిరొచ్చిన చీతాలు.. దక్షిణాఫ్రికా నుంచి గ్వాలియర్ చేరుకున్న విమానం
గ్వాలియర్: దాదాపు 74 ఏళ్ల తర్వాత భారత్‌లోకి చీతాలు (Cheetahs) ప్రవేశించగా.. ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగింది. దక్షిణాఫ్రికా (South Africa)తో ఒప్పందంలో భాగంగా 12 చీతాలు శనివారం భారత్ చేరుకున్నాయి..
ఈ వన్యప్రాణులను తీసుకుని జోహన్నెస్‌బర్గ్ నుంచి బయల్దేరిన వాయుసేనకు చెందిన సీ-17 విమానం ఈ ఉదయం గ్వాలియర్ ఎయిర్‌బేస్‌లో దిగింది. అక్కడి నుంచి ఈ చీతాలను శ్యోపూర్ జిల్లాలోని కునో జాతీయ పార్కు (Kuno National Park)కు తరలించనున్నారు.
ఈ మధ్యాహ్నం మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ వీటిని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేయనున్నారు. ఇందులో ఏడు మగ, అయిదు ఆడ చీతాలున్నాయి. వీటి కోసం కునో పార్కులో పది క్వారంటైన్ ఎన్‌క్లోజర్లను సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం.. నెల రోజుల పాటు వీటిని క్వారంటైన్‌లో ఉంచనున్నారు.
Feb 18 2023, 15:59