‘అదానీ-హిండెన్‌బర్గ్’.. కమిటీని మేమే నియమిస్తాం: సుప్రీం
దిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం కీలక ప్రకటన చేసింది.
ఇటు పిటిషనర్లు, అటు ప్రభుత్వం నుంచి ఎవరి పేర్లను, సూచనలు, సలహాలు తీసుకోబోమని స్పష్టం చేసింది. అదేవిధంగా కేంద్రం ఇచ్చిన సీల్డ్ కవర్ సూచనలను అంగీకరించబోమని తెలిపింది.
పూర్తి పారదర్శకత ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ వ్యవహారంపై దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను ముగించి తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం.. తామే ఒక నిపుణుల కమిటీని నియమిస్తామని ప్రకటించింది.
Feb 17 2023, 17:27