IND vs AUS: తొలి రోజు ఆట పూర్తి.. భారత్ 21/0
దిల్లీ: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట పూర్తయింది.
ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.
క్రీజులో రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (4) ఉన్నారు. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. షమి 4 వికెట్లు తీయగా.. అశ్విన్, జడేజా చెరో 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఆసీస్ బ్యాటర్లలో ఖవాజా (81), పీటర్ (72*) అర్ధశతకాలు సాధించారు.
Feb 17 2023, 17:37