సోము వీర్రాజు ప్రవర్తన నచ్చకే భాజాపాకు రాజీనామా - కన్నా
Street Buzz news గుంటూరు:-
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం పట్ల ఆకర్షితుడినై భాజపా(BJP)లో చేరానని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు..
చేరినప్పటి నుంచి సామాన్య కార్యకర్తగా పనిచేశానని.. దాన్ని గుర్తించే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు.
అయితే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) ప్రవర్తన బాగాలేకనే భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
అయితే మోదీపై ఉన్న అభిమానం ఎప్పటికీ చెక్కుచెదరని చెప్పారు.
త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు.
గుంటూరులో ముఖ్య అనుచరులతో సమావేశం అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు..
''2014లో భాజపాలో చేరా. ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ వచ్చా.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించి 2019 ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించా.
2024 ఎన్నికల్లో ఏపీలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేశా.
సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశా.
ప్రజల తరఫున అనేక సమస్యలపై పోరాడా.
కరోనా తర్వాత నన్ను మార్చి సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేశారు.
ఆయన ప్రవర్తన నచ్చకే రాజీనామా చేశా.
స్థానిక నాయకుల వైఖరి కారణంగా పార్టీలో మనుగడ సాగించలేను.
నాతో పాటు రాజీనామా చేసిన మిత్రులకు ధన్యవాదాలు'' అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
Feb 16 2023, 15:37