Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. సాగనంపడం ఖాయం..
Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయం అని హెచ్చరించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్..
జనసేన కార్యాలయంలో సత్తెనపల్లి గంగమ్మకు ఆర్ధిక సాయం అందించిన నాదెండ్ల మనోహార్.. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై ధ్వజమెత్తారు.. రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి అడ్డుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి..
ఇప్పటికీ నష్టపరిహరం ఇవ్వలేదంటూ విమర్శించారు.. దీంతో, బాధితురాలు గంగమ్మకు జనసేన తరపున ఆర్థిక సాయం చేస్తున్నామని వెల్లడించారు.. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దారుణాలు, దాడులు పెరిగాయని విమర్శించారు. జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలు కలిగిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల నుంచి పార్టీ సభల వరకూ ఆంక్షలే అని మండిపడ్డారు.
Feb 17 2023, 17:02