TS పోలీస్ జాబ్స్: గర్భిణీలు, బాలింతలకు మరో ఛాన్స్
హైదరాబాద్: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య ఎంపిక పరీక్షలకు హాజరుకాలేకపోయిన గర్భిణీలు, బాలింతలకు పోలీసు నియామక మండలి(TSLPRB) మరో అవకాశం కల్పించింది.
ప్రాథమిక పరీక్షలో అర్హత పొందిన వారు మెయిన్స్‌లో అర్హత పొందాక దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనవచ్చిని తెలిపింది.
అయితే ఇందులో పాల్గొనాలంటే మెడికల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని చెప్పింది. ఫిబ్రవరి 28వ తేదీలోపు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
Feb 17 2023, 17:16