KTR: కేంద్రమంత్రుల్లో కిషన్‌రెడ్డి ఆణిముత్యం: కేటీఆర్ వ్యంగ్యాస్త్రం
హైదరాబాద్: తెలంగాణకు నూతన వైద్యకళాశాలల మంజూరు విషయంలో కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
9 వైద్యకళాశాలలు ఇచ్చామని కిషన్‌రెడ్డి(Kishan Reddy).. అసలు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నుంచి ప్రతిపాదనలే రాలేదని మన్‌సుఖ్ మాండవీయ.. రెండు ప్రతిపాదన వచ్చాయని నిర్మలా సీతారామన్ అంటున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.
అబద్ధాలైనా ఎప్పుడూ ఒకేలా చెప్పేలా కేంద్రమంత్రులకు శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీ(PM Modi)కి కేటీఆర్ హితవు పలికారు. అసలు తెలంగాణలోనే లేని 9 వైద్యకళాశాలలను సృష్టించిన ఘనత కిషన్‌రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆయుష్ పేరిట హైదరాబాద్‌లో ఓ కల్పిత గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను కూడా ప్రకటించారన్నారు. కేంద్రమంత్రులు అందరిలో కిషన్‌రెడ్డి ఆణిముత్యం అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Feb 17 2023, 17:14