లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు
ఆర్మూర్ పట్టణం: నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. 44వ నంబర్ జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
బస్సు 38 మంది ప్రయాణికులతో రాయచూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నిజామాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్ బాబు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండి బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Feb 17 2023, 15:03