Kotamreddy: పోరాడుతూనే ఉంటా.. భయపడే ప్రసక్తే లేదు: కోటంరెడ్డి
నెల్లూరు: ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు..
తన అనుచరులను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ''తన అనుచరులు తాటి వెంకటేశ్వర్లు, జావెద్, రఘు అరెస్టు తీరును ఖండిస్తున్నాం. పోలీస్‌స్టేషన్లకు తీసుకెళ్లకుండా హైవేలో తిప్పారు. షాడో సీఎం సజ్జల సూచనల మేరకు పోలీసులు పని చేస్తున్నారు.
నాతో సహా 11మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసుల వేధింపులకు భయపడను. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాను.. తగ్గేదే లేదు'' అని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తేల్చి చెప్పారు.
Feb 18 2023, 15:56